నాలుగు ధర్మశాస్త్రాలు ఏవి?


  • Author: Christian Tracts
  • Category: Articles
  • Reference: http://www.gotquestions.org/Telugu/Telugu-four-laws.html

నాలుగు ధర్మశాస్త్రాలు యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా లభ్యమయే రక్షణ యొక్క శుభ సమాచారాన్ని పంచుకునే ఒక మార్గం. సువార్తలో ఉన్న ముఖ్యమైన సమాచారాన్ని పొందుపరిచే ఒక సరళమయిన విధానం ఇది.

దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు మరియు నీ జీవితం కోసమని ఆయన వద్ద ఒక అద్భుతమైన ప్రణాళిక ఉంది” అన్నది నాలుగు ధర్మశాస్త్రాలలో మొదటిది. “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయన అనుగ్రహించెను” అని యోహాను 3:10 మనకి చెప్తుంది. “గొఱ్ఱెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను” అని యేసు వచ్చిన కారణాన్ని మనకి యోహాను 10:10 తెలుపుతుంది. దేవుని ప్రేమనుంచి మనలని అడ్డుకుంటున్నది ఏది? మనకి ఒక సమృద్ధిగల జీవితం ఉండటాన్ని ఆపుతున్నది ఏది?

నాలుగు ఆధ్యాత్మిక ధర్మశాస్త్రాలలో రెండవది, “విధేయత పాపం వల్ల కళంకపడింది కాబట్టి అది దేవుని వద్ద నుంచి విడిపోయింది” అన్నది. దాని ఫలితంగా మన జీవితాలకైన దేవుని ప్రణాళికని మనం తెలిసికోలేం. “ అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు” అంటూ ఈ సమాచారాన్ని రోమీయులు 3:23 ధృవీకరిస్తుంది. “పాపానికి జీతము మరణము” అని రోమీయులు 6:23 పాపానికి గల పర్యవసానాన్ని మనకి తెలుపుతుంది.

తనతో సహవాసం ఉండటానికి దేవుడు మనలను సృష్టించేడు. ఏమైనప్పటికీ పాపాన్ని లోకంలోకి మానవజాతి తెచ్చింది కాబట్టి అది దేవుని వద్దనుండి విడిపోయింది. మనం తనతో ఉండాలని దేవుడు ఉద్దేశించిన సంబంధాన్ని మనం నాశనం చేసేం. పరిష్కారం ఏమిటి?

ఆధ్యాత్మిక ధర్మశాస్త్రాల్లో మూడవది “ మన పాపానికి దేవుని ఏర్పాటు ఒక్క ఏసుక్రీస్తే” అన్నది. యేసుక్రీస్తు ద్వారా మన పాపాలు క్షమించబడి మనం దేవునితో ఒక యుక్తమైన సంబంధాన్ని మరల పొందుతాము. “అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకా పాపులమైయుండగానే క్రీస్తు మనకోసము చనిపోయెను” అని రోమీయులు 15:3-4 మనకి చెప్తుంది. “అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను” అని తెలియజేస్తూ రక్షింపబడటానికి మనకి తెలిసికోవలిసిన మరియు నమ్మవలిసిన అవసరం ఉందని 1 కొరింధీయులు 15:3-4 సెలవిస్తుంది. యోహాను 14:6 లో రక్షణకి తను ఒక్కడే మార్గమని యేసు తానే యోహాను 14:6 లో ప్రకటిస్తాడు, “నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రి యొద్దకి రాడు.” రక్షణ యొక్క ఈ అద్భుతమైన వరాన్ని నేను ఎలా పొందగలను?

ఆధ్యాత్మిక ధర్మశాస్త్రాలలో నాలుగవది, “రక్షణ యొక్క వరాన్ని మరియు మన జీవితాల కొరకైన దేవుని అద్భుతమైన ప్రణాళికని తెలుసుకోవడానికి మనం మన విశ్వాసాన్ని యేసుక్రీస్తుపైనే ఉంచాలి” అన్నది. దీన్ని యోహాను 1:12 మనకి వర్ణిస్తుంది, “తన్ను ఎందరంగీకరించితిరో, వారికందరికి, అనగా తన నామమందు విశ్వాసముంచినవారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.” అపొస్తలుల కార్యములు 16:31 “ ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము.” అని దీన్ని చాలా స్పష్టంగా చెప్తుంది. “మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు”( ఎఫెసీయులు 2:8-9).

మీ రక్షకునిగా మీరు కనుక యేసుక్రీస్తుని నమ్మాలనుకుంటే ఈ క్రింద ఉన్న వాక్యాలని దేవునితో చెప్పండి. ఈ వాక్యాలని చెప్పడంతో అవి మిమ్ము రక్షింపవు గానీ క్రీస్తుపైన విశ్వాసముంచడం మిమ్ము రక్షిస్తుంది. ఈ ప్రార్థన దేవునియందు మీ విశ్వాసాన్ని వ్యక్తపరచడానికి మరియు మీ రక్షణకి వీలు కల్పించినందుకు ఆయనకి కృతజ్ఞతాస్తులు అర్పించడానికి ఒక దారి మాత్రమే. “దేవా, నేను నీ పట్ల పాపం చేసేనని మరియు నేను శిక్షకి పాత్రుడనని నాకు తెలుసు. కానీ నా శిక్షని ప్రభువు యేసుక్రీస్తు తీసుకున్నాడు. దాని వల్ల ఆయనయందు ఉన్న విశ్వాసము ద్వారా నేను క్షమింపబడగలను. రక్షణ కొరకు నేను నా విశ్వాసాన్ని నీ మీద పెడుతున్నాను. నీ అద్భుతమైన మహిమ మరియు క్షమాపణ కొరకు కృతజ్ఞతలు- నిత్య జీవితం యొక్క వరం! ఆమెన్ ‍.