మీకొరకు ఒక సమాధాన గృహము
శరణార్ధులు (Refugee), వీరు యుద్ధము లేదా హింసవలన తమ గృహాలను విడిచిపెట్టవలసిన వారు. నేడు మనం ప్రపంచంలో వీరి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. అయితే, ప్రతి బిడ్డ విద్యను, ప్రతి వయోజనుడు అర్ధవంతమైన పనిని, ప్రతి కుటుంబము ఒక గృహాన్ని కలిగియుండులాగున శరణార్ధులను స్వీకరించేలా కలిసి పని చేయాలని ఐక్యరాజ్య సమితి నాయకులకు విజ్ఞాపన చేసింది.
నిర్దయులైన అష్షూరీయుల సైన్యము యూదా జనులను వారి గృహాలను విడిచి వెళ్ళమని భయపెట్టినప్పుడు దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానాన్ని సంక్షోభములోనున్న శరణార్ధులకు ఇళ్ళను నిర్మించాలన్న కల నాకు గుర్తు చేసింది. ప్రవక్తయైన మీకాను వారు తమ ఆలయాన్ని, తమ ప్రియమైన నగరమైన యేరూషలేమును కోల్పోతారని ప్రజలను హెచ్చరించమని ఆజ్ఞాపించాడు.
అయితే వారు కోల్పోయినదానికి మించిన భవిష్యత్తును కూడా దేవుడు ఇస్తానని వాగ్దానం చేశాడు. లోకములో ఉన్న జనులను దేవుడు తన దగ్గరకు పిలిచే రోజు వస్తుందన్నాడు మీకా. హింస అంతమవుతుంది. యుద్దోపకరణాలు వ్యవసాయానికి పనిముట్లవుతాయి. దేవుని పిలుపుకు విధేయుడైన ప్రతివాడు ఆయన రాజ్యములో ఒక సమాధాన గృహాన్ని, ఫలభరితమైన జీవితాన్ని కలిగియుంటాడు. “ఎవరి భయములేకుండ ప్రతివాడును తన ద్రాక్షచెట్టుక్రిందను తన అంజూరపు చెట్టుక్రిందను కూర్చుండును;” మీకా 4:4
నేనంటాను, నేడు మనందరికీ, ఒక సమాధాన గృహమనేది వాస్తవముగా కన్నా ఒక కలగానే మిగిలిపోయిందేమో? అట్టి సమాధాన గృహాలు వాస్తవం కావాలని మనము వేచి చూస్తూ, ప్రార్ధిస్తూ ఉన్న మనకు దేవుడు అట్టి సమాధాన గృహాన్ని దయజేయగలడు. అంతేకాదు మరింత గొప్ప సమాధాన గృహాన్ని దేవుడు మనకు తన రాజ్యంలో కూడా దయజేయగలడనే వాగ్దానం ఉంది. ఆమెన్.
https://youtu.be/ydxR_9_jwJQ