గెలుపుకు ఓటమికి మధ్య దూరం
విన్సెంట్ వాన్ గోహ్ డచ్ దేశానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తన కళలను 19వ శతాభ్ద కాలంలో ప్రదర్శించాడు. అయితే ప్రఖ్యాతి గాంచిన వ్యక్తీ అని చెప్పబడినట్టు తన జీవితకాలంలో 900ల చిత్రాలను వేసి అమ్మకానికి పెట్టినప్పటికీ, కేవలం ఒకే ఒకటి అమ్మగలిగాడు. ఆశ్చర్యంగా ఉంది కదా. ఒకే ఒక చిత్రం అమ్మిన అతను ప్రపంచ ప్రఖ్యాతి ఎలా
అయ్యాడా అనే సందేహం మీకు ఉన్నట్టు నాకు కుడా ఉంది. ఎందుకంటే, తాను అమ్మలేకపోతున్నాను అనుకోని చిత్రాలను వేయడం మానలేదు, ఎవరు నన్ను ప్రోత్సాహపరచలేదు అనుకోని తన పనిని జరిగించలేదు. తన కళను నైపున్యతను చివరి శ్వాస వరకు కొనసాగిస్తూనే ఉన్నాడు. తాను మరణించిన తరువాత అనేకులు అతని పని తనాన్ని గుర్తించారు. నేటి తరానికి తన కళ మనకు అభ్యాసాలు గా ఉపయోగపడ్డాయి.
జీవితంలో గెలుపుకు ఓటమికి మధ్య దూరం మనం నిర్ణయించుకుంటున్న ఆలోచనల్లో ఉంటుంది. మనలోని తలాంతులను ఎవరూ ప్రోత్సాహించాకపోయినా వాటిని సరైన రీతిలో ఉపయోగిస్తే అది నైపున్యతను మెరుగుపరచడమే కాకుండా మన ఆశయ సాధనకు సహాయపడుతుంది.
ఏదైనా సాధించలేనప్పుడు "నాకురాసి పెట్టలేదు " అనే మాట అందరూ చెప్
పే మాటే. అనుదినం ఓడిపోయననే నిరాశ చెందవద్దు, గెలవడంలో ఓడిపోవచ్చు కాని, ప్రయత్నించడంలో గెలుస్తావు, ప్రయత్నిస్తూ గెలుస్తావు. ఆకులు రాలిపోయిన చెట్టుకే కొత్త ఆకులు చిగురిస్తాయి కదా. జీవితంలో ఎదో కోల్పోయామని బాధపడవద్దు, సహనం లేని వ్యక్తీ ఎన్నటికీ విజయం పొందలేడు. ఎదోలా బ్రదికేస్తే పోలా అనుకుంటూ పొతే
ఏదైనా చేయాలనే ఆలోచన అసలే ఉండదు, అప్పుడు ఏ పని చేసినా విఫలమే.
ఏదైనా సాధించగలను, "నేను
ఏదైనా చేయగలననే" తాపత్రయం మనకుంటే, దానితో పాటు దేవునిపై విశ్వాసం జోడిస్తే
ఏదైనా సాధ్యమే.
ఈ అనుభవాలను ఆలోచిస్తే పరిశుద్ధ గ్రంధంలోని
పేతురు గుర్తుకువచ్చాడు. ముమ్మారు బొంకాననే నిరాశ తనలో ఉన్నా,
క్రీస్తుకొరకు మరణించడానికైనా సిద్దమే అనుకున్నాడు. అతని సంకల్పం, విశ్వాసం, పట్టుదల చివరకు
క్రీస్తు కొరకు హతసాక్షి
అయ్యాడు,
పేతురు అనే బండ మీద
క్రీస్తు సంఘాన్ని స్థాపించాడు. ఓటమి నీ రాత కాదు, గెలుపు ఇంకొకరి సొత్తు కాదు. ఆనాడు
పేతురు, నేడు నువ్వు నేను... ఆ గెలుపుకు నిర్వచనం కావాలనే
క్రీస్తు యేసు యేకైక కొరిక. ఆమెన్.