వినయము
నా స్నేహితుడైన జాన్ కు ఒక పెద్ద అంతర్జాతీయ సంస్థలో ఉద్యోగం దొరికింది. ఆ కంపెనీలో తాను క్రొత్తగా చేరిన కొన్ని దినములలో అతను పని చేస్తున్న క్యాబిన్ దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి, మాటలు కలిపి, తాను అక్కడేమి చేస్తున్నాడో అడిగాడు. అతనికి తన పని గురించి చెప్పిన తరువాత, జాన్ అతని పెరేమిటని అడిగాడు. “నా పేరు ఎడ్వర్డ్” అని బదులిచ్చాడు. “మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషం.” అన్నాడు జాన్. “మీరు ఏమి చేస్తారిక్కడ?” అని జాన్ అతనిని అడిగాడు. “ఓ, నేను దీనికి యజమానిని” అన్నాడు ఎడ్వర్డ్.
మామూలుగా, ఎంత వినమ్రంగా సాగిన ఈ సంభాషణ, ఈ ప్రపంచంలోకెల్లా ధనవంతుడైన ఒకనిని, తనకు పరిచయం చేసిందని, ఉన్నట్టుండి గ్రహించాడు నా స్నేహితుడు జాన్. మనల్ని మనం పొగడుకొని, “నన్ను” “నేను” అను దానిని గొప్పచేసికొనే ఈ రోజుల్లో, ఈ చిన్న కథ ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రికలో పౌలు “కక్షచేతనైనను వృధాతిషయము చేతనైనను ఏమియు చేయక; వినయమైన మనస్సుగలవారై యొకనినొకడు తనకంటె యోగ్యుడని యెంచుచు (ఫిలిప్పీయులకు 2 : 3)” అన్న మాటలు మనకు గుర్తుచేస్తుంది. తమ వైపుకి గాక ఇతరులవైపుకు మళ్ళించేవారు పౌలు పేర్కొంటున్న లక్షణాలు కలిగినవారైయున్నారు. ఇతరులను మనకంటే ఎక్కువ విలువైనవారుగా ఎంచినప్పుడు, క్రీస్తు వంటి వినయము మనము ప్రదర్శిస్తాము.
యేసు క్రీస్తు కూడా పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని, పరిచారము చేయుటకు వచ్చెను (మార్కు 10:45). ఇతరుల యెడల అట్టి వినయ మనసు మనకు కలిగినప్పుడే క్రీస్తు మనసు కలిగియుంటాము. అట్టి వినయ మనసు కలిగియుండుటకు ప్రయత్నిద్దామా. ఆమెన్.
https://youtu.be/C9m4P4xUkxo