Luke - లూకా సువార్త 1 | View All

1. ఘనతవహించిన థెయొఫిలా,

2. ఆరంభమునుండి కన్నులార చూచి వాక్యసేవకులైనవారు మనకు అప్పగించిన ప్రకారము మనమధ్యను నెరవేరిన కార్యములనుగూర్చి వివరముగ వ్రాయుటకు అనేకులు పూనుకొన్నారు

3. గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలిసికొనుటకు వాటినన్నిటిని మొదటనుండి తరచి పరిష్కారముగా తెలిసికొనియున్న నేనును నీ పేరట

4. వాటినిగూర్చి వరుసగా రచించుట యుక్తమని యెంచితిని.

5. యూదయదేశపు రాజైన హేరోదు దినములలో అబీయా తరగతిలోనున్న జెకర్యా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతె; ఆమె పేరు ఎలీసబెతు.

1దిన 24:10 ఏడవది హక్కోజునకు, ఎనిమిదవది అబీయాకు,

6. వీరిద్దరు ప్రభువుయొక్క సకల మైన ఆజ్ఞలచొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులైయుండిరి.

7. ఎలీసబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి; మరియు వారిద్దరు బహు కాలము గడచిన (వృద్ధులైరి. )

8. జెకర్యా తన తరగతి క్రమముచొప్పున దేవునియెదుట యాజక ధర్మము జరిగించుచుండగా

9. యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్లి ధూపమువేయుటకు అతనికి వంతు వచ్చెను.

నిర్గమ 30:7 అహరోను ప్రతిదినము ప్రొద్దున దానిమీద పరిమళద్రవ్యముల ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్కపరచునప్పుడు దానిమీద ఆ ధూపము వేయవలెను.

10. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా

11. ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా

12. జెకర్యా అతని చూచి, తొందరపడి భయపడిన వాడాయెను.

13. అప్పుడా దూత అతనితోజెకర్యా భయపడకుము; నీ ప్రార్థన వినబడినది, నీ భార్యయైన ఎలీసబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు.

14. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై, ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక,

15. తన తల్లిగర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై,

సంఖ్యా 6:3 ద్రాక్షా రసపు చిరకనైనను మద్యపు చిరకనైనను త్రాగవలదు; ఏ ద్రాక్షారసమునైనను త్రాగవలదు; పచ్చివిగాని యెండినవిగాని ద్రాక్షపండ్లను తినవలదు.

న్యాయా 13:4 కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి, ద్రాక్షారసమునేగాని మద్యమునేగాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము.

16. ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును.

17. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానము ననుసరించుటకును త్రిప్పి, ప్రభువు కొరకు ఆయత్తపడియున్న ప్రజలను సిద్ధ పరచుటకై ఏలీయాయొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్లును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును; అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను.

మలాకీ 3:1 ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను; మీరు వెదకుచున్న ప్రభువు, అనగా మీరు కోరు నిబంధన దూత, తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును; ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

మలాకీ 4:5 యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలీయాను మీయొద్దకు పంపుదును.

18. జెకర్యాయిది నాకేలాగు తెలియును? నేను ముసలివాడను, నాభార్యయు బహుకాలము గడచినదని ఆ దూతతో చెప్పగా

ఆది 18:11 అబ్రాహామును శారాయును బహుకాలము గడచిన వృద్ధులై యుండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయెను గనుక

19. దూత నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును; నీతో మాటలాడుట కును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని.

దాని 8:16 అంతట ఊలయి నదీతీరముల మధ్య నిలిచి పలుకుచున్న యొక మనుష్యుని స్వరము వింటిని; అదిగబ్రియేలూ, యీ దర్శనభావమును ఇతనికి తెలియజేయుమని చెప్పెను.

దాని 9:21 నేను ఈలాగున మాటలాడుచు ప్రార్థన చేయుచునుండగా, మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలను ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్నుముట్టెను.

20. మరియు నా మాటలు వాటికాలమందు నెరవేరును; నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివైయుందువని అతనితో చెప్పెను.

21. ప్రజలు జెకర్యాకొరకు కనిపెట్టుచుండి, ఆలయమునందు అతడు ఆలస్యము చేసినందుకు ఆశ్చర్యపడిరి.

22. అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాటలాడలేక పోయినందున, ఆలయమునందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి; అప్పుడతడు వారికి సంజ్ఞలు చేయుచు, మూగవాడై యుండెను.

23. అతడు సేవచేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన యింటికి వెళ్లెను.

24. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలీసబెతు గర్భవతియై మనుష్యులలో నాకుండిన అవమానమును తీసి వేయుటకు

25. నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఈలాగున చేసెననుకొని, అయిదు నెలలు ఇతరుల కంట బడకుండెను.

ఆది 30:23 అప్పుడామె గర్భవతియై కుమారుని కని - దేవుడు నా నింద తొలగించెననుకొనెను.

26. ఆరవ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో

27. దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యకయొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ.

28. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచిదయాప్రాప్తురాలా నీకు శుభము; ప్రభువు నీకు తోడైయున్నాడని చెప్పెను.

29. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా

30. దూత మరియా, భయపడకుము; దేవునివలన నీవు కృపపొందితివి.

31. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు;

ఆది 16:11 మరియు యెహోవా దూత ఇదిగో యెహోవా నీ మొరను వినెను. నీవు గర్భవతివై యున్నావు; నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టుదువు;

న్యాయా 13:3 యెహోవా దూత ఆస్త్రీకి ప్రత్యక్షమై ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపులేకపోయెను; అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు.

యెషయా 7:14 కాబట్టి ప్రభువు తానే యొక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును.

32. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును.

2సమూ 7:12-13 నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడ నిద్రించిన తరువాత నీ గర్భములోనుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి, రాజ్యమును అతనికి స్థిరపరచెదను.అతడు నా నామ ఘనతకొరకు ఒక మందిరమును కట్టించును; అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను;

2సమూ 7:16 నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను.

కీర్త 132:11 నీ గర్భఫలమును నీ రాజ్యముమీద నేను నియమింతును. నీ కుమారులు నా నిబంధనను గైకొనినయెడల నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుస రించినయెడల వారి కుమారులుకూడ నీ సింహాసనముమీద నిత్యము కూర్చుందురని

యెషయా 9:7 ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయమువలనను నీతివలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును. సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తికలిగి దీనిని నెరవేర్చును.

33. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును; ఆయన రాజ్యము అంతములేనిదై యుండునని ఆమెతో చెప్పెను.

మీకా 4:7 కుంటివారిని శేషముగాను దూరమునకు వెళ్లగొట్టబడినవారిని బలమైన జనముగాను నేను చేతును, యెహోవా సీయోను కొండయందు ఇప్పటినుండి శాశ్వతకాలమువరకు వారికి రాజుగా ఉండును.

2సమూ 7:12-13 నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడ నిద్రించిన తరువాత నీ గర్భములోనుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి, రాజ్యమును అతనికి స్థిరపరచెదను.అతడు నా నామ ఘనతకొరకు ఒక మందిరమును కట్టించును; అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను;

2సమూ 7:16 నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను.

34. అందుకు మరియ నేను పురుషుని ఎరుగనిదాననే; యిదేలాగు జరుగునని దూతతో అనగా

35. దూత పరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును.

కీర్త 89:19 అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి యుంటివి నేను ఒక శూరునికి సహాయము చేసియున్నాను ప్రజలలోనుండి యేర్పరచబడిన యొకని నేను హెచ్చించియున్నాను.

36. మరియు నీ బంధువురాలు ఎలీసబెతుకూడ తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించియున్నది; గొడ్రాలనబడిన ఆమెకు ఇది ఆరవమాసము;

37. దేవుడు చెప్పిన యేమాటయైనను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పెను.

ఆది 18:14 యెహోవాకు అసాధ్యమైనది ఏదైన నున్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయకాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను.

38. అందుకు మరియ ఇదిగో ప్రభువు దాసురాలను; నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతట దూత ఆమెయొద్ద నుండి వెళ్లెను.

39. ఆ దినములయందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్లి

40. జెకర్యా యింటిలో ప్రవేశించి, ఎలీసబెతుకు వందనము చేసెను.

41. ఎలీసబెతు మరియయొక్క వందనవచనము వినగానే, ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతట ఎలీసబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను

ఆది 25:22 ఆమె గర్భములో శిశువులు ఒకనితో నొకడు పెనుగులాడిరి గనుక ఆమె ఈలాగైతే నేను బ్రదుకుట యెందుకని అనుకొని యీ విషయమై యెహోవాను అడుగ వెళ్లెను. అప్పుడు యెహోవా ఆమెతో నిట్లనెను

42. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినదానవు నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును

ద్వితి 28:4 నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కి టెద్దులు నీ గొఱ్ఱె మేకల మందలు దీవింపబడును;

న్యాయా 5:24 కయీనీయుడైన హెబెరు భార్య యాయేలు స్త్రీలలో దీవెననొందును గుడారములలో నుండు స్త్రీలలో ఆమె దీవెన నొందును.

43. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేలాగు ప్రాప్తించెను?

44. ఇదిగో నీ శుభవచనము నా చెవినిపడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను.

45. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను.

46. అప్పుడు మరియ యిట్లనెను నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది.

1సమూ 2:1 మరియు హన్నా విజ్ఞాపనచేసి యీలాగనెను నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది. యెహోవాయందు నాకు మహా బలముకలిగెనునీవలని రక్షణనుబట్టి సంతోషించుచున్నానునావిరోధులమీద నేను అతిశయపడుదును.

కీర్త 113:7-8 ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకైఆయన నేలనుండి దరిద్రులను లేవనెత్తువాడు పెంట కుప్పమీదనుండి బీదలను పైకెత్తువాడు

47. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను

1సమూ 2:1 మరియు హన్నా విజ్ఞాపనచేసి యీలాగనెను నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది. యెహోవాయందు నాకు మహా బలముకలిగెనునీవలని రక్షణనుబట్టి సంతోషించుచున్నానునావిరోధులమీద నేను అతిశయపడుదును.

48. నా ఆత్మ నా రక్షకుడైన దేవునియందు ఆనందించెను.

1సమూ 1:11 సైన్యములకధిపతివగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగియున్న శ్రమను చూచి, నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసికొని, నీ సేవకురాలనైన నాకు మగ పిల్లను దయచేసినయెడల, వాని తలమీదికి క్షౌరపుకత్తి యెన్నటికి రానియ్యక, వాడు బ్రదుకు దినములన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసికొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను,

49. సర్వశక్తిమంతుడు నాకు గొప్పకార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్నితరములవారును నన్ను ధన్యురాలని యందురు. ఆయన నామము పరిశుద్ధము.

కీర్త 111:9 ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది.

50. ఆయనకు భయపడువారిమీద ఆయన కనికరము తరతరములకుండును.

కీర్త 103:17 ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడల ననుసరించి నడచుకొను వారిమీద యెహోవాయందు భయభక్తులు గలవారిమీద

51. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను.

2సమూ 22:28 శ్రమపడువారిని నీవు రక్షించెదవు గర్విష్ఠులకు విరోధివై వారిని అణచి వేసెదవు

కీర్త 89:10 చంపబడినదానితో సమానముగా నీవు రహబును, ఐగుప్తును నలిపివేసితివి నీ బాహుబలము చేత నీ శత్రువులను చెదరగొట్టితివి.

52. సింహాసనములనుండి బలవంతులను పడద్రోసి దీనుల నెక్కించెను

1సమూ 2:7 యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయు వాడు క్రుంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే.

యోబు 5:11 అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును దుఃఖపడువారిని క్షేమమునకు లేవనెత్తును.

యోబు 12:19 యాజకులను వస్త్రహీనులనుగా చేసి వారిని తోడుకొని పోవును స్థిరముగా నాటుకొనిన వారిని ఆయన పడగొట్టును.

53. ఆకలిగొనినవారిని మంచి పదార్థములతో సంతృప్తి పరచి ధనవంతులను వట్టిచేతులతో పంపివేసెను.

1సమూ 2:5 తృప్తిగా భుజించినవారు అన్నము కావలెనని కూలికిపోవుదురుఆకలి గొనినవారు ఆకలితీర తిందురు గొడ్రాలు ఏడుగురు పిల్లలను కనును అనేకమైన పిల్లలను కనినది కృశించి పోవును.

కీర్త 107:9 ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి యున్నాడు. ఆకలి గొనినవారి ప్రాణమును మేలుతో నింపి యున్నాడు.

54. అబ్రాహామునకును అతని సంతానమునకును యుగాంతమువరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసికొందునని మనపితరులతో సెలవిచ్చినట్టు

కీర్త 98:3 ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకము చేసికొనియున్నాడు భూదిగంత నివాసులందరు మన దేవుడు కలుగజేసిన రక్షణను చూచిరి.

యెషయా 41:8-9 నా సేవకుడవైన ఇశ్రాయేలూ, నేనేర్పరచుకొనిన యాకోబూ, నా స్నేహితుడైన అబ్రాహాము సంతానమా,భూదిగంతములనుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా,

55. ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేసెను.

ఆది 17:7 నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై యుండునట్లు, నాకును నీకును, నీ తరువాత వారి తరములలో నీ సంతతికిని మధ్య నా నిబంధనను నిత్యనిబంధనగా స్థిరపరచెదను.

ఆది 22:17 నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్రతీరమందలి యిసుకవలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను; నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు.

మీకా 7:20 పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రాహాము యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహింతువు.

56. అంతట మరియ, యించుమించు మూడు నెలలు ఆమెతోకూడ ఉండి, పిమ్మట తన యింటికి తిరిగి వెళ్లెను.

57. ప్రసవకాలము వచ్చినప్పుడు ఎలీసబెతు కుమారుని కనెను.

58. అప్పుడు ప్రభువు ఆమెమీద మహాకనికరముంచెనని ఆమె పొరుగువారును బంధువులును విని ఆమెతో కూడ సంతోషించిరి.

59. ఎనిమిదవ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి, తండ్రి పేరునుబట్టి జెకర్యా అను పేరు వానికి పెట్టబోవుచుండగా

ఆది 17:12 ఎనిమిది దినముల వయస్సు గలవాడు, అనగా నీ యింట పుట్టినవాడైనను, నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనను, మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను.

లేవీ 12:3 ఎనిమిదవ దినమున బిడ్డకు సున్నతి చేయింప వలెను.

60. తల్లి ఆలాగు వద్దు; వానికి యోహానను పేరు పెట్టవలెనని చెప్పెను.

61. అందుకు వారు నీ బంధువులలో ఆ పేరు గలవాడెవడును లేడే అని ఆమెతో చెప్పి

62. వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వాని తండ్రికి సంజ్ఞలుచేసి అడిగిరి.

63. అతడు వ్రాతపలక తెమ్మని వాని పేరు యోహానని వ్రాసెను; అందుకు వారందరు ఆశ్చర్యపడిరి.

64. వెంటనే అతని నోరు తెరవబడి, నాలుక సడలి, అతడు దేవుని స్తుతించుచు మాటలాడసాగెను.

65. అందునుబట్టి వారి చుట్టుపట్ల కాపురమున్న వారికందరికిని భయము కలిగెను. ఆ సంగతులన్నియు యూదయ కొండసీమలయందంతట ప్రచురమాయెను.

66. ప్రభువు హస్తము అతనికి తోడైయుండెను గనుక ఆ సంగతులను గూర్చి వినినవారందరును ఈ బిడ్డ యేలాటివాడగునో అని వాటిని మనస్సులో ఉంచుకొనిరి.

67. మరియు అతని తండ్రి జెకర్యా పరిశుద్ధాత్మపూర్ణుడై యిట్లు ప్రవచించెను

68. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక

కీర్త 41:13 ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వతకాలమునుండి శాశ్వతకాలమువరకు స్తుతింపబడును గాక. ఆమేన్‌. ఆమేన్‌.

కీర్త 72:18 దేవుడైన యెహోవా ఇశ్రాయేలుయొక్క దేవుడు స్తుతింపబడును గాక ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయువాడు.

కీర్త 106:48 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యుగములన్నిటను స్తుతినొందును గాక ప్రజలందరుఆమేన్‌ అందురుగాక. యెహోవానుస్తుతించుడి.

కీర్త 111:9 ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది.

69. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి, వారికి విమోచన కలుగజేసెను

1సమూ 2:10 యెహోవాతో వాదించువారు నాశనమగుదురు పరమండలములో నుండి ఆయన వారిపైన యురుమువలె గర్జించును లోకపు సరిహద్దులలో నుండువారికి ఆయన తీర్పు తీర్చునుతాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చునుతాను అభిషేకించినవానికి అధిక బలము కలుగజేయును.

కీర్త 18:2 యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించు వాడు నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు నేను ఆశ్రయించియున్న నా దుర్గము.

కీర్త 132:17 అక్కడ దావీదునకు కొమ్ము మొలవ జేసెదను నా అభిషిక్తునికొరకు నే నచ్చట ఒక దీపము సిద్ధపరచి యున్నాను.

యిర్మియా 30:9 వారు తమ దేవుడైన యెహోవానగు నేను వారిమీద రాజుగా నియమించు దావీదును సేవించుదురు.

70. తన సేవకుడైన దావీదు వంశమునందు మనకొరకు రక్షణశృంగమును, అనగా

71. మన శత్రువులనుండియు మనలను ద్వేషించు వారందరి చేతినుండియు తప్పించి రక్షణ కలుగజేసెను.

కీర్త 106:10 వారి పగవారి చేతిలోనుండి వారిని రక్షించెను శత్రువుల చేతిలోనుండి వారిని విమోచించెను.

72. దీనినిగూర్చి ఆయన ఆదినుండి తన పరిశుద్ధప్రవక్తల నోట పలికించెను.

ఆది 22:16-17 నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుకతీయక యీ కార్యము చేసినందుననేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్రతీరమందలి యిసుకవలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను; నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు.

లేవీ 26:42 నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసి కొందును; నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను నేను అబ్రాహాముతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసికొందును; ఆ దేశమునుకూడ జ్ఞాపకము చేసికొందును.

కీర్త 105:8-9 తాను సెలవిచ్చిన మాటను వెయ్యి తరములవరకు అబ్రాహాముతో తాను చేసిన నింబధననుఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసికొనును.

కీర్త 106:45-46 వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకము చేసికొనెను తన కృపాబాహుళ్యమునుబట్టి వారిని కరుణించెను.వారిని చెరగొనిపోయిన వారికందరికి వారియెడల కనికరము పుట్టించెను.

ఆది 17:7 నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై యుండునట్లు, నాకును నీకును, నీ తరువాత వారి తరములలో నీ సంతతికిని మధ్య నా నిబంధనను నిత్యనిబంధనగా స్థిరపరచెదను.

73. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రియైన

ఆది 17:7 నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై యుండునట్లు, నాకును నీకును, నీ తరువాత వారి తరములలో నీ సంతతికిని మధ్య నా నిబంధనను నిత్యనిబంధనగా స్థిరపరచెదను.

74. అబ్రాహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసికొనుటకును

75. మనము శత్రువుల చేతినుండి విడిపింపబడి, మన జీవిత కాలమంతయు నిర్భయులమై, ఆయన సన్నిధిని

76. పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను.

యెషయా 40:3 ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాళము చేయుడి.

మలాకీ 3:1 ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను; మీరు వెదకుచున్న ప్రభువు, అనగా మీరు కోరు నిబంధన దూత, తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును; ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

77. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్తవనబడుదువు మన దేవుని మహా వాత్సల్యమునుబట్టి వారి పాపములను క్షమించుటవలన

78. తన ప్రజలకు రక్షణజ్ఞానము ఆయన అనుగ్రహించునట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు.

యెషయా 9:2 చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు మరణచ్ఛాయగల దేశనివాసులమీద వెలుగు ప్రకాశించును.

యెషయా 58:8 వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము లిచ్చుటయు ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము? ఆలాగున నీవు చేసినయెడల నీ వెలుగు వేకువ చుక్కవలె ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందర నడచును యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును.

యెషయా 60:1-2 నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము యెహోవా మహిమ నీమీద ఉదయించెను.చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటికచీకటి జనములను కమ్ముచున్నది యెహోవా నీమీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీమీద కనబడుచున్నది

మలాకీ 4:2 అయితే నా నామమందు భయ భక్తులుగలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును; అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు.

79. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించునట్లు చీకటిలోను మరణచ్ఛాయలోను కూర్చుండువారికి వెలుగిచ్చుటకై ఆ మహా వాత్సల్యమునుబట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమనుగ్రహించెను.

యెషయా 9:2 చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు మరణచ్ఛాయగల దేశనివాసులమీద వెలుగు ప్రకాశించును.

యెషయా 58:8 వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము లిచ్చుటయు ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము? ఆలాగున నీవు చేసినయెడల నీ వెలుగు వేకువ చుక్కవలె ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందర నడచును యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును.

యెషయా 60:1-2 నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము యెహోవా మహిమ నీమీద ఉదయించెను.చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటికచీకటి జనములను కమ్ముచున్నది యెహోవా నీమీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీమీద కనబడుచున్నది

మలాకీ 4:2 అయితే నా నామమందు భయ భక్తులుగలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును; అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు.

80. శిశువు ఎదిగి, ఆత్మయందు బలము పొంది, ఇశ్రాయేలు నకు ప్రత్యక్షమగు దినమువరకు అరణ్యములో నుండెను.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Luke - లూకా సువార్త 1 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

ముందుమాట. (1-4) 
క్రైస్తవులు భిన్నాభిప్రాయాలు మరియు అంతర్గత సంకోచాలను కలిగి ఉండే అంశాలపై ప్రసంగించడం లూకా మానేశాడు. బదులుగా, అతను నిస్సందేహంగా నిజమైన మరియు దృఢమైన నమ్మకానికి అర్హమైన విషయాలపై దృష్టి పెడతాడు. క్రీస్తు బోధలు అత్యంత వివేచన మరియు సద్గురువులచే తిరుగులేని హామీ మరియు సంతృప్తితో స్వీకరించబడ్డాయి. ఇంకా, మన విశ్వాసం ఆధారపడిన ముఖ్యమైన సంఘటనలు మొదటి నుండి ప్రత్యక్ష సాక్షులుగా మరియు దైవిక వాక్యానికి అంకితమైన పరిచారకులుగా ఉన్న వ్యక్తులచే సూక్ష్మంగా నమోదు చేయబడ్డాయి. ఈ సంఘటనల గురించి వారి అవగాహన దైవిక ప్రేరణ ద్వారా పరిపూర్ణం చేయబడింది.

జకారియాస్ మరియు ఎలిసబెత్. (5-25) 
బాప్టిస్ట్ జాన్ యొక్క తల్లిదండ్రులు, అందరిలాగే, పాపులు, మరియు వారు సమర్థించబడ్డారు మరియు ఇతరుల మాదిరిగానే రక్షించబడ్డారు. అయినప్పటికీ, వారు ముఖ్యంగా భక్తిపరులు మరియు నిటారుగా ఉన్నారు. పిల్లలు లేనప్పటికీ, ఎలిసబెత్ తన వృద్ధాప్యంలో పిల్లలు పుట్టడం అసంభవం అనిపించింది. జకర్యా దేవాలయంలో ధూపం వేస్తుండగా, బయట ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రార్థనలు చేస్తున్నారు. దేవునికి మన ప్రార్థనలన్నీ అంగీకరించబడతాయి మరియు పరలోక దేవాలయంలో క్రీస్తు మధ్యవర్తిత్వం ద్వారా మాత్రమే ప్రభావవంతంగా ఉంటాయి. మనం మన ఆత్మలతో మరియు శ్రద్ధతో హృదయపూర్వకంగా ప్రార్థిస్తే తప్ప మన ప్రార్థనలు వినబడతాయని మనం ఆశించలేము.
మన ప్రార్థనల అంగీకారం మరియు నెరవేర్పు, ఉత్తమమైనవి కూడా, నిరంతరం మధ్యవర్తిత్వం వహించే మరియు జీవించే క్రీస్తు మధ్యవర్తిత్వంపై ఆధారపడి ఉంటాయి. జకారియా ప్రార్థనలకు శాంతియుత స్పందన లభించింది. విశ్వాసం యొక్క ప్రార్థనలు స్వర్గంలో నమోదు చేయబడ్డాయి మరియు ఎప్పటికీ మరచిపోలేవు. యవ్వనంలో చేసిన ప్రార్థనలు వృద్ధాప్యంలో సమాధానం పొందవచ్చు. ప్రార్థనకు ప్రతిస్పందనగా పొందిన ఆశీర్వాదాలు ముఖ్యంగా మధురమైనవి.
తన వృద్ధాప్యంలో, జకారియాకు ఒక కుమారుడు ఉంటాడు, అతను చాలా మంది ఆత్మలను దేవునికి మార్చడంలో మరియు క్రీస్తు సువార్తను స్వీకరించడానికి వారిని సిద్ధం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాడు. ఈ కొడుకు ధైర్యం, ఉత్సాహం, పవిత్రత మరియు ప్రాపంచిక ఆసక్తులు మరియు ఆనందాల నుండి వేరు చేయబడిన హృదయంతో క్రీస్తు ముందు వెళ్తాడు. అవిధేయులు మరియు తిరుగుబాటుదారులు తమ నీతిమంతుల పూర్వీకుల జ్ఞానం వైపు మళ్లుతారు మరియు మరింత ముఖ్యంగా, రాబోయే జస్ట్ వన్ యొక్క జ్ఞానాన్ని గమనించండి.
దేవదూత చెప్పినదంతా జకారియా విన్నాడు, కానీ అతని అవిశ్వాసం బిగ్గరగా మాట్లాడింది. దేవుడు, తన న్యాయం ప్రకారం, అతను దేవుని వాక్యాన్ని అనుమానించినందున అతనిని మూగగా కొట్టాడు. దేవుడు మనపట్ల చూపిన ఓర్పు విశేషమైనది. అతను జకారియాస్‌ని నిశ్శబ్దం చేయడంలో దయతో వ్యవహరించాడు, అవిశ్వాస పదాలను నిరోధించాడు. ఇది జకారియా విశ్వాసాన్ని బలపరచడానికి కూడా ఉపయోగపడింది. దేవుడు మన పాపాలకు మనలను గద్దించినప్పుడు, మరియు ఇది అతని మాటపై ఎక్కువ నమ్మకానికి దారితీసినప్పుడు, మనం ఫిర్యాదు చేయడానికి ఎటువంటి కారణం లేదు.
నిజమైన విశ్వాసులు కూడా అవిశ్వాసంతో పోరాడవచ్చు మరియు దేవుణ్ణి అవమానించవచ్చు. అయినప్పటికీ, వారి నిశ్శబ్దం మరియు గందరగోళం, దేవుని క్రమశిక్షణ ద్వారా తీసుకురాబడి, చివరికి సంతోషంతో మరియు కృతజ్ఞతతో ఆయనను స్తుతించేలా చేస్తుంది. మనపట్ల దేవుని దయ మరియు శ్రద్ధను మనం గమనించాలి. ఆయన కనికరం మరియు అనుగ్రహం మనపై ఉన్నాయి, ఆయన మనతో వ్యవహరించే విధానాన్ని నడిపిస్తున్నారు.

క్రీస్తు జననం ప్రకటించబడింది. (26-38) 
ఇక్కడ, మన ప్రభువు తల్లికి సంబంధించిన ఖాతా ఉంది. మనం ఆమెకు ప్రార్థించనప్పటికీ, క్రీస్తు పుట్టుకలో ఆమె పాత్ర కోసం మనం ఖచ్చితంగా మన స్తోత్రాన్ని దేవునికి సమర్పించాలి. క్రీస్తు జననం ఒక అద్భుతం కావాలి. దేవదూత యొక్క శుభాకాంక్షల యొక్క ముఖ్య ఉద్దేశ్యం, "యూదు తల్లులు చాలా కాలంగా కోరుకునే గౌరవాన్ని సాధించడానికి సర్వోన్నతునిచే ప్రత్యేకంగా ఎంపిక చేయబడిన మరియు ఆదరణ పొందిన మీకు నమస్కారాలు."
ఈ అసాధారణ వందనం మరియు దేవదూత రూపాన్ని అర్థం చేసుకోగలిగే విధంగా మేరీ ఇబ్బంది పెట్టింది. దేవదూత ఆమెకు అభయమిచ్చాడు, ఆమె దేవుని దయను పొందిందని మరియు ఒక కుమారునికి తల్లి అవుతానని, ఆమె ప్రభువైన దేవుని స్వభావాన్ని మరియు పరిపూర్ణతను పూర్తిగా పంచుకుంటూ, అత్యున్నత కుమారుడైన యేసు అని పేరు పెట్టింది. యేసు! ఈ పేరు వినయపూర్వకమైన పాపులకు ఓదార్పు మరియు ఆశను కలిగిస్తుంది, మాట్లాడటానికి మరియు వినడానికి మధురంగా ఉంటుంది. యేసు, రక్షకుడా! కొన్నిసార్లు, మేము అతని సంపదలను మరియు మన స్వంత పేదరికాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమవుతాము మరియు అందువల్ల, మనం ఆయనను వెతకము. మన కోల్పోయిన మరియు నశిస్తున్న స్థితి యొక్క లోతులను మనం గుర్తించలేకపోవచ్చు, కాబట్టి "రక్షకుడు" అనే పదం మనకు పెద్దగా ప్రాముఖ్యతను కలిగి ఉండకపోవచ్చు. మనపై ఉన్న అపారమైన అపరాధ భారం గురించి మరియు రాబోయే కోపం గురించి మనకు పూర్తిగా తెలిసి ఉంటే, "రక్షకుడు నావాడా?" అని మనం నిరంతరం ఆలోచిస్తాము. మరియు ఆయనను మన స్వంత వ్యక్తిగా గుర్తించేందుకు, ఆయనకు మన మార్గానికి ఆటంకం కలిగించే దేనినైనా మనం అధిగమిస్తాము.
దేవదూతకు మేరీ యొక్క ప్రతిస్పందన ఆమె విశ్వాసం మరియు వినయపూర్వకమైన అద్భుతం యొక్క అభివ్యక్తి. ఆమె తన విశ్వాసాన్ని ధృవీకరించడానికి సంకేతాన్ని వెతకలేదు. నిస్సందేహంగా, దైవభక్తి యొక్క మర్మము గొప్పది-దేవుడు శరీరములో ప్రత్యక్షమయ్యాడు 1 తిమోతికి 3:16 క్రీస్తు యొక్క మానవ స్వభావాన్ని దైవిక స్వభావంతో దాని ఐక్యతకు తగిన విధంగా ఉనికిలోకి తీసుకురావాలి. మేరీ లాగా, మన పోరాటాలన్నిటిలో మన కోరికలను దేవుని వాక్యంతో సమలేఖనం చేయాలి. ప్రతి సవాలులో, దేవునితో, అసాధ్యం ఏదీ లేదని గుర్తుంచుకోండి. ఆయన వాగ్దానాలను మనం చదువుతూ, వింటున్నప్పుడు, "ఇదిగో, నేను ప్రభువుకు ఇష్టపూర్వకమైన సేవకుడను, నీ మాట ప్రకారం నాకు జరుగునుగాక" అని చెప్పి వాటిని ప్రార్థనలుగా మారుద్దాము.

మేరీ మరియు ఎలిసబెత్ యొక్క ఇంటర్వ్యూ. (39-56) 
వారి ఆత్మలలో దయ యొక్క పని ప్రారంభించిన వారు తమ అనుభవాలను ఒకరితో ఒకరు పంచుకోవడం చాలా ప్రయోజనకరం. మేరీ వచ్చినప్పుడు, ఎలిసబెత్ గొప్ప విమోచకుడికి తల్లి కాబోయే స్త్రీ ఉనికిని గ్రహించింది. అదే సమయంలో, ఆమె పరిశుద్ధాత్మతో నిండిపోయింది మరియు అతని ప్రభావంతో, మేరీ మరియు ఆమె ఆశించిన బిడ్డ అత్యంత ఆశీర్వాదం మరియు దయతో ఉన్నారని, సర్వోన్నతుడైన దేవునికి లోతైన గౌరవం ఉందని ప్రకటించింది.
ఎలిసబెత్ మాటల నుండి ప్రేరణ పొంది, అలాగే పరిశుద్ధాత్మచే మార్గనిర్దేశం చేయబడి, మేరీ ఆనందం, ఆశ్చర్యం మరియు కృతజ్ఞతతో పొంగిపోయింది. వాగ్దానము చేయబడిన మెస్సీయతో తనకున్న సంబంధము ద్వారానే దేవునిలో తన సంతోషము కలుగునని గ్రహించి, రక్షకుని అవసరమున్న పాపిగా ఆమె తనను తాను గుర్తించింది. క్రీస్తుపై తమ ఆధారపడటాన్ని గుర్తించి, నీతి కోసం ఆరాటపడి, ఆయనలో జీవాన్ని కోరుకునే వారు, ఆయన అందించే అత్యుత్తమ బహుమతులతో తమను తాము సమృద్ధిగా ఆశీర్వదిస్తారు. ఆత్మీయ ఆశీర్వాదాల కోసం తహతహలాడే ఆత్మలో నిరాడంబరుల కోరికలను ఆయన తీరుస్తాడు, స్వయం సమృద్ధిగా ఉన్నవారు ఖాళీ చేతులతో వెళ్లిపోతారు.

జాన్ ది బాప్టిస్ట్ జననం. (57-66) 
ఈ వచనాలు జాన్ బాప్టిస్ట్ యొక్క పుట్టుక మరియు అతని కుటుంబ సభ్యులు అనుభవించిన అపారమైన ఆనందాన్ని అందిస్తాయి. అతనికి జోహానాన్ అని పేరు పెట్టాలి, అంటే "దయగలవాడు" అని అర్థం, అతను క్రీస్తు సువార్తను పరిచయం చేస్తాడు, అక్కడ దేవుని కృప చాలా అద్భుతంగా ప్రకాశిస్తుంది. అవిశ్వాసం కారణంగా మాట్లాడే సామర్థ్యాన్ని కోల్పోయిన జకారియస్, అతను నమ్మినప్పుడు తన గొంతును తిరిగి పొందాడు. నమ్మకం మనల్ని మాట్లాడేలా చేస్తుందని ఇది వివరిస్తుంది. దేవుడు మన నోరు తెరిచినప్పుడు, ఆయనను స్తుతించడానికి మనం వాటిని ఉపయోగించాలి. దేవుని స్తుతించడం మానుకోవడం కంటే మౌనంగా ఉండడం మేలు. చిన్నప్పటి నుండి యోహానులో ప్రభువు హస్తం పని చేస్తుందని ప్రస్తావించబడింది. శిశువులను ప్రభావితం చేయడానికి దేవుడు రహస్యమైన మార్గాలను కలిగి ఉన్నాడు మరియు మనం దేవుని చర్యలపై శ్రద్ధ వహించాలి మరియు ఫలితం కోసం ఓపికగా ఎదురుచూడాలి.

జకారియాస్ పాట. (67-80)
మెస్సీయ రాజ్యం మరియు మోక్షానికి సంబంధించి జకారియా ప్రవచనం చెప్పాడు. సువార్త ప్రకాశాన్ని తెస్తుంది; ఇది కొత్త రోజు రాకను తెలియజేస్తుంది. జాన్ ది బాప్టిస్ట్ విషయానికొస్తే, అది తెల్లవారడం ప్రారంభించింది మరియు దాని పూర్తి ప్రకాశం వైపు క్రమంగా పురోగమించింది. సువార్త ఒక ఆవిష్కరణ; ఇది మునుపు చీకటిలో కప్పబడి ఉన్నదానిని వెల్లడిస్తుంది, యేసుక్రీస్తు వ్యక్తిలో కనుగొనబడిన దేవుని మహిమ గురించిన జ్ఞానపు వెలుగును అందిస్తుంది. ఇది పునరుజ్జీవింపజేయడం; మృత్యువు నీడలో నివసించే వారికి, చెరసాలలో శిక్ష విధించబడిన ఖైదీల వలె వెలుగునిస్తుంది. ఇది మార్గదర్శకం; అది మన అడుగులను శాంతి మార్గం వైపు మళ్లిస్తుంది, మనలను అంతిమ శాంతికి నడిపిస్తుంది రోమీయులకు 3:17 జాన్ దృఢమైన విశ్వాసం, దృఢమైన మరియు నీతివంతమైన భావోద్వేగాలు మరియు ప్రపంచం యొక్క భయం మరియు ఆప్యాయత నుండి నిర్లిప్తతను ప్రదర్శించాడు. అతను మెస్సీయకు పూర్వగామిగా ఉద్భవించే వరకు అతను నిశ్శబ్దంగా జీవించినప్పటికీ, ఇది అతనిని ఉద్దేశపూర్వక జీవితానికి సిద్ధం చేసింది. మనం ప్రజలందరితో సామరస్యంగా జీవించడానికి ప్రయత్నించాలి, అదే సమయంలో దేవునితో మరియు మన స్వంత మనస్సాక్షితో శాంతిని కోరుకోవాలి. మన కొరకు దేవుని ప్రణాళిక లోకంలో అస్పష్టంగా ఉండిపోయినప్పటికీ, మనం యేసుక్రీస్తు కృపలో ఎదుగుదలను శ్రద్ధగా కొనసాగించాలి.



Shortcut Links
లూకా - Luke : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |