హేబ్రీయులకు 12:2 - మనముకూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన
యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము.
జీవితమనే పందెంలో పరుగెత్తాలంటే, మన విధిని నెరవేర్చుకోవాలంటే
మరియు దేవుని చిత్తం చేయాలంటే, మనం ప్రతి భారాన్ని
మరియు పాపాన్ని పక్కనపెట్టి, ఓర్పుతో పందెములో పరుగెత్తడం ప్
రాముఖ్యం. పరుగు పందెంలో పరుగెత్తే వారు వస్త్రధారణతో పాటుశరీరాన్ని కూడా సిద్ధం చేసుకొని ప్రతిదినం కసరత్తు చేయాలి.
మన క్రైస్తవ జీవితంలో,
దేవుడు మన ముందు ఉంచిన పందెంలో పరుగెత్తకుండా మనల్ని అడ్డుకునే దేనినైనా తొలగించడానికి మనం పిలువబడ్డాము. మనం మన పందెంలో గెలవాలంటే, పరిశుద్ధాత్మ అభిషేకంతో సిద్ధపడడం ఎంతైనా ప్
రాముఖ్యం. మనలను చిక్కుల్లో పడవేయడానికి
మరియు దేవుని వాక్యానికి విధేయతతో జీవించకుండా, ఆయనతో సన్నిహిత సంబంధాన్ని పెంపొందించుకోకుండా నిరోధించడానికి అపవాదికి అనేక మార్
గాలు ఉన్నాయి. కొన్ని సార్లు అనేక ఎదురవుతాయి. కానీ దేవుని మార్గనిర్దేశంతో, మనకు ఆటంకం కలిగించే వాటిని మనం తొలగించుకోవచ్చు. మీ లక్ష్యంపై మీ దృష్టిని ఉంచండి
మరియు మీ దృష్టిని మరల్చే వాటిని గూర్చి
మరియు మీ పూర్తి సామర్థ్యాన్ని నెరవేర్చకుండా ఉంచే విషయాలకు "నో" చెప్పడం నేర్చుకోండి. ఆమెన్.