స్వేచ్ఛ
Audio: https://youtu.be/YrPVrHnk524
గత కొన్ని వారాల క్రితం హైదరాబాదులో భారీవర్షం కారణంగా వరద భీభత్సంలో కొందరు చిక్కుకొనిపోయారు. వేగవంతమైన నీటితో కొట్టుకోనిపోతూ కొన్ని గంటలు చిక్కుకొని, చివరకు సహాయ సిబ్బంధీచే విడుదల పొందిన నా స్నేహితుడు తన ముఖమంతా నవ్వుతో నింపుకొని ఇలా ప్రకటించాడు - “నా జీవితంలో ఇవే చివరి ఘడియలు అని అనుకున్న నాకు, మరొకసారి బ్రదికాను అనిపించింది. నా జీవితమంతటికన్నా నాకిప్పుడు మరీయెక్కువగా సజీవముగా ఉన్నట్లనిపిస్తుంది”.
వాస్తవానికి, స్వేచ్ఛగా ఉండడముకన్నా, విడుదల పొందటము మరింత ఆనందకరముగా అనిపిస్తుంది. దానికి కారణాలను అర్ధం చేసుకోవడం కష్టం. అనుదినము స్వేచ్ఛను అనుభవించేవారికి మనమెంత దీవించబడినవారమో అన్న విషయాన్ని ఎంత తేలికగా మరచిపోతామో జ్ఞాపకానికి తీసుకొని రావడానికి నా స్నేహితునికి కలిగిన సంఘటన ఒక ఉదాహరణ. ఆధ్యాత్మికంతా కూడా ఇది వాస్తవమైనది. మనలో చాలాకాలంగా క్రైస్తవులుగా ఉన్నవారము; అయితే పాపములో బందీలుగా ఉండడమంటే ఏమిటో తరచూ మర్చిపోతుంటాము. ఆ బానిసత్వం నుండి విదిపించబడిన మన జీవితంతో తృప్తిచెందుతూ ఉన్నప్పుడు కృతఘ్నులముగా తాయారుచేయబడుతాము. ఒక నూతన విశ్వాసిగా చేయబడిన మన జీవిత సాక్ష్యాన్ని దేవుడు మనకు తరచూ గుర్తుచేస్తుంటాడు. ఆ సందర్భంలో “క్రీస్తుయేసునందు జీవమునిచ్చు ఆత్మయొక్క నియమము పాపమరణముల నియమమునుండి నన్ను విడిపించెను” (రోమా 8:2) అపో.పౌలు వాలే మరొకసారి ఈ మాటలు చెప్పగలిగితే మనదైన అందాన్ని మరలా చవిచూస్తాము.
ఈ స్వేచ్ఛను కొన్ని సార్లు మనం గ్రహించము లేదా అనవసరమైన వాటిపై ద్రుష్టిసారించి జీవితాన్ని ఏదోలా గడిపేస్తుంటాము, అప్పుడు మనం ఎదో కష్టం వంటి మహా సముద్రంలో ప్రయాణిస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది. స్నేహితుడా! ఒకసారి ఆలోచించు: నీవు ఇకపై పాపానికి దాసుడు కాకుండుట మాత్రమే కాదు, నీవు పరిశుద్దుడవుగా ఉంటూ క్రీస్తు యేసుతో నిత్యజీవాన్ని అశ్వాదించడానికి కూడా విడిపింపబడ్డావు “అయినను ఇప్పుడు పాపమునుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము” రోమా 6:22. యేసు క్రీస్తుచే రక్షించబడి విమోచింపబడిన ఆయన సేవకునిగా నీవు స్వేచ్ఛగా చేయగలుగుతున్న ప్రతి విషయమై దేవునికి కృతఙ్ఞతలు చెల్లించి క్రీస్తులో నీకున్న స్వాతంత్ర్యాన్ని వేడుక చేసుకో! ఆమెన్.