తప్పు చేశాననే ఫీలింగ్
అనుకోకుండా ఒక చిన్న పొరపాటు చేశాము వాటిని ఎలా సరిదిద్దుకోవాలి?. కొన్ని తెలియక జరిగే పొరాపాట్లు మరి కొన్ని తెలిసి చేసినవి. ఉదాహరణకు ఇతరుల మాటలు నమ్మి ఇరువురి మధ్య విబేధ భావన, మనస్పర్ధలు లేదా అనరాని మాటలవలన సంబంధం చెడిపోయినప్పుడు. తలిదండ్రులకు ఇష్టం లేని పని చేసినప్పుడు, వీటన్నిటికంటే మన రహస్య జీవితంలో దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు. అవన్నీ తప్పు, అలా చేసి యుండకుండా ఉండవలసిందనే అలోచలనలతో మనం కృంగిపోతూ ఉంటాము. అపరాధభావన ప్రతి మనిషిని అది కుదిపేసి కొన్ని సార్లు ఒంటరిని చేస్తుంది. జీవితం చీకటిలో ప్రయాణిస్తూ ఉన్నట్టు ఉంటుంది. తప్పు చేశాననే ఫీలింగ్ నుండి బయటపడే మార్గాలను వెతకడం ప్రారంభిస్తాము. అట్టి పాపములకు కలిగే పర్యవసనాలను గుర్తుచేసికొని నిరాశపడుతూ ఉంటాము. అయితే, క్షమాపణ కోరడం మాత్రము కాదుగాని, అట్టి మనసును కలిగియుండి, నిజంగా పొరపాటు జరిగిందని దానిని కప్పుకోక ఒప్పుకోవడంలో నిజమైన శాంతిని పొందుకోగలమని దావీదు తన అనుభవాన్ని వివరించాడు.
నా దోషమును కప్పుకొనక నీ యెదుట నాపాపము ఒప్పుకొంటిని యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందు ననుకొంటిని. నీవు నా పాపదోషమును పరిహరించియున్నావు. (కీర్తనల గ్రంథము 32:5)
పాపాన్ని ఒప్పుకోవడం ద్వారా రాజైన దావీదు కూడా క్షమాపణ పొంది నిశ్చింతగా ఉన్నాడు. బెత్షేబాకు, ఊరియాకు విరోధముగా చేసిన పాపములను కప్పుకోక ఒప్పుకొన్నప్పుడు ప్రభువు అతని పాపదోషములను పరిహరించాడు. యెహోవాయందు నమ్మికయుంచు వానిని కృప ఆవరించుచున్నందున దావీదు ఉత్సహించాడు. మన పాపములకు కలిగే పర్యవసనాలను మనం నియంత్రించలేము, పాపాలను ఒప్పుకొని క్షమాపణ కోరినప్పుడు ప్రజల ప్రతిస్పందనలను కూడా అదుపు చేయలేము. మన అపరాధములను ఆయన ఇక ఎన్నడు గుర్తు చేసుకోనని నిర్ధాన చేసినప్పుడు, పాప దాస్యము నుండి స్వేచ్ఛను ఆస్వాదించడానికి, పాపములను ఒప్పుకొనినప్పుడు సమాధానాన్ని పొందుకోడానికి దేవుడు మనలను శక్తివంతులను చేయగలడు.
https://youtu.be/hC1RT8ULFC4