ఆనందాల నది | River of Delights


  • Author: Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 4
  • Reference: Sajeeva Vahini - Daily Devotion

కీర్తనల గ్రంథము 36:8 - నీ మందిరము యొక్క సమృద్ధివలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనందప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు.

ప్రపంచవ్యాప్తంగా మన చుట్టూ అనేక విషయాలు జరుగుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు, అన్యాయం మరియు ప్రమాదాలవంటి  వార్తలు వింటూ ఉంటాము. అంతేకాదు, మనలో అనేకమంది అనేక సవాళ్ళతో పోరాడుతున్నారు.

అయితే, కొన్నిసార్లు ఆనందాన్ని కనుగొనడంలో శ్రమలు మనకు సహాయపడతాయి. మనం ఆయనలో నిలిచియున్నప్పుడు దేవుడు తన విశిష్ట మార్గంలో మనల్ని ఆనందాలతో ఎలా నింపుతాడో, అది ఖచ్చితంగా ఆయనను మరింత తెలుసుకోవడంలో కూడా సహాయపడుతుంది.

నా ప్రియమైన స్నేహితులారా, మనం సంతోషంగా ఉండాలనే దేవుడు కోరుకుంటున్నాడు. సంతోషభరితమైన ఫలాలతో మనలను పోషించాలని అనుదినం కోరుకుంటున్నాడు.

మన చుట్టూ ఉన్న ప్రపంచం చీకటి వంటి పరిస్థితులగుండా ప్రయాణిస్తున్నప్పుడు, అదే చీకటి ప్రపంచంలోని దేవుని పిల్లలు ఆనందంతో గొప్ప వెలుగులో ప్రకాశిస్తారు.

మనం ఆయన బిడ్డలం కాబట్టి యేసు క్రీస్తు మనల్ని ఆనందాల నదిలో పోషించడానికి సిద్ధంగా ఉన్నాడు.

యేసు క్రీస్తును తమ స్వంత రక్షకునిగా తెలుసుకున్నవారికే ఈ ఆనందాల నది. ఈ రోజు మీ ప్రార్థన ఈ రీతిగా ఉండనివ్వండి. యేసయ్యా  - "మీ ఆనందాల నదిలో ప్రవహించే నీరు నాలో ప్రవహించనివ్వండి". బిగ్గరగా ఆమెన్ చెపుదామా. ఆమెన్.

https://youtu.be/T38l82cOKGU

River of Delights 

Psalms 36:8 They feast on the abundance of your house; you give them drink from your river of delights.

There are many things that are happening around the world. We hear of natural calamities, injustice, accidents and most of all,each one of us  is battling with the challenges within.
Trials help us to discover Joy and how God in His unique way fills us with delights when we abide in Him.
My dear brothers and sisters, God wants us to be happy and wants to nurture us in the fruit of Joy.
When the world around is heading towards destruction and darkness,God-s children in the same world can shine through the darkness with Joy.
Jesus is ready to nurture us in the river of delights,because we are His children.
To become a Child of God, you need to know Jesus as your saviour and can partake in this river of delights forever.
Let this be your prayer today,
"Let the water that flows in your river of delights well up in me"
Amen. God Bless !

Connecting With God
https://youtu.be/Ug9CeqNQ-i4