Luke - లూకా సువార్త 6 | View All

1. ఒక విశ్రాంతిదినమున ఆయన పంటచేలలోబడి వెళ్లుచుండగా, ఆయన శిష్యులు వెన్నులు త్రుంచి, చేతులతో నలుపుకొని, తినుచుండిరి.
ద్వితీయోపదేశకాండము 23:25

1. And it was don in the secounde firste sabat, whanne he passid bi cornes, hise disciplis pluckiden eeris of corn; and thei frotynge with her hondis, eeten.

2. అప్పుడు పరిసయ్యులలో కొందరు విశ్రాంతిదినమున చేయదగనిది మీరెందుకు చేయుచున్నారని వారినడుగగా

2. And summe of the Farisees seiden to hem, What doon ye that, that is not leeueful in the sabotis?

3. యేసు వారితో ఇట్లనెను తానును తనతో కూడ ఉన్నవారును ఆకలిగొనినప్పుడు దావీదు ఏమిచేసెనో అదియైనను మీరు చదువలేదా?

3. And Jhesus answeride, and seide to hem, Han ye not redde, what Dauith dide, whanne he hungride, and thei that weren with hym;

4. అతడు దేవుని మందిరములో ప్రవేశించి, యాజకులు తప్ప మరి ఎవరును తినకూడని సముఖపు రొట్టెలు తీసికొని తిని, తనతో కూడ ఉన్నవారికిని ఇచ్చెను గదా అనెను.
లేవీయకాండము 24:5-9, 1 సమూయేలు 21:6

4. hou he entride in to the hous of God, and took looues of proposicioun, and eet, and yaf to hem that weren with hem; whiche looues it was not leeueful to eete, but oonli to prestis.

5. కాగా మనుష్యకుమారుడు విశ్రాంతిదినమునకును యజమానుడని వారితో చెప్పెను.

5. And he seide to hem, For mannus sone is lord, yhe, of the sabat.

6. మరియొక విశ్రాంతిదినమున ఆయన సమాజమందిరము లోనికి వెళ్లి బోధించుచున్నప్పుడు, అక్కడ ఊచ కుడి చెయ్యిగలవాడొకడుండెను.

6. And it was don in another sabat, that he entride in to a synagoge, and tauyte. And a man was there, and his riyt hoond was drie.

7. శాస్త్రులును పరిసయ్యులును ఆయనమీద నేరము మోపవలెనని, విశ్రాంతిదినమున స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి;

7. And the scribis and Farisees aspieden hym, if he wolde heele hym in the sabat, that thei schulden fynde cause, whereof thei schulden accuse hym.

8. అయితే ఆయన వారి ఆలోచన లెరిగి, ఊచచెయ్యిగలవానితో నీవు లేచి మధ్యను నిలువుమని చెప్పగా, వాడు లేచి నిలిచెను.
1 సమూయేలు 16:7

8. And he wiste the thouytis of hem, and he seide to the man that hadde a drie hoond, Rise vp, and stonde in to the myddil. And he roos, and stood.

9. అప్పుడు యేసు విశ్రాంతిదినమున మేలుచేయుట ధర్మమా కీడుచేయుట ధర్మమా? ప్రాణరక్షణ ధర్మమా ప్రాణ హత్య ధర్మమా? అని మిమ్ము నడుగుచున్నానని వారితో చెప్పి

9. And Jhesus seide to hem, Y axe you, if it is leueful to do wel in the sabat, or yuel? to make a soule saaf, or to leese?

10. వారినందరిని చుట్టు కలయజూచి నీ చెయ్యి చాపుమని వానితో చెప్పెను; వాడాలాగు చేయగానే వాని చెయ్యి బాగుపడెను.

10. And whanne he hadde biholde alle men aboute, he seide to the man, Hold forth thin hoond. And he held forth, and his hond was restorid to helthe.

11. అప్పుడు వారు వెఱ్ఱికోపముతో నిండుకొని, యేసును ఏమి చేయుదమా అని యొకనితోనొకడు మాటలాడుకొనిరి.

11. And thei weren fulfillid with vnwisdom, and spaken togidir, what thei schulden do of Jhesu.

12. ఆ దినములయందు ఆయన ప్రార్థనచేయుటకు కొండకు వెళ్లి, దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను.

12. And it was don in tho daies, he wente out in to an hil to preye; and he was al nyyt dwellynge in the preier of God.

13. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి, వారిలో పండ్రెండుమందిని ఏర్పరచి, వారికి అపొస్తలులు అను పేరు పెట్టెను.

13. And whanne the day was come, he clepide hise disciplis, and chees twelue of hem, whiche he clepide also apostlis;

14. వీరెవరనగా ఆయన ఎవనికి పేతురు అను మారుపేరు పెట్టెనో ఆ సీమోను, అతని సహోదరుడైన అంద్రెయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తొలొమయి,

14. Symount, whom he clepide Petir, and Andrew, his brothir, James and Joon,

15. మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడైన యాకోబు, జెలోతే అనబడిన సీమోను,

15. Filip and Bartholomew, Matheu and Thomas, James Alphei, and Symount, that is clepid Zelotes,

16. యాకోబు సహోదరుడైన యూదా, ద్రోహియగు ఇస్కరియోతు యూదా అను వారు.

16. Judas of James, and Judas Scarioth, that was traytoure.

17. ఆయన వారితో కూడ దిగివచ్చి మైదానమందు నిలిచినప్పుడు ఆయన శిష్యుల గొప్ప సమూహమును, ఆయన బోధ వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును యూదయ దేశమంతటినుండియు, యెరూషలేము నుండియు, తూరు సీదోనను పట్టణముల సముద్ర తీరముల నుండియు వచ్చిన బహుజనసమూహమును,

17. And Jhesus cam doun fro the hil with hem, and stood in a feeldi place; and the cumpeny of hise disciplis, and a greet multitude of puple, of al Judee, and Jerusalem, and of the see coostis, and of Tyre and Sidon,

18. అపవిత్రాత్మల చేత బాధింపబడినవారును వచ్చి స్వస్థతనొందిరి.

18. that camen to here hym, and to be heelid of her siknessis; and thei that weren trauelid of vncleene spiritis, weren heelid.

19. ప్రభావము ఆయనలోనుండి బయలుదేరి అందరిని స్వస్థపరచుచుండెను గనుక జనసమూహమంతయు ఆయనను ముట్ట వలెనని యత్నముచేసెను.

19. And al puple souyte to touche hym, for vertu wente out of hym, and heelide alle.

20. అంతట ఆయన తన శిష్యులతట్టు పారచూచి ఇట్లనెను బీదలైన మీరు ధన్యులు, దేవునిరాజ్యము మీది.

20. And whanne hise iyen weren cast vp in to hise disciplis, he seide, Blessid be ye, `pore men, for the kyngdom of God is youre.

21. ఇప్పుడు అకలిగొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తి పరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు.
కీర్తనల గ్రంథము 126:5-6, యెషయా 61:3, యిర్మియా 31:25

21. Blessid be ye, that now hungren, for ye schulen be fulfillid. Blessid be ye, that now wepen, for ye schulen leiye.

22. మనుష్యకుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మును ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయునప్పుడు మీరు ధన్యులు.

22. Ye schulen be blessid, whanne men schulen hate you, and departe you awei, and putte schenschip to you, and cast out youre name as yuel, for mannus sone.

23. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి; ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదైయుండును; వారి పితరులు ప్రవక్తలకు అదే విధముగా చేసిరి.
2 దినవృత్తాంతములు 36:16

23. Joye ye in that dai, and be ye glad; for lo! youre meede is myche in heuene; for aftir these thingis the fadris of hem diden to prophetis.

24. అయ్యో, ధనవంతులారా, మీరు (కోరిన) ఆదరణ మీరు పొందియున్నారు.

24. Netheles wo to you, riche men, that han youre coumfort.

25. అయ్యో యిప్పుడు (కడుపు) నిండియున్న వారలారా, మీరాకలిగొందురు. అయ్యో యిప్పుడు నవ్వుచున్నవారలారా, మీరు దుఃఖించి యేడ్తురు.

25. Wo to you that ben fulfillid, for ye schulen hungre. Wo to you that now leiyen, for ye schulen morne, and wepe.

26. మనుష్యులందరు మిమ్మును కొనియాడునప్పుడు మీకు శ్రమ; వారి పితరులు అబద్ధప్రవక్తలకు అదే విధముగా చేసిరి.

26. Wo to you, whanne alle men schulen blesse you; aftir these thingis the fadris of hem diden to profetis.

27. వినుచున్న మీతో నేను చెప్పునదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించువారికి మేలు చేయుడి,
కీర్తనల గ్రంథము 25:21

27. But Y seie to you that heren, loue ye youre enemyes, do ye wel to hem that hatiden you;

28. మిమ్మును శపించువారిని దీవించుడి, మిమ్మును బాధించువారికొరకు ప్రార్థనచేయుడి.

28. blesse ye men that cursen you, preye ye for men that defamen you.

29. నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంపకూడ త్రిప్పుము. నీ పైబట్ట ఎత్తికొని పోవువానిని, నీ అంగీని కూడ ఎత్తి కొనిపోకుండ అడ్డగింపకుము.

29. And to him that smytith thee on o cheeke, schewe also the tothir; and fro hym that takith awei fro thee a cloth, nyle thou forbede the coote.

30. నిన్నడుగు ప్రతివానికిని ఇమ్ము; నీ సొత్తు ఎత్తికొనిపోవు వానియొద్ద దాని మరల అడుగవద్దు.

30. And yyue to eche that axith thee, and if a man takith awei tho thingis that ben thine, axe thou not ayen.

31. మనుష్యులు మీకేలాగు చేయవలెనని మీరు కోరుదురో ఆలాగు మీరును వారికి చేయుడి.

31. And as ye wolen that men do to you, do ye also to hem in lijk maner.

32. మిమ్మును ప్రేమించువారినే మీరు ప్రేమించినయెడల మీకేమి మెప్పు కలుగును? పాపులును తమ్మును ప్రేమించు వారిని ప్రేమింతురు గదా

32. And if ye louen hem that louen you, what thanke is to you? for synful men louen men that louen hem.

33. మీకు మేలు చేయువారికే మేలు చేసినయెడల మీకేమి మెప్పుకలుగును? పాపులును ఆలాగే చేతురు గదా

33. And if ye don wel to hem that don wel to you, what grace is to you? synful men don this thing.

34. మీరెవరియొద్ద మరల పుచ్చుకొనవలెనని నిరీక్షింతురో వారికే అప్పు ఇచ్చినయెడల మీకేమి మెప్పు కలుగును? పాపులును తామిచ్చినంత మరల పుచ్చుకొన వలెనని పాపులకు అప్పు ఇచ్చెదరు గదా.

34. And if ye leenen to hem of whiche ye hopen to take ayen, what thanke is to you? for synful men leenen to synful men, to take ayen as myche.

35. మీరైతే ఎట్టి వారిని గూర్చియైనను నిరాశ చేసికొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలుచేయుడి, అప్పు ఇయ్యుడి; అప్పుడు మీ ఫలము గొప్పదైయుండును, మీరు సర్వోన్నతుని కుమారులై యుందురు. ఆయన, కృతజ్ఞతలేని వారియెడలను దుష్టులయెడలను ఉపకారియై యున్నాడు.
లేవీయకాండము 25:35-36

35. Netheles loue ye youre enemyes, and do ye wel, and leene ye, hopinge no thing therof, and youre mede schal be myche, and ye schulen be the sones of the Heyest, for he is benygne on vnkynde men and yuele men.

36. కాబట్టి మీ తండ్రి కనికరముగలవాడై యున్నట్టు మీరును కనికరముగలవారై యుండుడి.

36. Therfor be ye merciful, as youre fadir is merciful.

37. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు; నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు;

37. Nyle ye deme, and ye schulen not be demed. Nyle ye condempne, and ye schulen not be condempned; foryyue ye, and it schal be foryouun to you.

38. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు; ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును; అణచి, కుదిలించి, దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలువబడునని చెప్పెను.

38. Yyue ye, and it schal be youun to you. Thei schulen yyue in to youre bosum a good mesure, and wel fillid, and schakun togidir, and ouerflowynge; for bi the same mesure, bi whiche ye meeten, it schal be metun `ayen to you.

39. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపగలడా? వారిద్దరును గుంటలో పడుదురు గదా.

39. And he seide to hem a liknesse, Whether the blynde may leede the blynde? ne fallen thei not bothe `in to the diche?

40. శిష్యుడు తన బోధకునికంటె అధికుడు కాడు; సిద్ధుడైన ప్రతివాడును తన బోధకునివలె ఉండును.

40. A disciple is not aboue the maistir; but eche schal be perfite, if he be as his maister.

41. నీవు నీ కంటిలో ఉన్న దూలము ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేల?

41. And what seest thou in thi brotheris iye a moot, but thou biholdist not a beem, that is in thin owne iye?

42. నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరునితో సహోదరుడా, నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయ నిమ్మని నీవేలాగు చెప్పగలవు? వేషధారీ, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును.

42. Or hou maist thou seie to thi brother, Brothir, suffre, Y schal caste out the moot of thin iye, and thou biholdist not a beem in thin owne iye? Ipocrite, first take out the beem of thin iye, and thanne thou schalt se to take the moot of thi brotheris iye.

43. ఏ మంచి చెట్టునను పనికిమాలిన ఫలములు ఫలింపవు, పనికిమాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు.

43. It is not a good tree, that makith yuel fruytis, nether an yuel tree, that makith good fruytis;

44. ప్రతి చెట్టు తన ఫలములవలన తెలియబడును. ముండ్లపొదలో అంజూరపు పండ్లు ఏరుకొనరు; కోరింద పొదలో ద్రాక్షపండ్లు కోయరు.

44. for euery tre is knowun of his fruyt. And men gaderen not figus of thornes, nethir men gaderen a grape of a buysche of breris.

45. సజ్జనుడు, తన హృదయమను మంచి ధననిధి లోనుండి సద్విషయములను బయటికి తెచ్చును; దుర్జనుడు చెడ్డ ధననిధిలోనుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండియుండు దానినిబట్టి యొకని నోరు మాటలాడును.

45. A good man of the good tresoure of his herte bryngith forth good thingis, and an yuel man of the yuel tresoure bryngith forth yuel thingis; for of the plente of the herte the mouth spekith.

46. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా, అని నన్ను పిలుచుట ఎందుకు?
మలాకీ 1:6

46. And what clepen ye me, Lord, Lord, and doon not tho thingis that Y seie.

47. నా యొద్దకు వచ్చి, నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలియుండునో మీకు తెలియజేతును.

47. Eche that cometh to me, and herith my wordis, and doith hem, Y schal schewe to you, to whom he is lijk.

48. వాడు ఇల్లు కట్టవలెనని యుండి లోతుగా త్రవ్వి, బండమీద పునాది వేసినవాని పోలి యుండును. వరదవచ్చి ప్రవాహము ఆ యింటిమీద వడిగా కొట్టినను, అది బాగుగా కట్టబడినందున దాని కదలింపలేకపోయెను.

48. He is lijk to a man that bildith an hous, that diggide deepe, and sette the foundement on a stoon. And whanne greet flood was maad, the flood was hurtlid to that hous, and it miyte not moue it, for it was foundid on a sad stoon.

49. అయితే నా మాటలు వినియు చేయనివాడు పునాది వేయక నేలమీద ఇల్లు కట్టిన వానిని పోలియుండును. ప్రవాహము దానిమీద వడిగా కొట్టగానే అది కూలిపడెను; ఆ యింటిపాటు గొప్పదని చెప్పెను.

49. But he that herith, and doith not, is lijk to a man bildynge his hous on erthe with outen foundement; in to which the flood was hurlid, and anoon it felle doun; and the fallyng doun of that hous was maad greet.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Luke - లూకా సువార్త 6 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

శిష్యులు సబ్బాత్ రోజున మొక్కజొన్నను కోస్తారు. (1-5) 
క్రీస్తు తన శిష్యులు సబ్బాత్ రోజున వారి శ్రేయస్సు కోసం అవసరమైన పనిలో నిమగ్నమైనప్పుడు, వారు ఆకలితో ఉన్నప్పుడు మొక్కజొన్నలు తీయడం వంటి వాటిని సమర్థిస్తాడు. అయితే, ఈ స్వేచ్ఛను పాపపు చర్యలకు అనుమతిగా తప్పుగా అర్థం చేసుకోకుండా ఉండటం చాలా ముఖ్యం. సబ్బాత్ అనేది తన సేవకు మరియు ఆయన మహిమ కోసం అంకితం చేయడానికి ఉద్దేశించిన తన రోజు అని మనం అర్థం చేసుకోవాలని మరియు గుర్తుంచుకోవాలని క్రీస్తు కోరుకుంటున్నాడు.

విశ్రాంతి దినానికి తగిన దయతో కూడిన పనులు. (6-11) 
క్రీస్తు తన దయ యొక్క ఉద్దేశాలను అంగీకరిస్తున్నప్పుడు సిగ్గు లేదా భయాన్ని ప్రదర్శించలేదు. అతను పేదవాడిని స్వస్థపరిచాడు, తన శత్రువులు తనకు వ్యతిరేకంగా ఉపయోగించుకునే అవకాశాన్ని ఉపయోగించుకుంటారని పూర్తిగా తెలుసు. ఎలాంటి వ్యతిరేకత వచ్చినా మన బాధ్యతల నుండి లేదా వైవిధ్యం చూపగల మన సామర్ధ్యం నుండి మనం వమ్ము కాకూడదు. కొంతమంది ఎంత దుర్మార్గులుగా ఉంటారో నిజంగా ఆశ్చర్యంగా ఉంది.

అపొస్తలులు ఎన్నుకున్నారు. (12-19) 
మేము తరచుగా ధ్యానం మరియు ప్రైవేట్ ప్రార్థనలలో అరగంట గడపడం చాలా ముఖ్యమైనదిగా భావిస్తాము, అయినప్పటికీ క్రీస్తు ఈ భక్తి అభ్యాసాలకు మొత్తం రాత్రులను అంకితం చేశాడు. దేవుణ్ణి సేవిస్తున్నప్పుడు, మన ప్రాథమిక శ్రద్ధ సమయాన్ని వృథా చేయకూడదు, కానీ ఒక మంచి కర్తవ్యం నుండి మరొక మంచి కర్తవ్యానికి సజావుగా మారడం. పన్నెండు మంది అపొస్తలులు ఇక్కడ ప్రస్తావించబడ్డారు, మరియు వారు విపరీతమైన అధికారాలను అనుభవించినప్పటికీ, వారిలో ఒకరు దెయ్యం చేత పట్టుకొని ద్రోహిగా మారారు. సమీపంలోని నమ్మకమైన బోధనకు ప్రాప్యత లేని వారికి, అది లేకుండా ఉండటం కంటే గణనీయమైన దూరం ప్రయాణించడం మంచిది. నిజమే, క్రీస్తు వాక్యాన్ని వినడానికి మరియు దాని కోసం ఇతర పనులను పక్కన పెట్టడానికి చాలా దూరం వెళ్లడం విలువైనదే. వారు స్వస్థత కోరుతూ క్రీస్తు వద్దకు వచ్చారు, మరియు ఆయన వారిని నయం చేశాడు. క్రీస్తులో, ఆయన నుండి ప్రవహించటానికి సిద్ధంగా ఉన్న దయ మరియు స్వస్థపరిచే శక్తి సమృద్ధిగా ఉంది, ఇది అందరికీ మరియు ప్రతి వ్యక్తికి సరిపోతుంది. ప్రజలు తరచుగా శారీరక రుగ్మతలను ఆత్మకు సంబంధించిన వాటి కంటే గొప్ప బాధలుగా చూస్తారు, లేఖనాలు మనకు భిన్నంగా బోధిస్తాయి.

ఆశీర్వాదాలు మరియు బాధలు ప్రకటించబడ్డాయి. (20-26) 
ఇక్కడ క్రీస్తు ఉపన్యాసం ప్రారంభమవుతుంది, వీటిలో ఎక్కువ భాగం మాథ్యూ పుస్తకం, అధ్యాయం 5లో కూడా చూడవచ్చు. అయితే, ఈ ఉపన్యాసం వేరే సందర్భంలో మరియు వేరే ప్రదేశంలో అందించబడి ఉంటుందని కొందరు నమ్ముతారు. సువార్త బోధలను స్వీకరించి, వాటి ప్రకారం జీవించే వారందరూ సువార్త వాగ్దానాలను తమ కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు మరియు వాటి నుండి బలాన్ని పొందవచ్చు. తమ విజయాన్ని ప్రపంచం మెచ్చుకున్నా, వారి అంతిమ దుస్థితిని వెల్లడిస్తూ, పాపంలో వర్ధిల్లుతున్న వారిపై హెచ్చరికలు జారీ చేయబడతాయి. క్రీస్తు ఆశీర్వాదాలను పొందే వారు నిజంగా అదృష్టవంతులు, కానీ ఆయన బాధలు మరియు శాపాలు అనుభవించేవారు తీవ్ర అసంతృప్తితో ఉండాలి. పాపాత్ముని శ్రేయస్సు లేదా ఇహలోకంలో సాధువు అనుభవించే బాధలతో సంబంధం లేకుండా, మరణానంతర జీవితంలో నీతిమంతులకు మరియు దుర్మార్గులకు బహుమానాల మధ్య వ్యత్యాసం అపారంగా ఉంటుంది.

క్రీస్తు దయను ప్రబోధించాడు. (27-36) 
ఈ పాఠాలు మన మానవ స్వభావాన్ని గ్రహించడానికి సవాలుగా ఉంటాయి. అయితే, క్రీస్తు ప్రేమలో మన విశ్వాసానికి బలమైన పునాది ఉంటే, ఆయన ఆజ్ఞలు మనకు మరింత నిర్వహించదగినవిగా మారతాయి. ఆయన రక్తం ద్వారా శుద్ధి చేయబడటానికి మరియు ఆయన అందించే అపారమైన దయ మరియు ప్రేమను అర్థం చేసుకోవడానికి మనం ఆయనను సంప్రదించినప్పుడు, "ప్రభూ, నేను ఏమి చేయాలనుకుంటున్నావు?" కాబట్టి, మన పరలోకపు తండ్రి మనపై కనికరం చూపినట్లే మనం కూడా కనికరంతో ఉండేందుకు కృషి చేద్దాం.

మరియు న్యాయం మరియు నిజాయితీకి. (37-49)
క్రీస్తు తరచుగా ఈ బోధనలను ఉపయోగించాడు, వాటి అనువర్తనాన్ని సూటిగా చేశాడు. మనం ఇతరులతో తప్పును కనుగొన్నప్పుడు, మనం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మనకు కూడా అవగాహన మరియు క్షమాపణ అవసరం. మనం ఉదారంగా మరియు క్షమించే స్వభావం కలిగి ఉంటే, చివరికి మనమే ప్రయోజనం పొందుతాము. అంతిమ మరియు ఖచ్చితమైన రివార్డులు తదుపరి ప్రపంచానికి రిజర్వ్ చేయబడినప్పటికీ, ఇది కాదు, ప్రొవిడెన్స్ మనల్ని మంచి చేయమని ప్రోత్సహిస్తుంది. చెడు చేయడంలో సమూహాన్ని అనుసరించేవారు విధ్వంసానికి దారితీసే విశాలమైన మార్గంలో ఉన్నారు. చెట్టు యొక్క నాణ్యత దాని పండ్ల నుండి స్పష్టంగా తెలుస్తుంది. మంచి మాటలు మరియు క్రియల ద్వారా మనం ఫలించగలిగేలా క్రీస్తు బోధనలు మన హృదయాలలో లోతుగా పాతుకుపోవాలి. మనం అలవాటుగా మాట్లాడేవి సాధారణంగా మన హృదయాల్లో ఉన్న దాని ప్రతిబింబం. తమ ఆత్మలను మరియు శాశ్వతమైన విధిని భద్రపరచుకొని, పరీక్షా సమయాలలో ప్రయోజనకరమైన మార్గాన్ని అనుసరించేవారు, క్రీస్తు మాటలకు అనుగుణంగా ఆలోచించేవారు, మాట్లాడతారు మరియు ప్రవర్తిస్తారు. తమ విశ్వాసాన్ని శ్రద్ధగా ఆచరించే వారు ఇతర పునాది వేయబడనందున, కదలని శిల అయిన క్రీస్తుపై తమ నిరీక్షణను ఉంచుతారు. మరణం మరియు తీర్పులో, వారు సురక్షితంగా ఉన్నారు, విశ్వాసం ద్వారా క్రీస్తు శక్తి ద్వారా రక్షణ పొందారు మరియు వారు ఎప్పటికీ నశించరు.



Shortcut Links
లూకా - Luke : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |