యెషయా 58:11
యెహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ యెముక లను బలపరచును నీవు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు.
క్రైస్తవ విశ్వాస ప్రయాణం శ్రమలతో కూడినదని గ్రహించాలి. మనం రక్షించబడిన నాట నుండి, ప్రతి దినము మనలోని పాప స్వాభావాలు అగ్ని కొలిమిలో కాల్చబడి దేవుని స్వభావంలోనికి నడిపించబడుతూ ఉంటాయి. మనకు బాగా తెలిసిన సౌకర్యాలను విచిచిపెట్టి, మనకు తెలియని అసౌకర్యంలోకి అడుగు పెట్టే మార్గం ఇది. ఆధ్యాత్మికతలో ఎండిపోయిన స్థితి నుండి వ్యక్తమయ్యే అలసటను
దేవుడు అర్థం చేసుకుంటాడు. ఎడారిలో
సెలయేరు వంటి దేవుని ఆత్మ ద్వారా మనల్ని మనం నూతన పరచుకుంటూ ఉండాలి.
నిరాశలో ఉన్నప్పుడు, దేవునికి మొరపెట్టడం అనేది మన పోరాటాలపై గెలవడానికి మాత్రమే కాదు గాని, భూమిపై మన పనిని విజయవంతంగా నెరవేర్చడానికి మనలో ధైర్యం
మరియు పట్టుదలను పెంపొందించడానికేనని గ్రహించాలి. ఆధ్యాత్మిక జీవితంలో శ్రమలు తప్పనిసరి. ఆధ్యాత్మిక జీవితంలో పర్వత శిఖరాలు లోయలు ఉన్నట్లే, దాటడానికి ఎడారులు కూడా ఉన్నాయి. మనమందరం శ్రమల్లో ఉన్నప్పుడు, మనల్ని తిరిగి పునరుద్ధరించడానికి,
దేవుడు వాక్యం యొక్క నీటి ఊటల దగ్గరకు మనల్ని తీసుకువస్తాడు. అప్పుడు ఆయన తన ఆత్మ ద్వారా తిరిగి బలాన్ని పొందడానికి సహాయపడుతుంది.
మనం చాలా అలసిపోయినప్పుడు,
దేవుడు మనల్ని విడిచిపెట్టాడని మనకు అనిపిస్తుంది. మన జీవితంలో
ఏది మనకు ప్
రాముఖ్యమో
దేవుడు దానిని గ్రహించి, మనల్ని బలపరుస్తూ ఉంటాడు. అందుకే మనం ఆయనను ఎల్లప్పుడూ స్తుతిస్తూనే ఉండాలని నిశ్చయించుకోవాలి. అనుదినం వాక్యాన్ని చదువుతూ ఎల్లప్పుడూ ప్రార్ధనా జీవితాన్ని కలిగి యుండేలా మనల్ని మనం సంసిద్ధం చేసుకోవాలి. ఆమెన్.
అనుదిన వాహిని
Rooted and Grounded
Isaiah 58:11 The LORD will guide you always; he will satisfy your needs in a sun-scorched land and will strengthen your frame. You will be like a well-watered garden, like a spring whose waters never fail.
Our Christian journey can be a road paved with many tears. From the time we are born again, we are ushered into the refiner’s fire that burns away impurities and builds godly character within us. We must choose to leave our comfort zone in order to step into the discomfort of the unknown. God understands the weariness that manifests from a time of spiritual dryness. His Spirit becomes the oasis we need to refresh and renew us in the drought.
Crying out to God in desperation are the times that develop fortitude and perseverance in us needed to win battles and successfully fulfil our task on earth. Spiritual drought is inevitable. Just as there are mountain tops and valleys in the spiritual life, there are also deserts to cross. When we get all dried up,God brings water of the word to refresh us and hydrate us. Then He brings His Spirit to seal us and protect us from the heat and dryness until the season changes.
when we are so weary that we feel God has abandoned us. God sees our need in life, and He promises to restore us to strength.We must be determined to keep praising Him; keep reading the word and keep praying. Amen.
Connecting With God