సంతోషగానాల పంట
కీర్తనల గ్రంథము 126:3
యెహోవా మనకొరకు గొప్పకార్యములు చేసి యున్నాడు మనము సంతోషభరితులమైతివిు.
మన విన్నపములకు
దేవుడు సమాధానమివ్వాలని మన హృదయాలు ఆసక్తిగా ఎదురుచూస్తుంటాయి. మన స్వంత ఆలోచలనతో దేవుని కార్యాలు జరగాలి అనుకుంటాము కాని అది ఆయన నిర్దేశించిన సమయంలో జరిగినప్పుడు వాటి ఫలితాలు గొప్పగా ఆనందకరంగా ఉంటాయి.
ఎన్నో పోరాటాలపై విజయం మన వ్యక్తిగత కన్నీటి ప్రార్ధనలోనే సాధ్యం.
క్రీస్తుపై మనకున్న ఆశీర్వాద నిరీక్షణ మన కథను మన దిశను మారుస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లోనైనా
క్రీస్తుతో పెనవేసుకున్న జీవితాలు, కన్నీళ్లతో విత్తగలిగే ప్రతి ప్రార్ధన సంతోషగానాల పంటను కొస్తాయి. హల్లెలూయ.
మన జీవితంలో జరిగే ప్రతి మంచి విషయానికి ఆయనే కారణమని దేవుని వాక్యం
సెలవిస్తుంది. మన సవాళ్లపై
దేవుడు మనకు ఇచ్చే ప్రతి విజయాన్ని అనుభవించే మన హృదయాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తాయి.
మన హృదయాలను ఆనందంతో నింపినందుకు, కన్నీళ్లతో విత్తిన ప్రతి ప్రార్ధనకు సంతోషగానాల పంటను కోయగలిగే సమాధానాలు పొందే మన జీవితాలు ఆయనకు ఎల్లప్పుడూ సాక్షిగా జీవించాలి. అట్టి కృప ప్రభువు మనందరికీ దయజేయును గాక. ఆమెన్.
Reaping in Joy
Psalms 126: 3. The LORD hath done great things for us, whereof we are glad.
Our hearts await earnestly for our petitions to be answered by God. God may not show up according to our timing but when he shows up, it’s always overwhelming and joyful.
Some of the greatest battles in our prayer closet are with teary eyes. The blessed hope we have in Christ, changes our story. We sow in tears and reap in Joy when we hold on to Christ in all circumstances.
Experiencing the victory that God gives us over the challenges makes our hearts glad. Word of God says he is the reason for every good thing in our life.
Let’s acknowledge Him for filling our hearts with joy and giving a great turnaround, with a testimony of sowing in tears and reaping in Joy. Amen. God Bless!
Connecting With God