యేసు సిలువలో పలికిన ఏడు మాటలు - నాలుగవ మాట
తండ్రి! ఆస్తిలో నాకు రావలసిన భాగము నాకిస్తే నీకు దూరంగా, స్వేచ్ఛగా బ్రతుకుతానని చిన్న కుమారుడంటే; తండ్రి వానికి ఆస్తి పంచిపెట్టాడు. ఆస్తి సమకూర్చుకున్న కుమారుడు దూర దేశం వెళ్లాడు; దుర్వ్యాపారంలో ఆస్తి కరిగిపోయింది, అంతస్తు దిగిపోయింది, వీధులపాలయ్యాడు, చివరకు పంది పొట్టు తినవలసి వచ్చింది. కాని ఇంటి దగ్గర తండ్రి ప్రతి రోజు గుమ్మము దగ్గర నిలబడి
ఏదో ఒకరోజు నా కుమారుడు ఇంటికి తిరిగొస్తాడని ఆశతో ఎదురుచూస్తున్నాడు. ఆ రోజు రానే వచ్చింది. పశ్చాత్తాపంతో కుమారుడు ఇంటికి దూరంగా ఉన్నప్పుడే తండ్రి పరుగెత్తి కౌగలించుకొని, ముద్దుపెట్టుకొని తిరిగి తన ఇంట చేర్చుకున్నాడు.
అయితే, తన స్వరూపంలో తన పోలికలో సృష్టించిన మానవుడు దూరంగా వెళ్ళిపోతే, ఏరోజైనా తిరిగొస్తాడని వేచి చూస్తున్నాడు మనలను సృష్టించిన మన పరమ తండ్రి. మనమింకా
పాపులమై ఉన్నప్పుడు తన ఏకైన కుమారుని ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా దగ్గరకు రమ్మని ప్రాధేయపడ్డాడు. ఏ పాపమైతే తండ్రి నుండి మనలను వేరు చేసిందో ఆ పాపమునుండి మనం వేరు చేయబడితేనే తండ్రికి
మరలా దగ్గరవుతామనుకున్నాడు.
దేవుని
అనాది కాల సంకల్పం; ఇప్పుడు
క్రీస్తుతో మనలను దగ్గర చేసుకోవాలనుకుంటున్నాడు. తన కుమారుడు పొందబోయే ప్రతి గాయం మనలను స్వస్థపరచి విడుదల కలుగజేస్తుందని, తాను పొందబోయే ప్రతి నింద, బాధ, శ్రమ సర్వమానవాళిని నరకము నుండి తప్పించగలదని తండ్రి నిశ్చయించి నిన్ను నన్ను ప్రేమించి తన కుమారుని తృణీకరించి శాపగ్రస్తమైన శిక్షను విమోచన క్రయధనంగా తండ్రి కుమారుని చేయి విడిచేస్తే; మన పాప భారాన్ని మోస్తూ "నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని"
యేసు ప్రాణము విడచి తండ్రికి మనలను దగ్గరగా చేర్చాడు.
ఇదే తండ్రి ప్రేమ!
క్రీస్తు పొందిన ప్రతి శ్రమ మనకొరకేనని, కుమారుని మనకనుగ్రహించిన తండ్రి ప్రేమను గ్రహించి. మన జీవితాలను మార్చుకొని ఆ
క్రీస్తు సిలువలో సంపూర్ణ రక్షణానుభవం పొంది తండ్రి దగ్గరకు చేరుకుందామా!
నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి
మత్తయి 27:46 అభివృద్ధిపరుస్తాడు.
Fourth Word-Sayings of Jesus on the Cross.
When younger son claims that he will live apart free from father ,if he Receives his portion in the property; his father divided the property among the two sons. Property melted away in abuse, declined in status, the son was casted out into streets, and eventually he was made to eat pork rinds. This story is about a son who had accumulated property and travelled to faraway nation.
But at home, the father awaits at door post daily, hoping to see his son one day. There comes the day, when younger son is seen from a distance by Father and he runs towards him. Who had fled away from home and welcomed him with a hug and a kiss, before bringing him back.
Man who was created in the image and likeness of God, who was separated from God due to sin and God awaits for us to return to him one day. While we were still sinners, he pleaded with us to come to him through his one and only Son by sending him into the world. The father desired to restore the relationship with mankind by taking the sin away which separated him from them.
Gods will is to bring us closer to him through Christ alone. Father is sure that every wound that His son will receive will heal us and deliver us. That every blame, pain and suffering that he will receive will save all mankind, so he leaves the hand of the son as a ransom for the cursed punishment while Jesus is carrying the burden of our sins saying" My God, My God why have you forsaken me?" By giving away His only begotten Son, Father drew us closer to him.
This is Father-s Love!
Realize the love of the Father who gave us the son and that all the sufferings of Christ were for us. Lets change our lives and experience salvation in Christ alone and get closer to our Father. Amen. God Bless You.
English Audio: