మెలకువగా ఉండి ప్రార్థనచేయుడి


  • Author: Dr. G. Praveen Kumar
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 4
  • Reference: Sajeeva Vahini - Daily Devotion

మత్తయి 26:41 - మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థనచేయుడి; ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనము

ఈ ప్రకరణంలో ప్రధాన సూచన ఏమిటంటే, మనల్ని మనం చూడటం మరియు శత్రువులు మన మనస్సులు మరియు మన భావోద్వేగాలకు వ్యతిరేకంగా చేసే దాడులను చూడటం. ఈ దాడులు గుర్తించబడినప్పుడు, మనము వెంటనే ప్రార్థన చేయవచ్చు. మనం ప్రార్థించినప్పుడే మన జీవితాల్లో శక్తి విడుదలవుతుంది. తరువాత ప్రార్ధిస్తాను అనే ఆలోచన వలన ఎటువంటి ప్రయోజనం లేదు.

ప్రతి విషయాన్ని గమనించి ప్రార్థించమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ఈ నిర్ణయం మీ దైనందిన జీవితానికి మరింత ఆనందం మరియు శాంతిని కలిగించేదిగా మీరు కనుగొంటారని నేను నమ్ముతున్నాను. ఆమెన్