వార్త భయానకముగా ఉన్నప్పుడు..!
నా స్నేహితురాలు తరుచూ అనారోగ్యంగా ఉంటూ ఉండేది. డాక్టర్లు ఎన్నో రకాల పరీక్షలు చేసినప్పటికీ ఆ సమస్యకు కారణం కనుక్కోలేకపోయారు. మరి కొంత నైపుణ్యత కలిగిన డాక్టర్ల దగ్గరకు వెళ్లి మరి కొన్ని పరీక్షలు చేయడం మొదలుపెట్టారు. ఇంతలో రిపోర్టులు రానే వచ్చాయి. డాక్టరు మాటలతో ఆమె గుండెల్లో రాయి పడినట్లయింది. అది క్యాన్సర్. ఈ వార్త తనను, తన కుటుంబాన్ని, స్నేహితులను కలచివేసింది. ఒక్కసారి తనవారి వైపు చూసి ఆలోచించినప్పుడు ప్రపంచం ఆగిపోయినట్లనిపించింది. ఈ శ్రమనుండి తప్పించబడే వార్తను ఆశిస్తూ తన కుటుంబమంతా పట్టుదలతో ప్రార్ధించారు. డాక్టర్లు ఏమి చేయగలరు? తన కళ్ళ నుండి కన్నీళ్ళు జారుతుండగా మెల్లగా ఇలా అన్నది, “దేవా, ఇది మాకు మించినది, దయజేసి మా బలముగా నీవుండుము”.
వార్త భాయానకముగా ఉన్నప్పుడు, పరిస్థితులు మన ఆధీనంలో లేనప్పుడు ఏమి చేస్తాము? మన స్థితి నిరాశాజనకంగా ఉన్నప్పుడు ఏ తట్టు తిరుగుతాము?
నేను వినగా జనులమీదికి వచ్చువారు సమీపించు వరకు నేను ఊరకొని శ్రమదినముకొరకు కనిపెట్టవలసి యున్నది నా అంతరంగము కలవరపడుచున్నది ఆ శబ్దమునకు నా పెదవులు కదలుచున్నవి నా యెముకలు కుళ్లిపోవుచున్నవి నా కాళ్లు వణకు చున్నవి. (హబక్కూకు 3:16) లో హబక్కూకు అంటూ ఉన్నాడు. ప్రవక్తయైన హబక్కూకు పరిస్థితి అతని వశములో లేనప్పుడు, రాబోయే తీర్పు తనలోని భయము తననింకా కలవరపెడుతున్నప్పుడు,”వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు; అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగ బ్రదుకును.” (హబక్కూకు 2:4) అంటూ... ఇటువంటి పరిస్థితుల్లో కూడా హబక్కూకు విశ్వాసముతో బ్రతకడానికి దేవునిలో ఆనందించడానికే ఎంచుకున్నాడు. “అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్షచెట్లు ఫలింపకపోయినను ఒలీవచెట్లు కాపులేకయుండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొఱ్ఱెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవాయందు ఆనందించెదను నా రక్షణకర్తయైన నా దేవునియందు నేను సంతోషించెదను” (హబక్కూకు 3:17,18).
తన నమ్మకాన్ని మరియు విశ్వాసాన్ని తనకున్న పరిస్థితులలో, సామర్ధ్యంలో, లేదా తనకు కలిగిన వాటిని బట్టి కాక దేవుని మంచితనంలో, గోప్పతనంలో పెట్టుకున్నాడు హబక్కూకు. దేవునిలో అతనికున్న విశ్వాసము, “ప్రభువగు యెహోవాయే నాకు బలము ఆయన నా కాళ్లను లేడికాళ్లవలె చేయును ఉన్నతస్థలముల మీద ఆయన నన్ను నడవచేయును.” (హబక్కూకు 3:19) అని చెప్పేలా అతనిని బలవంతము చేసింది.
ఒక భయంకరమైన వ్యాధి లేదా కుటుంబంలో సంక్షోభం, ఆర్ధిక సమస్యలవంటి కష్ట పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు మనము కూడా మన విశ్వాసాన్ని, నమ్మకాన్ని దేవునియందే నిలపాలి. మనము ఎదుర్కొనే ప్రతిదానిలో ఆయన మనతో ఉన్నాడు... ఉంటాడు. ఎటువంటి క్లిష్ట పరిస్థితులు మనకు ఎదురైనా దేవుడు మన బలమని విశ్వసిస్తే గొప్ప అనుభూతిని పొందవచ్చు. ఆమెన్.
https://youtu.be/uNADHoJjkKw