Sajeeva Vahini
Home
Telugu Bible - పరిశుద్ధ గ్రంథం
All Books
Old Testament
Genesis - ఆదికాండము
Exodus - నిర్గమకాండము
Leviticus - లేవీయకాండము
Numbers - సంఖ్యాకాండము
Deuteronomy - ద్వితీయోపదేశకాండము
Joshua - యెహోషువ
Judges - న్యాయాధిపతులు
Ruth - రూతు
Samuel I- 1 సమూయేలు
Samuel II - 2 సమూయేలు
Kings I - 1 రాజులు
Kings II - 2 రాజులు
Chronicles I - 1 దినవృత్తాంతములు
Chronicles II - 2 దినవృత్తాంతములు
Ezra - ఎజ్రా
Nehemiah - నెహెమ్యా
Esther - ఎస్తేరు
Job - యోబు
Psalms - కీర్తనల గ్రంథము
Proverbs - సామెతలు
Ecclesiastes - ప్రసంగి
Song of Solomon - పరమగీతము
Isaiah - యెషయా
Jeremiah - యిర్మియా
Lamentations - విలాపవాక్యములు
Ezekiel - యెహెఙ్కేలు
Daniel - దానియేలు
Hosea - హోషేయ
Joel - యోవేలు
Amos - ఆమోసు
Obadiah - ఓబద్యా
Jonah - యోనా
Micah - మీకా
Nahum - నహూము
Habakkuk - హబక్కూకు
Zephaniah - జెఫన్యా
Haggai - హగ్గయి
Zechariah - జెకర్యా
Malachi - మలాకీ
New Testament
Matthew - మత్తయి సువార్త
Mark - మార్కు సువార్త
Luke - లూకా సువార్త
John - యోహాను సువార్త
Acts - అపొ. కార్యములు
Romans - రోమీయులకు
Corinthians I - 1 కొరింథీయులకు
Corinthians II - 2 కొరింథీయులకు
Galatians - గలతీయులకు
Ephesians - ఎఫెసీయులకు
Philippians - ఫిలిప్పీయులకు
Colossians - కొలస్సయులకు
Thessalonians I - 1 థెస్సలొనీకయులకు
Thessalonians II - 2 థెస్సలొనీకయులకు
Timothy I - 1 తిమోతికి
Timothy II - 2 తిమోతికి
Titus - తీతుకు
Philemon - ఫిలేమోనుకు
Hebrews - హెబ్రీయులకు
James - యాకోబు
Peter I - 1 పేతురు
Peter II - 2 పేతురు
John I - 1 యోహాను
John II - 2 యోహాను
John III - 3 యోహాను
Judah - యూదా
Revelation - ప్రకటన గ్రంథము
Bible Dictionary
Lyrics
Infinite Network
Download
Hadassah App - Download
Mobile Apps Download
iOS Apps Download
Full Audio Bible
Content
Articles
Messages
Children Stories
Youth
Women
Family
Bible Study
Our Daily Bread
Bible Facts
Bible Quiz
Crosswords
Devotions
Inspirations
Suffering with Christ
Christian Lifestyle Series
40 సిలువ సాక్షులు - 40 Martyrs For Christ
Daily Devotions - అనుదిన వాహిని - Season 1
Daily Devotions - అనుదిన వాహిని - Season 2
Daily Devotions - అనుదిన వాహిని - Season 3
Daily Devotions - అనుదిన వాహిని - Season 4
Daily Devotions - అనుదిన వాహిని - Season 5
Daily Devotions - అనుదిన వాహిని - Season 6
Daily Devotions - అనుదిన వాహిని - Season 7
more
Bible Plans - Topic Based
Read Bible in One Year
Bible History in Telugu
Hindi Bible Online
Telugu Bible Online
Tamil Bible Online
Malayalam Bible Online
Donate & Support
Christian Lyrics
Bible on Mobile
Podcast
Digital Library
Free Wallpapers
Video Gallery
About Sajeeva Vahini
Sajeeva Vahini Organization
Contact Us
Search
24
Thursday, April 2025
Change Date :
Previous
|
Next
Organized from Old Testament, New Testament, Psalms & Proverbs. Read and Complete Telugu Bible in One Year!
Joshua 8
1. మరియు యెహోవా యెహోషువతో ఇట్లనెను భయపడకుము, జడియకుము, యుద్ధసన్నధ్ధులైన వారినందరిని తోడుకొని హాయిమీదికి పొమ్ము. చూడుము; నేను హాయి రాజును అతని జనులను అతని పట్టణమును అతని దేశమును నీ చేతికప్పగించు చున్నాను.
2. నీవు యెరికోకును దాని రాజునకును ఏమి చేసితివో అదే హాయికిని దాని రాజునకును చేసెదవు; అయితే దాని సొమ్మును పశువులను మీరు కొల్లగా దోచుకొనవలెను. పట్టణపు పడమటి వైపున మాటు గాండ్ల నుంచుము.
3. యెహోషువయు యోధులందరును హాయిమీదికి పోవలెననియుండగా, యెహోషువ పరాక్రమముగల ముప్పదివేల శూరులను ఏర్పరచి రాత్రివేళ వారిని పంపి
4. వారి కాజ్ఞాపించినదేమనగా ఈ పట్టణమునకు పడమటివైపున మీరు దాని పట్టుకొన చూచుచు పొంచియుండవలెను పట్టణమునకు బహుదూరమునకు వెళ్లక మీరందరు సిద్ధపడియుండుడి.
5. నేనును నాతోకూడనున్న జనులందరును పట్టణమునకు సమీపించె దము, వారు మునుపటివలె మమ్మును ఎదుర్కొనుటకు బయలుదేరగా మేము వారియెదుట నిలువక పారిపోదుము.
6. మునుపటివలె వీరు మనయెదుట నిలువలేక పారిపోదురని వారనుకొని, మేము పట్టణమునొద్దనుండి వారిని తొలగి రాజేయువరకు వారు మా వెంబడిని బయలు దేరి వచ్చెదరు; మేము వారియెదుట నిలువక పారిపోయి నప్పుడు మీరు పొంచియుండుట మాని
7. లేచి పట్టణమును పట్టుకొనుడి; మీ దేవుడైన యెహోవా మీ చేతికి దాని నప్పగించును.
8. మీరు ఆ పట్టణమును పట్టుకొనినప్పుడు యెహోవా మాట చొప్పున జరిగించి దానిని తగులబెట్ట వలెను.
9. ఇదిగో నేను మీ కాజ్ఞాపించియున్నానని చెప్పి యెహోషువ వారిని పంపగా వారు పొంచియుండుటకు పోయి హాయి పడమటి దిక్కున బేతేలునకును హాయికిని మధ్య నిలిచిరి. ఆ రాత్రి యెహోషువ జనులమధ్య బసచేసెను.
10. ఉదయమున యెహోషువ వేకువను లేచి జనులను వ్యూహపరచి, తానును ఇశ్రాయేలీయుల పెద్దలును జనులకుముందుగా హాయిమీదికి పోయిరి.
11. అతని యొద్దనున్న యోధులందరు పోయి సమీపించి ఆ పట్టణము నెదుటికి వచ్చి హాయికి ఉత్తరదిక్కున దిగిరి.
12. వారికిని హాయికిని మధ్యను లోయయుండగా అతడు ఇంచుమించు అయిదు వేలమంది మనుష్యులను నియమించి పట్టణమునకు పడమటి వైపున బేతేలునకును హాయికిని మధ్యను పొంచియుండుటకు ఉంచెను.
29. యెహోషువ హాయిరాజును సాయంకాలమువరకు మ్రానుమీద వ్రేలాడ దీసెను. ప్రొద్దు గ్రుంకు చున్నప్పుడు సెలవియ్యగా జనులు వాని శవమును మ్రానుమీదనుండి దించి ఆ పురద్వారము నెదుట దాని పడవేసి దానిమీద పెద్ద రాళ్లకుప్ప వేసిరి. అది నేటివరకు ఉన్నది.
30. మోషే ధర్మశాస్త్రగ్రంథములో వ్రాయబడిన ప్రకా రము
31. యెహోవా సేవకుడైన మోషే ఇశ్రాయేలీయుల కాజ్ఞాపించినట్లు యెహోషువ ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామమున బలిపీఠమును ఇనుప పనిముట్లు తగిలింపని కారు రాళ్లతో ఏబాలు కొండమీద కట్టించెను. దానిమీద వారు యెహోవాకు దహనబలులను సమాధాన బలులను అర్పించిరి.
32. మోషే ఇశ్రాయేలీయులకు వ్రాసి యిచ్చిన ధర్మశాస్త్రగ్రంథమును ఒక ప్రతిని అతడు అక్కడ ఆ రాళ్లమీద వ్రాయించెను.
33. అప్పుడు ఇశ్రా యేలీయులను దీవించుటకు యెహోవా సేవకుడైన మోషే పూర్వము ఆజ్ఞాపించినది జరుగవలెనని, పరదేశులేమి వారిలో పుట్టినవారేమి ఇశ్రా యేలీయులందరును వారి పెద్దలును వారి నాయకులును వారి న్యాయాధిపతులును యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీయుల ముందర ఆ మందసమునకు ఈ వైపున ఆ వైపున నిలిచిరి. వారిలో సగముమంది గెరిజీము కొండయెదుటను సగము మంది ఏబాలు కొండయెదుటను నిలువగా యెహోషువ
34. ఆ ధర్మశాస్త్రగ్రంథములో వ్రాయబడిన వాటన్నిటిని బట్టి ఆ ధర్మశాస్త్ర వాక్యములనన్నిటిని, అనగా దాని దీవెన వచనమును దాని శాప వచనమును చదివి వినిపించెను. స్త్రీలును పిల్ల లును వారి మధ్యనుండు పరదేశులును విను చుండగా
35. యెహోషువ సర్వసమాజము నెదుట మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదువక విడిచిన మాటయొక్కటియు లేదు.
13. వారు ఆ జనులను, అనగా పట్టణమునకు ఉత్తర దిక్కుననున్న సమస్త సైన్యమును పట్టణమునకు పడ మటి దిక్కున దాని వెనుకటి భాగమున నున్నవారిని, ఉంచిన తరువాత యెహోషువ ఆ రాత్రి లోయలోనికి దిగి పోయెను.
14. హాయి రాజు దాని చూచినప్పుడు అతడును అతని జనులందరును పట్టణస్థులందరును త్వరపడి పెందలకడలేచి మైదానమునెదుట ఇశ్రాయేలీయులను ఎదుర్కొని, తాము అంతకుముందు నిర్ణయించుకొనిన స్థలమున యుద్ధముచేయుటకు బయలుదేరిరి. తన్ను పట్టుకొనుటకు పొంచియున్న వారు పట్టణమునకు పడమటివైపుననుండిన సంగతి అతడు తెలిసికొనలేదు.
15. యెహోషువయు ఇశ్రాయేలీయులందరును వారి యెదుట నిలువలేక ఓడిపోయినవారైనట్టు అరణ్యమార్గముతట్టు పారిపోయినప్పుడు
16. వారిని ఆతురముగా తరుముటకై హాయిలోనున్న జనులందరు కూడుకొని యెహోషువను తరుముచు పట్టణమునకు దూరముగా పోయిరి.
17. ఇశ్రాయేలీయులను తరుముటకు పోనివాడొకడును హాయిలోనేగాని బేతేలులోనేగాని మిగిలియుండ లేదు. వారు గవిని వేయక పట్టణమును విడిచి ఇశ్రా యేలీయులను తరుమబోయి యుండిరి.
18. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను నీవు చేతపట్టు కొనిన యీటెను హాయి వైపుగా చాపుము, పట్టణమును నీ చేతి కప్పగింతును, అంతట యెహోషువ తన చేతనున్న యీటెను ఆ పట్టణమువైపు చాపెను.
19. అతడు తన చెయ్యి చాపగా పొంచియున్నవారు మాటులోనుండి త్వరగా లేచి పరుగెత్తి పట్టణములో చొచ్చి దాని పట్టుకొని అప్పుడే తగులబెట్టిరి.
20. హాయివారు వెనుక వైపు తిరిగి చూచినప్పుడు ఆ పట్టణముయొక్క పొగ ఆకాశమున కెక్కుచుండెను. అప్పుడు అరణ్యమునకు పారిపోయిన జనులు తిరిగి తమ్మును తరుముచున్న వారి మీద పడుచుండిరి గనుక ఈ తట్టయినను ఆ తట్టయినను పారిపోవుటకు వారికి వీలులేక పోయెను.
21. పొంచియున్నవారు పట్టణమును పట్టుకొనియుండుటయు పట్టణపు పొగ యెక్కుచుండు టయు యెహోషువయు ఇశ్రాయేలీయులందరును చూచి నప్పుడు వారు తిరిగి హాయివారిని హతము చేసిరి.
22. తక్కిన వారును పట్టణములోనుండి బయలుదేరి వారికి ఎదురుగా వచ్చిరి. అట్లు ఈ తట్టు కొందరు ఆ తట్టు కొందరు ఉండగా హాయివారు ఇశ్రాయేలీయుల నడుమ చిక్కుబడిరి గనుక ఇశ్రాయేలీయులు వారిని హతముచేసిరి. వారిలో ఒకడును మిగులలేదు; ఒకడును తప్పించుకొనలేదు.
23. వారు హాయి రాజును ప్రాణముతో పట్టుకొని యెహోషువయొద్దకు తీసికొనివచ్చిరి.
24. బీటిలోను పొలములోను హాయి నివాసులను తరిమిన ఇశ్రాయేలీయులు వారిని చంపుట చాలింపగా, కత్తివాత కూలక మిగిలినవాడొకడును లేకపోయినప్పుడు ఇశ్రా యేలీయులందరు హాయియొద్దకు తిరిగివచ్చి దానిని కత్తి వాతను నిర్మూలము చేసిరి.
25. ఆ దినమున పడిన స్త్రీ పురుషు లందరు పండ్రెండు వేలమంది.
26. యెహోషువ హాయి నివాసులనందరిని నిర్మూలము చేయువరకు ఈటెను పట్టు కొని చాచిన తన చేతిని తిరిగి ముడుచుకొనలేదు.
27. యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించిన మాటచొప్పున ఇశ్రాయేలీయులు ఆ పట్టణములోని పశువులను సొమ్మును తమకొరకు కొల్లగా దోచుకొనిరి.
28. అట్లు యెహోషువ హాయి నిత్యము పాడైపోవలెనని దాని కాల్చివేసెను; నేటి వరకు అది అట్లే యున్నది.
Joshua 9
1. యొర్దాను అవతలనున్న మన్యములోను లోయలోను లెబానోను నెదుటి మహాసముద్ర తీరమందంతటను ఉన్న హిత్తీయులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులు అను వారి రాజులందరు జరిగినదానిని వినినప్పుడు
2. వారు యెహోషువతోను ఇశ్రాయేలీయులతోను యుద్ధము చేయుటకు కూడివచ్చిరి.
3. యెహోషువ యెరికోకును హాయికిని చేసినదానిని గిబియోను నివాసులు వినినప్పుడు
4. వారు కపటోపాయము చేసి, రాయబారులమని వేషము వేసికొని బయలుదేరి, తమ గాడిదలకు పాత గోనెలుకట్టి పాతగిలి చినిగి కుట్ట బడియున్న ద్రాక్షారసపు సిద్దెలు తీసికొని
5. పాతగిలి మాసికలు వేయబడిన చెప్పులు పాదములకు తొడుగుకొని పాతబట్టలు కట్టుకొని వచ్చిరి. వారు ఆహారముగా తెచ్చుకొనిన భక్ష్యములన్నియు ఎండిన ముక్కలుగా నుండెను.
6. వారు గిల్గాలునందలి పాళెములోనున్న యెహోషువ యొద్దకు వచ్చి మేము దూరదేశమునుండి వచ్చినవారము, మాతో నొక నిబంధనచేయుడని అతనితోను ఇశ్రాయేలీయులతోను చెప్పగా
7. ఇశ్రాయేలీయులుమీరు మా మధ్యను నివసించుచున్నవారేమో, మేము మీతో ఏలాగు నిబంధన చేయగలమని ఆ హివీయులతో ననిరి.
8. వారు మేము నీ దాసులమని యెహోషువతో చెప్పినప్పుడు యెహోషువ మీరు ఎవరు? ఎక్కడనుండి వచ్చితిరి? అని వారి నడుగగా
9. వారు నీ దేవుడైన యెహోవా నామమునుబట్టి నీ దాసులమైన మేము బహుదూరమునుండి వచ్చితివిు; ఏలయనగా ఆయన కీర్తిని ఆయన ఐగుప్తులో చేసిన సమస్తమును యొర్దానుకు అద్దరినున్న
10. హెష్బోను రాజైన సీహోను, అష్తారోతులోనున్న బాషాను రాజైన ఓగు అను అమోరీయుల యిద్దరు రాజులకు ఆయన చేసినదంతయు వింటిమి.
11. అప్పుడు మా పెద్దలును మా దేశనివాసులందరును మాతో మీరు ప్రయాణముకొరకు ఆహారము చేత పట్టుకొని వారిని ఎదుర్కొనబోయి వారితోమేము మీ దాసులము గనుక మాతో నిబంధనచేయుడి అని చెప్పుడి అనిరి.
12. మీ యొద్దకు రావలెనని బయలుదేరిన దినమున మేము సిద్ధపరచుకొని మా యిండ్లనుండి తెచ్చుకొనిన మా వేడి భక్ష్యములు ఇవే, యిప్పటికి అవి యెండి ముక్కలాయెను.
13. ఈ ద్రాక్షారసపు సిద్దెలను మేము నింపినప్పుడు అవి క్రొత్తవే, యిప్పటికి అవి చినిగిపోయెను. బహుదూరమైన ప్రయాణము చేసినందున ఈ మా బట్టలును చెప్పులును పాతగిలి పోయెనని అతనితో చెప్పిరి.
14. ఇశ్రాయేలీయులు యెహోవాచేత సెలవుపొందకయే వారి ఆహారములో కొంత పుచ్చుకొనగా
15. యెహోషువ ఆ వచ్చినవారితో సమాధానపడి వారిని బ్రదుకనిచ్చుటకు వారితో నిబంధనచేసెను. మరియు సమాజప్రధానులు వారితో ప్రమాణము చేసిరి.
Luke 22
63. యేసును పట్టుకొనిన మనుష్యులు ఆయనను అపహసించి కొట్టి, ఆయన ముఖము కప్పి,
64. నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమని ఆయనను అడిగి
65. ఆయనకు విరోధముగా ఇంకను అనేక దూషణ వచనములాడిరి.
66. ఉదయము కాగానే ప్రజల పెద్దలును ప్రధాన యాజకులును శాస్త్రులును సభకూడి, ఆయనను తమ మహా సభలోనికి తీసికొనిపోయి
67. నీవు క్రీస్తువైతే మాతో చెప్పుమనిరి. అందుకాయన నేను మీతో చెప్పినయెడల మీరు నమ్మరు.
68. అదియుగాక నేను మిమ్మును అడిగినయెడల మీరు నాకు ఉత్తరము చెప్పరు.
69. ఇది మొదలుకొని మనుష్యకుమారుడు మహాత్మ్యముగల దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడగునని వారితో చెప్పెను.
70. అందుకు వారందరు అట్లయితే నీవు దేవుని కుమారుడవా? అని అడుగగా ఆయన మీరన్నట్టు నేనే ఆయనను అని వారితో చెప్పెను.
71. అందుకు వారు మనకిక సాక్షులతో పని ఏమి? మనము అతని నోటిమాట వింటిమిగదా అని చెప్పిరి.
Luke 23
1. అంతట వారందరును లేచి ఆయనను పిలాతునొద్దకు తీసికొనిపోయి
2. ఇతడు మా జనమును తిరుగబడ ప్రేరేపించుచు, కైసరునకు పన్నియ్యవద్దనియు, తానే క్రీస్తను ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమని ఆయనమీద నేరము మోపసాగిరి.
3. పిలాతు నీవు యూదుల రాజువా అని ఆయనను అడుగగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పెను.
4. పిలాతు ప్రధాన యాజకులతోను జనసమూహములతోను ఈ మనుష్యుని యందు నాకు ఏ నేరమును కనబడలేదనెను.
5. అయితే వారు ఇతడు గలిలయ దేశము మొదలుకొని ఇంతవరకును యూదయ దేశమందంతట ఉపదేశించుచు ప్రజలను రేపు చున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి.
6. పిలాతు ఈ మాట విని ఈ మనుష్యుడు గలిలయుడా అని అడిగి
7. ఆయన హేరోదు అధికారము క్రింద ఉన్న ప్రదేశపు వాడని తెలిసికొని హేరోదునొద్దకు ఆయనను పంపెను. హేరోదు ఆ దినములలో యెరూషలేములో ఉండెను.
8. హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. ఆయననుగూర్చి చాల సంగతులు విన్నందున ఆయన ఏదైనను ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి, బహుకాలమునుండి ఆయనను చూడగోరెను.
9. ఆయనను చూచినప్పుడు చాల ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరమేమియు ఇయ్యలేదు.
10. ప్రధానయాజకులును శాస్త్రులును నిలువబడి ఆయనమీద తీక్షణముగా నేరము మోపిరి.
11. హేరోదు తన సైనికులతో కలిసి, ఆయనను తృణీకరించి అపహసించి, ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతునొద్దకు మరలపంపెను.
12. అంతకు ముందు హేరోదును పిలాతును ఒకనికొకడు శత్రువులై యుండి ఆ దినముననే యొకనికొకడు మిత్రులైరి.
13. అంతట పిలాతు ప్రధానయాజకులను అధికారులను ప్రజలను పిలిపించి
14. ప్రజలు తిరుగబడునట్లు చేయుచున్నాడని మీరీమనుష్యుని నాయొద్దకు తెచ్చితిరే. ఇదిగో నేను మీయెదుట ఇతనిని విమర్శింపగా మీరితని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడ లేదు;
15. హేరోదునకు కూడ కనబడలేదు. హేరోదు అతని మాయొద్దకు తిరిగి పంపెను గదా; ఇదిగో మరణ మునకు తగినదేదియు ఇతడు చేయలేదు.
16. కాబట్టి నేనితనిని
17. శిక్షించి విడుదల చేయుదునని వారితో చెప్పగా
18. వారందరు వీనిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయుమని ఏకగ్రీవముగా కేకలువేసిరి.
19. వీడు పట్టణములో జరిగించిన యొక అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడినవాడు.
20. పిలాతు యేసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాటలాడినను.
21. వారు వీనిని సిలువవేయుము సిలువవేయుము అని కేకలు వేసిరి.
22. మూడవ మారు అతడుఎందుకు? ఇతడు ఏ దుష్కార్యము చేసెను? ఇతనియందు మరణమునకు తగిన నేరమేమియు నాకు అగపడలేదు గనుక ఇతని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పెను.
23. అయితే వారొకే పట్టుగా పెద్ద కేకలువేసి, వీనిని సిలువవేయుమని అడుగగా వారి కేకలే గెలిచెను.
24. కాగా వారడిగినట్టే జరుగవలెనని పిలాతు తీర్పుతీర్చి
25. అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడియుండినవానిని వారడిగినట్టు వారికి విడుదలచేసి, యేసును వారికిష్టము వచ్చినట్టు చేయుటకు అప్పగించెను.
Psalms 51
1. దేవా, నీ కృపచొప్పున నన్ను కరుణింపుము నీ వాత్సల్య బాహుళ్యముచొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము
2. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము.
3. నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి నా పాపమెల్లప్పుడు నాయెదుట నున్నది.
4. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసియున్నాను నీ దృష్టియెదుట నేను చెడుతనము చేసియున్నాను కావున ఆజ్ఞ ఇచ్చునప్పుడు నీవు నీతిమంతుడవుగా అగపడుదువు తీర్పు తీర్చునప్పుడు నిర్మలుడవుగా అగపడుదువు.
5. నేను పాపములో పుట్టినవాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను.
6. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు.
7. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిమముకంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము.
8. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము అప్పుడు నీవు విరిచిన యెముకలు హర్షించును.
9. నా పాపములకు విముఖడవుకమ్ము నా దోషములన్నిటిని తుడిచివేయుము.