Acts - అపొ. కార్యములు 10 | View All

1. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతియైన కొర్నేలీ అను భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను.

1. Now there was a certain man in Caesarea, Cornelius by name, a centurion of what was called the Italian Regiment,

2. అతడు తన యింటి వారందరితోకూడ దేవునియందు భయభక్తులు గలవాడైయుండి, ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడును దేవునికి ప్రార్థన చేయువాడు.

2. a devout man, and one who feared God with all his house, who gave gifts for the needy generously to the people, and always prayed to God.

3. పగలు ఇంచుమించు మూడు గంటలవేళ దేవుని దూత అతనియొద్దకు వచ్చి కొర్నేలీ, అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను.

3. At about the ninth hour of the day, he clearly saw in a vision an angel of God coming to him, and saying to him, 'Cornelius!'

4. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా, యేమని అడిగెను. అందుకు దూత నీ ప్రార్థనలును నీ ధర్మకార్యములును దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి.

4. He, fastening his eyes on him, and being frightened, said, 'What is it, Lord?' He said to him, 'Your prayers and your gifts to the needy have gone up for a memorial before God.

5. ఇప్పుడు నీవు యొప్పేకు మనుష్యులను పంపి, పేతురు అను మారు పేరుగల సీమోనును పిలిపించుము;

5. Now send men to Yafo, and get Shim`on, who is surnamed Rock.

6. అతడు సముద్రపు దరినున్న సీమోనను ఒక చర్మకారుని యింట దిగియున్నాడని అతనితో చెప్పెను.

6. He lodges with one Shim`on, a tanner, whose house is by the seaside.'

7. అతనితో మాటలాడిన దూతవెళ్లిన పిమ్మట అతడు తన యింటి పనివారిలో ఇద్దరిని, తన యొద్ద ఎల్లప్పుడు కనిపెట్టుకొని యుండువారిలో భక్తి పరుడగు ఒక సైనికుని పిలిచి

7. When the angel who spoke to him had departed, Cornelius called two of his household servants and a devout soldier of those who waited on him continually.

8. వారికి ఈ సంగతులన్నియు వివరించి వారిని యొప్పేకు పంపెను.

8. Having explained everything to them, he sent them to Yafo.

9. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు పండ్రెండు గంటలకు పేతురు ప్రార్థనచేయుటకు మిద్దెమీది కెక్కెను.

9. Now on the next day as they were on their journey, and got close to the city, Rock went up on the housetop to pray at about noon.

10. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను; ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై

10. He became hungry and desired to eat, but while they were preparing, he fell into a trance.

11. ఆకాశము తెరవబడుటయు, నాలుగు చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటివంటి యొకవిధమైన పాత్ర భూమిమీదికి దిగివచ్చుటయు చూచెను.

11. He saw heaven opened and a certain container descending to him, like a great sheet let down by four corners on the eretz,

12. అందులో భూమి యందుండు సకల విధములైన చతుష్పాద జంతువులును, ప్రాకు పురుగులును, ఆకాశపక్షులును ఉండెను.

12. in which were all kinds of four-footed animals of the eretz, wild animals, reptiles, and birds of the sky.

13. అప్పుడు పేతురూ, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దమతనికి వినబడెను.

13. A voice came to him, 'Rise, Rock, kill and eat!'

14. అయితే పేతురు వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనను నేనెన్నడును తినలేదని చెప్పగా
లేవీయకాండము 11:1-47, యెహెఙ్కేలు 4:14

14. But Rock said, 'Not so, Lord; for I have never eaten anything that is common or unclean.'

15. దేవుడు పవిత్రము చేసినవాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరల రెండవ మారు ఆ శబ్దము అతనికి వినబడెను.

15. A voice came to him again the second time, 'What God has cleansed, you must not call unclean.'

16. ఈలాగు ముమ్మారు జరిగెను. వెంటనే ఆ పాత్ర ఆకాశమున కెత్తబడెను.

16. This was done three times, and immediately the vessel was received up into heaven.

17. పేతురు తనకు కలిగిన దర్శనమేమై యుండునో అని తనలో తనకు ఎటుతోచక యుండగా, కొర్నేలి పంపిన మనుష్యులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలిసికొని, వాకిట నిలిచి యింటివారిని పిలిచి

17. Now while Rock was very perplexed in himself what the vision which he had seen might mean, behold, the men who were sent by Cornelius, having made inquiry for Shim`on's house, stood before the gate,

18. పేతురు అను మారుపేరుగల సీమోను ఇక్కడ దిగియున్నాడా? అని అడిగిరి

18. and called and asked whether Shim`on, who was surnamed Rock, was lodging there.

19. పేతురు ఆ దర్శనమును గూర్చి యోచించుచుండగా ఆత్మ ఇదిగో ముగ్గురు మనుష్యులు నిన్ను వెదకుచున్నారు.

19. While Rock was pondering the vision, the Spirit said to him, 'Behold, three men seek you.

20. నీవు లేచి క్రిందికిదిగి, సందేహింపక వారితో కూడ వెళ్లుము; నేను వారిని పంపియున్నానని అతనితో చెప్పెను.

20. But arise, get down, and go with them, doubting nothing; for I have sent them.'

21. పేతురు ఆ మనుష్యులయొద్దకు దిగి వచ్చి ఇదిగో మీరు వెదకువాడను నేనే; మీరు వచ్చిన కారణమేమని అడిగెను.

21. Rock went down to the men, and said, 'Behold, I am he whom you seek. Why have you come?'

22. అందుకు వారు నీతిమంతుడును, దేవునికి భయపడువాడును, యూద జనులందరివలన మంచిపేరు పొందినవాడునైన శతాధిపతియగు కొర్నేలియను ఒక మనుష్యుడున్నాడు; అతడు నిన్ను తన యింటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలెనని పరిశుద్ధదూత వలన బోధింపబడెనని చెప్పిరి; అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యమిచ్చెను.

22. They said, 'Cornelius, a centurion, a righteous man and one who fears God, and well spoken of by all the nation of the Yehudim, was directed by a holy angel to invite you to his house, and to listen to what you say.'

23. మరునాడు అతడు లేచి, వారితోకూడ బయలుదేరెను; యొప్పేవారైన కొందరు సహోదరులును వారితోకూడ వెళ్లిరి.

23. So he called them in and lodged them. On the next day Rock arose and went out with them, and some of the brothers from Yafo accompanied him.

24. మరునాడు వారు కైసరయలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారికొరకు కనిపెట్టుకొని యుండెను.

24. On the next day they entered into Caesarea. Cornelius was waiting for them, having called together his relatives and his near friends.

25. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదములమీద పడి నమస్కారము చేసెను.

25. When it happened that Rock entered, Cornelius met him, fell down at his feet, and worshiped him.

26. అందుకు పేతురు నీవు లేచి నిలువుము, నేనుకూడ నరుడనే అని చెప్పి అతని లేవనెత్తి

26. But Rock raised him up, saying, 'Stand up! I myself am also a man.'

27. అతనితో మాటలాడుచు లోపలికి వచ్చి, అనేకులు కూడియుండుట చూచెను.

27. As he talked with him, he went in and found many gathered together.

28. అప్పుడతడు అన్యజాతివానితో సహవాసము చేయుటయైనను, అట్టివానిని ముట్టుకొనుటయైనను యూదునికి ధర్మముకాదని మీకు తెలియును. అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగినవాడనియైన అపవిత్రుడనియైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించియున్నాడు.

28. He said to them, 'You yourselves know how it is an unlawful thing for a man who is a Yehudi to join himself or come to one of another nation, but God has shown me that I shouldn't call any man unholy or unclean.

29. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమియు చెప్పక వచ్చితిని గనుక, ఎందునిమిత్తము నన్ను పిలువనంపితిరో దానినిగూర్చి అడుగుచున్నానని వారితో చెప్పెను.

29. Therefore also I came without complaint when I was sent for. I ask therefore, why did you send for me?'

30. అందుకు కొర్నేలి నాలుగు దినముల క్రిందట పగలు మూడుగంటలు మొదలు కొని యీ వేళవరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు యెదుట నిలిచి

30. Cornelius said, 'Four days ago, I was fasting until this hour, and at the ninth hour, I prayed in my house, and behold, a man stood before me in bright clothing,

31. కొర్నేలీ, నీ ప్రార్థన వినబడెను; నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముంచబడి యున్నవి గనుక నీవు యొప్పేకు వర్తమానము పంపి

31. and said, 'Cornelius, your prayer is heard, and your gifts to the needy are remembered in the sight of God.

32. పేతురు అను మారుపేరుగల సీమోనును పిలిపించుము; అతడు సముద్రపు దరినున్న చర్మకారుడైన సీమోను ఇంట దిగియున్నాడని నాతో చెప్పెను.

32. Send therefore to Yafo, and summon Shim`on, who is surnamed Rock. He lodges in the house of Shim`on a tanner, by the seaside. When he comes, he will speak to you.'

33. వెంటనే నిన్ను పిలిపించితిని; నీవు వచ్చినది మంచిది. ప్రభువు నీకు ఆజ్ఞా పించినవన్నియు వినుటకై యిప్పుడు మేమందరము దేవుని యెదుట ఇక్కడ కూడియున్నామని చెప్పెను. అందుకు పేతురు నోరుతెరచి ఇట్లనెను

33. Therefore I sent to you at once, and it was good of you to come. Now therefore we are all here present in the sight of God to hear all things that have been commanded you by God.'

34. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి యున్నాను.
ద్వితీయోపదేశకాండము 10:17, 2 దినవృత్తాంతములు 19:7

34. Rock opened his mouth and said, 'Truly I perceive that God doesn't show favoritism;

35. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.
కీర్తనల గ్రంథము 65:2

35. but in every nation he who fears him and works righteousness is acceptable to him.

36. యేసుక్రీస్తు అందరికి ప్రభువు. ఆయనద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు.
కీర్తనల గ్రంథము 107:20, కీర్తనల గ్రంథము 145:18, కీర్తనల గ్రంథము 147:18, యెషయా 52:7, నహూము 1:15

36. The word which he sent to the children of Yisra'el, preaching good news of shalom by Yeshua the Messiah�he is Lord of all�

37. యోహాను బాప్తిస్మము ప్రకటించిన తరువాత గలిలయ మొదలుకొని యూదయ యందంతట ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియును

37. that spoken word you yourselves know, which was proclaimed throughout all Yehudah, beginning from the Galil, after the immersion which Yochanan preached;

38. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెనను నదియే. దేవుడాయనకు తోడైయుండెను గనుక ఆయన మేలు చేయుచు, అపవాదిచేత పీడింపబడిన వారినందరిని స్వస్థపరచుచు సంచరించుచుండెను.
యెషయా 61:1

38. even Yeshua of Natzeret, how God anointed him with the Ruach HaKodesh and with power, who went about doing good and healing all who were oppressed by the devil, for God was with him.

39. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసినవాటికన్నిటికిని మేము సాక్షులము. ఆయనను వారు మ్రానున వ్రేలాడదీసి చంపిరి.
ద్వితీయోపదేశకాండము 21:22-23

39. We are witnesses of everything he did both in the country of the Yehudim, and in Yerushalayim; whom they also killed, hanging him on a tree.

40. దేవుడాయనను మూడవ దినమున లేపి

40. God raised him up the third day, and gave him to be revealed,

41. ప్రజలకందరికి కాక దేవునిచేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతులలోనుండి లేచిన తరువాత ఆయనతో కూడ అన్నపానములు పుచ్చుకొనిన మాకే, ఆయన ప్రత్యక్షముగా కనబడునట్లు అనుగ్రహించెను.

41. not to all the people, but to witnesses who were chosen before by God, to us, who ate and drank with him after he rose from the dead.

42. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధి పతినిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢసాక్ష్యమియ్యవలెనని మాకు ఆజ్ఞాపించెను.
కీర్తనల గ్రంథము 72:2-4

42. He charged us to preach to the people and to testify that this is he who is appointed by God as the Judge of the living and the dead.

43. ఆయనయందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరు ఆయననుగూర్చి సాక్ష్య మిచ్చుచున్నారనెను.
యెషయా 33:24, యెషయా 53:5-6, యిర్మియా 31:34, దానియేలు 9:24

43. All the prophets testify about him, that through his name everyone who believes in him will receive remission of sins.'

44. పేతురు ఈ మాటలు ఇంక చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరిమీదికి పరిశుద్ధాత్మ దిగెను.

44. While Rock was still speaking these words, the Ruach HaKodesh fell on all those who heard the word.

45. సున్నతి పొందినవారిలో పేతురుతోకూడ వచ్చిన విశ్వాసులందరు, పరిశుద్ధాత్మ వరము అన్యజనులమీద సయితము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతినొందిరి.

45. They of the circumcision who believed were amazed, as many as came with Rock, because the gift of the Ruach HaKodesh was also poured out on the Goyim.

46. ఏలయనగా వారు భాషలతో మాటలాడుచు దేవుని ఘనపరచుచుండగా వినిరి.

46. For they heard them speaking in other languages and magnifying God. Then Rock answered,

47. అందుకు పేతురు మనవలె పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండ ఎవడైనను నీళ్ళకు ఆటంకము చేయగలడా అని చెప్పి

47. 'Can any man forbid the water, that these who have received the Ruach HaKodesh as well as we should not be immersed?'

48. యేసు క్రీస్తు నామమందు వారు బాప్తిస్మము పొందవలెనని ఆజ్ఞాపించెను. తరువాత కొన్ని దినములు తమయొద్ద ఉండుమని వారతని వేడుకొనిరి.

48. He commanded them to be immersed in the name of Yeshua the Messiah. Then they asked him to stay some days.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Acts - అపొ. కార్యములు 10 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

పీటర్‌ని పంపమని కొర్నేలియస్ ఆదేశించాడు. (1-8) 
ఇప్పటి వరకు, యూదులు, సమారిటన్లు మరియు మతమార్పిడి చేసినవారు మాత్రమే సున్తీకి కట్టుబడి మరియు ఆచార చట్టాలను పాటించేవారు క్రైస్తవ చర్చిలో బాప్టిజం పొందారు. ఏది ఏమైనప్పటికీ, ఒక ముఖ్యమైన మార్పు సంభవించింది, యూదులుగా మారడానికి ఎలాంటి అవసరం లేకుండానే అన్యజనులు దేవుని ప్రజల అధికారాలను ఆస్వాదించడానికి అనుమతించారు. స్వచ్ఛమైన మరియు నిజమైన మతపరమైన భక్తి అనేది ఊహించని విధంగా వ్యక్తమవుతుంది, ధార్మిక మరియు పవిత్రమైన చర్యలలో దేవుని భయాన్ని ప్రదర్శిస్తుంది, మరొకటి లేకపోవడాన్ని క్షమించదు.
నిస్సందేహంగా, కొర్నేలియస్ ఇంకా క్రీస్తుపై స్పష్టమైన విశ్వాసాన్ని పెంపొందించుకోనప్పటికీ, తన అవగాహన మేరకు దేవుని వాక్యంపై నిజాయితీగల విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. ఈ రూపాంతరమైన పని దేవుని ఆత్మకు ఆపాదించబడింది, యేసు మధ్యవర్తిత్వం ద్వారా సులభతరం చేయబడింది. ఒకప్పుడు ఆధ్యాత్మికంగా జీవం లేని మనం జీవం పోసుకున్నందున ఇది మనందరికీ పంచుకున్న అనుభవం. క్రీస్తు ద్వారా, కార్నెలియస్ ప్రార్థనలు మరియు దాతృత్వ చర్యలకు ఆమోదం లభించింది, అది తిరస్కరించబడి ఉండేది.
సంకోచం లేదా చర్చ లేకుండా, కార్నేలియస్ వెంటనే పరలోక దర్శనానికి విధేయత చూపాడు. మన ఆత్మలకు సంబంధించిన విషయాలలో, మనం సమయాన్ని వృధా చేయకూడదు.

పీటర్ దృష్టి. (9-18) 
అన్యజనుల పట్ల పీటర్ యొక్క పక్షపాతం, ప్రభువు అతన్ని ఈ మిషన్ కోసం సిద్ధం చేయకపోతే, కొర్నేలియస్‌ను సందర్శించకుండా అతన్ని అడ్డుకునేది. దేవుడు గతంలో అపరిశుభ్రమైన జంతువులను పరిశుభ్రంగా ఉంచినట్లు ప్రకటించాడని ఒక యూదునికి తెలియజేయడం అనేది మొజాయిక్ చట్టాన్ని రద్దు చేయడాన్ని సూచిస్తుంది. ఈ ప్రత్యక్షత యొక్క ప్రాముఖ్యతను పీటర్ వేగంగా గ్రహించాడు. దేవుడు మన ముందున్న పనులను మరియు వాటి కోసం మనల్ని ఎలా సన్నద్ధం చేయాలో అర్థం చేసుకుంటాడు. వాటిని అన్వయించుకోవడానికి మనల్ని ప్రేరేపించే సందర్భాలను మనం గ్రహించినప్పుడు ఆయన బోధల యొక్క ప్రాముఖ్యతను మనం గ్రహిస్తాము.

అతను కార్నెలియస్ వద్దకు వెళ్తాడు. (19-33) 
ఒక నిర్దిష్ట సేవకు మన పిలుపు స్పష్టంగా కనిపించినప్పుడు, పక్షపాతాలు లేదా గత భావనల నుండి ఉత్పన్నమయ్యే సందేహాలు లేదా సంకోచాల వల్ల మనం ఇబ్బంది పడకూడదు. పేతురు నుండి తాను ఊహించిన పరలోక జ్ఞానాన్ని వారితో పంచుకోవడానికి కొర్నేలియస్ తన స్నేహితులను సేకరించాడు. మన ఆధ్యాత్మిక అంతర్దృష్టిలో మాత్రమే పాలుపంచుకోవాలని కోరుకోవడం తగదు. మన బంధువులను మరియు స్నేహితులను మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనమని ఆహ్వానించడం దయ మరియు గౌరవప్రదమైన చర్యగా పరిగణించాలి.
పీటర్‌ని పిలవమని అతనికి సూచించే దైవిక మార్గదర్శకత్వాన్ని కార్నెలియస్ బహిరంగంగా తెలియజేశాడు. సువార్త పరిచర్యకు హాజరవ్వడం అనేది దైవిక నియామకం యొక్క అంగీకారంలో మనం చేసినప్పుడు, ఆ ఆర్డినెన్స్‌లో నిమగ్నమవ్వమని మనల్ని పురికొల్పినప్పుడు అది మన ఉద్దేశ్యంతో సమానంగా ఉంటుంది. దేవుడు ఆజ్ఞాపించినదంతా వినడానికి సిద్ధంగా ఉన్నవారందరూ దేవుని దృష్టిలో ఉన్నారని ధృవీకరింపబడే చోట, ఎంత చిన్న సమావేశమైనా, అటువంటి సభలలో మంత్రులు ప్రసంగించడం చాలా అరుదు. అయినప్పటికీ, ఈ వ్యక్తులు తెలియజేయమని పేతురుకు దేవుడు సూచించిన వాటిని వినడానికి సిద్ధంగా ఉన్నారు.

కార్నెలియస్‌తో అతని ఉపన్యాసం. (34-43) 
క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తం ద్వారా సులభతరం చేయబడిన దయ యొక్క ఒడంబడిక ద్వారా మాత్రమే అంగీకారం పొందబడుతుంది. అయితే, నిజమైన మతం, అది ఎక్కడ కనిపించినా, పేర్లు లేదా శాఖలతో సంబంధం లేకుండా దేవుడు దానిని స్వీకరించాడు. నిజమైన మతం యొక్క సారాంశం దేవుని పట్ల భయం మరియు ధర్మాన్ని పాటించడం-ప్రత్యేక దయ యొక్క వ్యక్తీకరణలలో ఉంది. ఈ అంశాలు ఒకరి అంగీకారానికి కారణం కానప్పటికీ, అవి సూచికలుగా పనిచేస్తాయి. జ్ఞానం లేదా విశ్వాసం లోపించిన ఏదైనా ప్రక్రియను ప్రారంభించిన వ్యక్తి తగిన సమయంలో అందించబడతాడు.
వారు ఇశ్రాయేలు పిల్లలకు దేవుడు పంపిన సువార్త అనే పదం గురించిన సాధారణ జ్ఞానాన్ని కలిగి ఉన్నారు. ఈ సందేశం యేసుక్రీస్తు ద్వారా శాంతికి సంబంధించిన శుభవార్తలను తెలియజేసింది. వారి అవగాహన జాన్ బోధించిన పశ్చాత్తాప బాప్టిజంతో సహా సువార్తతో ముడిపడి ఉన్న వాస్తవాలకు విస్తరించింది. దేవుడు మరియు మానవాళిని పునరుద్దరించే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని పీటర్ నొక్కిచెప్పాడు-దేవుడు శాశ్వతంగా ఆశీర్వదించబడడమే కాకుండా మధ్యవర్తిగా కూడా ఉన్నాడు. స్వర్గంలో మరియు భూమిపై ఉన్న అన్ని అధికారాలు ఆయనకు అప్పగించబడ్డాయి మరియు అన్ని తీర్పులు ఆయనకు అప్పగించబడ్డాయి.
దేవుడు తాను అభిషేకించిన వారితో పాటుగా ఉంటాడు, ఎవరికి తన ఆత్మను ప్రసాదిస్తాడో వారితో నిలబడతాడు. అప్పుడు పేతురు క్రీస్తు మృతులలో నుండి పునరుత్థానాన్ని ధృవీకరిస్తూ, దాని వాస్తవికతకు రుజువును అందించాడు. విశ్వాసం సాక్ష్యంలో లంగరు వేయబడింది మరియు క్రైస్తవ విశ్వాసం అపొస్తలులు మరియు ప్రవక్తలు వేసిన పునాదిపై ఆధారపడి ఉంటుంది-వారు అందించిన సాక్ష్యం. విశ్వాసం మన న్యాయమూర్తిగా క్రీస్తుకు మన జవాబుదారీతనంపై కేంద్రీకరిస్తుంది, ప్రతి వ్యక్తి అతని అనుగ్రహాన్ని మరియు స్నేహాన్ని కోరుకునేలా చేస్తుంది. ఆయనయందు విశ్వాసముంచుట ద్వారా, అందరును ఆయన వారి నీతిగా సమర్థించుచున్నారు.
పాప క్షమాపణ అన్ని ఇతర సహాయాలు మరియు ఆశీర్వాదాలకు పునాదిని ఏర్పరుస్తుంది. పాపం క్షమించబడితే, అంతా బాగానే ఉంటుంది, శాశ్వతమైన మరియు సానుకూల ఫలితాన్ని నిర్ధారిస్తుంది.

పవిత్ర ఆత్మ యొక్క బహుమతులు కురిపించబడ్డాయి. (44-48)
వారి విశ్వాసాన్ని బలపరచడానికి బాప్టిజం తర్వాత పవిత్రాత్మ ఇతరులపైకి దిగింది. అయితే, ఈ అన్యుల విషయంలో, వారి బాప్టిజం ముందు ఆత్మ వచ్చింది, దేవుడు బాహ్య సంకేతాలకే పరిమితం కాదని నొక్కి చెప్పాడు. పరిశుద్ధాత్మ సున్నతి లేదా బాప్టిజం పొందని వారిపై ప్రసాదించబడింది, కేవలం కర్మ కంటే ఆత్మ యొక్క ప్రాధాన్యతను నొక్కి చెబుతుంది. "ఆత్మయే జీవింపజేయును, శరీరము దేనికీ ప్రయోజనము కలిగించదు." వారు దేవుణ్ణి మహిమపరిచారు మరియు క్రీస్తు గురించి మరియు విమోచన ప్రయోజనాల గురించి మాట్లాడారు.
మనకు ప్రసాదించిన బహుమతులు ఏమైనప్పటికీ, వాటితో దేవుడిని గౌరవించడం మన విధి. పరిశుద్ధాత్మ అన్యజనులపై కుమ్మరించబడిందని అక్కడున్న యూదు విశ్వాసులు ఆశ్చర్యపోయారు. తరచుగా, దైవిక ప్రావిడెన్స్ మరియు దయ గురించిన అపోహలు మన అవగాహనను క్లిష్టతరం చేస్తాయి. వారు నిస్సందేహంగా పరిశుద్ధాత్మ బాప్టిజం పొందినందున, వారికి నీటి బాప్టిజం నిరాకరించడం అసమంజసమని పీటర్ వాదించాడు. వాదన బలవంతపుది: పదార్థాన్ని స్వీకరించిన వారి నుండి మనం సంకేతాన్ని నిలిపివేయవచ్చా?
క్రీస్తు గురించి కొంత జ్ఞానం ఉన్నవారు సహజంగానే ఎక్కువ కోరుకుంటారు. పరిశుద్ధాత్మను పొందిన వారు కూడా సత్యం గురించి మరింత నిరంతరం నేర్చుకోవాల్సిన అవసరాన్ని గుర్తిస్తారు.



Shortcut Links
అపో. కార్యములు - Acts : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |