రోలర్ కోస్టర్


  • Author: Dr G Praveen Kumar
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 4
  • Reference: Sajeeva Vahini - Daily Devotion

రోలర్ కోస్టర్

ఒకానొక రోజు అమెరికా లోని ఫ్లోరిడా ప్రాంతంలో ప్రయాణించినప్పుడు అక్కడ సందర్శకులను ఆకట్టుకునే హాలీవుడ్ ప్రదేశానికి వెళ్లాను. ఆ ప్రాంతంలో, నా జీవితంలో మొట్టమొదటి సారి “రోలర్ కోస్టర్” ఎక్కాను. హై స్పీడ్ తో మలుపులు తిరగడంతో నేను, “దీనిని ఆపేయండి! నేను దిగిపోతాను” అని అరవడం మొదలు పెట్టాను. అయితే రోలర్ కోస్టర్ ఆగలేదు, గాని నేను మాత్రము మిగిలిన ప్రయాణమంతా భయంతో గట్టిగా పట్టుకోవాల్సి వచ్చింది.

ఒక్కోసారి కొండపైకి క్రిందకు జారిపోవడం, మనకు తెలియకుండానే మలుపులు తిరగడంతో కొన్ని సార్లు జీవితం మనకు ఇష్టంలేని రోలర్ కోస్టర్ ప్రయాణంలా ఉంటుంది. ఊహించని కష్టాలు ఎదురైనప్పుడు, దేవునియందు నమ్మికయుంచడమే ఉత్తమమైన విషయమని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు గుర్తుచేస్తుంది. తన దేశము దురాక్రమణకు గురైన అల్లకల్లోల పరిస్థితులలో ప్రవక్తయైన యెషయా పరిశుద్ధాత్మచే ప్రేరేపించబడిన వాడై, ప్రభువు దగ్గర నుండి ఈ బలమైన వాగ్దానాన్ని గుర్తించాడు :”ఎవనిమనస్సు నీమీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతిగలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచి యున్నాడు.” (యెషయా 26:3)

మనము ఆయన తట్టు తిగినప్పుడు మన రక్షకుడు. “సమస్త జ్ఞానమునకు మించిన” (ఫిలిప్పీ 4:7) సమాధానమును మనకు దయజేస్తాడు. అత్యంత భయంకరమైన క్యాన్సర్ వ్యాధికి చెందిన ఒక స్త్రీ ప్రార్ధించమని నాతొ పంచుకున్న తన మాటలు నాకు ఎప్పుడు గుర్తుంటాయి. “ఏమి జరుగుతుందో నాకు తెలియదు గాని, దేవుడు ఈ రాత్రి మాతో ఉన్నాడు కాబట్టే నేను బాగుంటానని తెలుసు. జీవితంలో కష్టాలుంటాయి. అయితే జీవితముకంటే మనలను మిన్నగా ప్రేమించిన మన రక్షకుడు, వాటన్నిటికంటే గొప్పవాడు”. హల్లెలూయ. అట్టి విశ్వాసం కలిగియిండ ప్రయత్నిద్దామా. అమెన్.

https://youtu.be/BijySr03gGA