హెబ్రీయులకు 13:6 - కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు? అనిమంచి ధైర్యముతో చెప్పగలవారమై యున్నాము.
భయం అందరిపై దాడి చేస్తుంది.
యేసు క్రీస్తు ద్వారా మనం జీవితంలో సంతోషాన్ని పొందకుండా ఉండాలని అపవాది ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటాడు. మనం భయానికి లొంగిపోయి, దానికి స్వరం ఇస్తే, మనం శత్రువుకు తలుపు తెరిచి, దేవునికి తలుపును మూసివేస్తాము.
కానీ భయానికి లొంగిపోకుండా,
దేవుడు మనకు సహాయకుడు, మన ఆశ్రయం
మరియు మనకు బలమైన కోట అని ధైర్యంగా ఒప్పుకోవడం నేర్చుకోవచ్చు. దేవుని వాక్యం మనలను మెళకువగా ప్రార్థించమని బోధిస్తుంది. నిజమైన విజయంలో జీవించాలంటే, ప్రార్థనకు మనల్ని మనం అంకితం చేసుకోవడం ముఖ్యం. ఆమెన్.