అనిత్యమైన దేవుని ప్రణాళికలు | Gods plans are for Eternity


  • Author: Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 4
  • Reference: Sajeeva Vahini - Daily Devotion

అనిత్యమైన దేవుని ప్రణాళికలు

కీర్తనల గ్రంథము 33:11 - యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పములు తరతరములకు ఉండును.

మన ఎడలదేవుని ఆలోచనలు ఎన్నడు మారవు. ఎందుకంటే ఆయన మారని మార్పు చెందని దేవుడు.అయితే, పరిశుద్ధ గ్రంధంలోని కొన్ని వాక్యభాగాలను ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు తన మనసు మార్చుకున్నట్టు మనం గమనిస్తూ ఉంటాము. దీనికి కరణమైన ఉదాహరణ చెప్తాను "మీరు గాలికి ఎదురుగా సైకిల్ నడుపుతున్నప్పుడు అది కష్టం అని భావించి, ఆపై మీరు ఆపి ఒక మలుపు తీసుకుంటే, వెనుక నుండి వచ్చిన గాలివలన ప్రయాణం సుళువుగా ఉందని భావిస్తారు, గాలి మారిందని మీరు అనుకోవచ్చు. గాలి మీకు వ్యతిరేకంగా పని చేయడం నుండి మీకు సహాయం చేయులాగున మారింది.  నిజానికి, గాలి మారలేదు, మీరు మీ దిశను మార్చారు." 

అదే విధంగా, దేవుడు తన మనసు మార్చుకున్నాడని భావించడం ద్వారా మనం బైబిల్లో చదివిన దాన్ని తప్పుగా భావించవచ్చు, వాస్తవానికి, ప్రజలు తమ నిర్ణయాలు లేదా దిశలను మార్చుకున్నారు. దేవుడు తన ప్రణాళికలను మార్చినట్లు కనిపించే ఇతర సందర్భాల్లో, పాత నుండి కొత్త నిబంధన వరకు దేవుని ప్రణాళికలను వారి మేలుకొరకే జరిగినవని భావించవచ్చు. 

అయితే, దేవుడు తన మనసు మార్చుకుంటే ఎవరు పట్టించుకుంటారు? ఆయనే సృష్టికర్త. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన ఏమి చేయాలనుకున్నా చేయగలడు! కదా. దేవుడు జీవితానికి మరియు శాశ్వతత్వానికి నియమాలను నిర్దేశిస్తాడు. దేవుడు సైన్స్ లాగా మారితే, ప్రతి కొత్త ఆవిష్కరణతో లేదా ఓ సంస్కృతిలా మారితే, ప్రతి కొత్త తరంతో అతను రెండు వేల సంవత్సరాల క్రితం చెప్పినది ఈ రోజు నిజం కాకపోవచ్చు. 

అయినప్పటికీ, దేవుడు మార్పులేనివాడు కాబట్టి, రెండు లేదా మూడు వేల సంవత్సరాల క్రితం ఆయన బైబిల్లో చెప్పినది ఇప్పటికీ నిజం. వాస్తవానికి 10 ఆజ్ఞలకు గడువు తేదీ లేదు. మనమంతా తన వద్దకు తిరిగి రావడానికి ఒక మార్గాన్ని అందించాలనే దేవుని ప్రణాళిక ఎల్లప్పుడూ మన ప్రయత్నంపై ఆధారపడి ఉంటుంది. మనం ఆయనపై మాత్రమే నమ్మకం ఉంచాలి. ఈ రోజు మనం ఆయన హృదయం యొక్క ఉద్దేశాలను అర్థం చేసుకోవాలనే ఆలోచనలతో అడుగులు ముందుకు వేద్దాం. ఆమెన్.

God-s plans are for Eternity
Psalm 33:11 -But the plans of the LORD stand firm forever, the purposes of his heart through all generations

Our God is unchanging God. But why do the passages in the Bible suggest that God has changed His mind? 
Let me give you an example "If you were riding a bike against the wind, and then you stopped and took a U-Turn, you might think that the wind changed. After all, the wind went from working against you to helping you. In actuality, the wind didn’t change, you did."

In the same way, we can be mistaken what we read in the Bible by thinking that God changed His mind, while in reality, people have changed their decisions or directions. And in other cases where God appears to have changed His plans, we may be seeing the progressive revealing of His plans from Old to New Testament.

You might be thinking, "Who cares if God changes His mind. He’s the Creator. He’s all-powerful. He can do whatever He wants to do!"
But we have to remember. God sets the rules for life and eternity. If God changes like science, with each new discovery, or He changes like culture, with each new generation, what He said  two thousand years ago may no long be true or right today.

Yet, because God is immutable, what He said in the Bible two or three thousand years ago still holds true. The 10 Commandments do not have an expiration date. His plan to provide mankind a way to return to Him, always was dependent upon His effort and not ours. We only need to put our trust in Him. Today, we need to understand the purposes of His Heart. Amen.

Telugu Audio:https://youtu.be/6frvFABAMKE

English Audio: https://youtu.be/Dx1w5unyzyQ