16:1-63 ఈ అధ్యాయంలోను, 20:3-31 వచనాల్లోను కనిపించే ఉద్దేశాలు చాలా దగ్గరగా ఉన్నాయి. రానున్న తీర్పు నేపథ్యంలో ఇక్కడ
ఇశ్రాయేలు చరిత్రను సమీక్షించారు.
16:1-3
ఇశ్రాయేలు చరిత్రకు పూర్వమే
యెరూషలేముకు శతాబ్దాల చరిత్ర ఉంది (ఆది 14:18), యెహోషువ కాలంలో ఈ పట్టణం ఇశ్రాయేలీయుల జైత్రయాత్రకు అడ్డు నిలిచింది (యెహో 15:61-63).
దావీదు ఈ పట్టణాన్ని జయించిన తర్వాతనే ఇది ఇశ్రాయేలీయుల పట్టణమైంది (2సమూ 5:6-9). బైబిల్ ప్రకారం మానవజాతుల వర్గీకరణలో కనానీయులు,
అమోరీయులు, హితీయులు దగ్గర సంబంధం గలవారు. పైగా ఈ మూడు జాతుల ప్రజలు ఇశ్రాయేలీయులకు పూర్వమే
యెరూషలేములో నివసించిన యెబూసీయులకు సంబంధించినవారు (ఆది 10:15-18; న్యాయాధి 19:11; 2సమూ 5:6).
అమోరీయులు కూడా ఇశ్రాయేలీయులకు పూర్వమే
కనాను ప్రాంతంలో నివసించారు. వీరు. పాలస్తీనాలో నివసించిన సెమిటిక్ జాతి ప్రజలు (ఆది 48:22; యెహో 5:1; 10:5; న్యా యాధి 1:34-36). హితీయులు
కనాను కుమారుడైన
హేతు. వంశస్థులు,
క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరాల క్రితమే వీరు
కనాను ప్రాంతంలో నివసించి వర్ధిల్లిన ప్రజలు (ఆది 10:15; 23:10-20; 26:34; ద్వితీ 7:1). జాతుల మూలాల్లోకి వెళ్లి, ఈ ప్రజలందరిలోను సహజంగానే తిరుగుబాటు స్వభావం ఉందని
యెహెజ్కేలు నిస్పష్టంగా వివరించాడు. భూమ్మీద ఉన్న మనుషులందరి లాగా వీరు కూడా పాపాత్ములే. వీరు పదే పదే
దారి తప్పి తమను తాము విగ్ర
హారాధనకు అప్పగించుకున్నారు. .
16:4 ప్రాచీన కాలంలో అవాంఛిత శిశువుల్ని మరీ ముఖ్యంగా ఆడ శిశువుల్ని పట్టించుకోకుండా వదిలిపెట్టడం జరిగేది. ఈ వచనంలోని వర్ణనలో శిశువును వదిలిపెట్టడం, అది కూడా బొడ్డు తాడు కోయకుండానే, మరణించేలా వదిలిపెట్టడం జరిగింది (నీకు ఉప్పు రాయకపోయిరి బట్టచుట్టకపోయిరి). ఇప్పటి కాలంలో కూడా పాలస్తీనా ప్రాంతంలోని అ
రబ్బీ మంత్రసానులు శిశువుకు బొడ్డు త్రాడును వేరుచేసిన వెంటనే శిశువు శరీరానికి ఉప్పు, నూనె కలిపిన మిశ్రమాన్ని పూయడం పరిపాటి.
16:5
దేవుడు తన ప్రజల్ని బయట నేలను కనుగొనడం ద్వితీ 32:10 వచనంలోని వర్ణనను పోలి ఉంది.
దేవుడు ఇశ్రాయేలును “అరణ్యప్రదేశము లోను భీకరధ్వనిగల పాడైన యెడారిలోను” కనుగొన్నాడు.
16:6 రక్తములో పొర్లుచున్న నిన్ను చూసి అనే పదజాలం
ఇశ్రాయేలు తల్లి చేత విడిచి పెట్టబడిందనే భావనను. నొక్కి చెప్తున్నది. నీవు నీ రక్తములో పొర్లియున్నను బ్రదుకుమని నీతో చెప్పితిని అనే భావప్రకటనలోని బ్రదుకుమని అనే పదం
దేవుడు మనుషులందరూ జీవంతో ఉండాలని కోరుకుంటున్నాడని వెల్లడి చేస్తుంది (18:23,32; 1
తిమోతి 2:4). ఇది మానవులందరూ ఫలించి అభివృద్ధి పొందాలని (ఆది. 1:22,28)
దేవుడు. ఆజ్ఞాపించడాన్ని గుర్తు చేస్తుంది (ఆది. 1:22,28). "అదే ఆజ్ఞను
దేవుడు యాకోబుకు మళ్ళీ ఇచ్చాడు (ఆది 28:3; 35:11; 17:2,6). 16:7-8 ఇష్టము అనే పదం " (వ.8) లైంగిక సంబంధానికి
దారితీసే ప్రీతి(హెబ్రీ. దోదీమ్)ని తెలియజేసే ప్రత్యేకమైన పదం (23:17; పరమ 1:2,4; 4:10; 5:1; 7:13). అవమానము కలుగకుండ అనే పదజాలం కొంగు కప్పడం ద్వారా పెళ్ళి చేసుకొనడానికి సంసిద్ధతను తెలియజేసే . ఆచారాన్ని తెలియజేస్తుంది. (
రూతు 3:9).
దేవుడు ఇశ్రాయేలును పెండ్లి చేసుకోవడమనే భావన (నీవు నా దానవైతివి) పది ఆజ్ఞల్లోని మొదటి ఆజ్ఞ నుండి వచ్చింది.
ఇశ్రాయేలు కేవలం దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలని ఈ ఆజ్ఞ తెలియజేస్తుంది.
ఇశ్రాయేలు తన దేవుని పట్ల విశ్వాస్యత కలిగి ఉండడాన్ని భార్య తన భర్తపట్ల పాతివ్రత్య ధర్మాన్ని పాటించడంతో పోల్చడం యుక్తంగా ఉంది. హెబ్రీలోని తోరా
యెహోవాను "కన్నా" ("అభినివేశంగల", "రోషముగల") అని వర్ణిస్తుంది. అంటే ఎవరైతే తన విషయంలో అపనమ్మకంగా ఉంటారో లేక దేవుని ద్వేషిస్తారో వారిపట్ల ఆయన రోషం గలిగి ఉంటాడు. (నిర్గమ 20:5; -34:14), -
ఇశ్రాయేలీయులు కనానీయుల మతాన్ని అవలంబించడాన్ని (
యిర్మీయా 2:21;
హోషేయ 1:2; 2.5-13; 3:1), అన్యదేశాలతో రాజకీయ పొత్తులు పెట్టుకోడాన్ని సూచించడానికి (
యిర్మీయా 2:33,36;
హోషేయ 8:9) అక్రమ లైంగిక సంబంధం పెట్టుకోవడం లేక పెళ్ళి ప్రమాణాన్ని అతిక్రమించడం అనే వాటిని సాదృశ్యంగా భావించే
ఇశ్రాయేలు ప్రవక్తల సాంప్రదాయాన్ని
యెహెజ్కేలు కూడా అందిపుచ్చుకున్నాడు.
16:9 నీ మీదనున్న రక్తమంతయు తుడిచి అనే పదజాలం ద్వితీ 22:13-21 వచనాల్లోని కన్యాత్వ లక్షణాలకు సంబంధించిన రక్తస్రావం లేదా శరీర పరిణతిని తెలియజేసే నెలసరి రక్తస్రావాన్ని సూచిస్తుండవచ్చు.
16:10
యెరూషలేముకు ధరింపజేసిన అలంకరణలు ఇతరచోట్ల ప్రత్యక్ష గుడారానికున్న అలంకరణ వస్తువు ల్లాగా ఉన్నాయి (విచిత్రమైన కుట్టుపని చేసిన వస్త్రము). సూచనప్రాయంగా కనబడే ఈ వర్ణన
యెరూషలేము పట్టణం దేవాలయం ఉన్న స్థలమని తెలియజేస్తుంది. (కీర్తన 48:2; 50:2; విలాప 2:15).
16:15-16 వేశ్యవై అనే నిం
దారోపణ - ఆధ్యాత్మికంగా
యెహోవా నుండి దూరం కావడాన్ని, కనానీయుల మతాచారాల్లో సంతానవృద్ధికి, పాడిపంటలకు సంబంధించిన అన్యదేవతారాధనల్లో భౌతికంగా పాల్గొనడాన్నీ సూచిస్తుంది (
యిర్మీయా 3:1-5;
హోషేయ 4:13-14; 9:1; ఆది 38:1416తో పోల్చి చూడండి).
సొలొమోను పలు అన్యదేవతా విగ్రహాల్ని నిలబెట్టి విగ్రహ పూజల్ని పరిచయం చేయడంతో నగరం విగ్ర
హారాధనలో పాల్గొని మతపరమైన పవిత్రతను కోల్పోవడం ప్రారంభమైంది (1రాజులు 11:1-10).
యెరూషలేము విగ్ర
హారాధన పాపానికి పాల్పడుతూ వేశ్య అయ్యింది (
యాకోబు 4:4).. గర్వమే :
యెరూషలేమును పెడత్రోవ పట్టించింది - (ద్వితీ 32:15;
యిర్మీయా 7:4;
మీకా 3:11)...
16:17 ఆభరణములను కరిగించి అసత్యదైవాల ప్రతిమల్ని చేయడం
సీనాయి పర్వతం దగ్గర బంగారు దూడ వృత్తాంతాన్ని గుర్తుచేస్తుంది. (నిర్గమ 32:2-4,24).
16:18-19 విగ్రహాల్ని ఈ విచిత్రవస్త్రాలతో అలంకరించడం గురించి
యిర్మీయా 10:9 వచనం తెలియజేస్తుంది.
16:20-21. రాజైన
ఆహాజు కాలంలో (2రాజులు 16:3), మనషే కాలంలో (2రాజులు 21:6) శిశుబలి నివ్వడం (నీవు... కుమారులను కు
మార్తెలను వధించితివి) జరిగింది,
యిర్మీయా కాలంలో ఇంకా ఎక్కువగా ఇది కొనసాగింది (
యిర్మీయా 7:31; 19:5; 32:35). శిశుబలి గురించి
యెహెజ్కేలు గ్రంథం కూడా ప్రస్తావించింది (20:26; 28:37).
యెరూషలేము తన పిల్లలను బలిగా అర్పించడం ద్వారా
కనాను యొక్క అనైతికతలో తనకు కూడా వారసత్వం ఉన్నదని నిరూపించుకున్నది.
మోషే ధర్మశాస్త్రం దీన్ని నిషేదించింది (లేవీ 18:21; 20:2; ద్వితీ 12:31; 18:10).
16:22 ఇదే భావన, ఇదే సాదృశ్యం (నీ బాల్యకాలమందు... మనస్సునకు తెచ్చుకొనక)
హోషేయ 2:4-14 వచనాల్లో కనబడతాయి. ఆ
16:23-25 మతాచారాల్లో భాగంగా వ్యభిచారం జరిగే ఉన్నత స్థలాలు అనేకం నిర్మించబడ్డాయి.
16:26 ఆధ్యాత్మిక వ్యభిచారమంటే అక్రమ విగ్ర
హారాధన. విగ్ర
హారాధనే కాక, దేశ భద్రత కోసం రాజకీయ, సైనికపొత్తులు పెట్టుకొనడం కూడా అక్రమచర్యలే (ఐగుప్తీయులతో వ్యభిచరించి;
యెషయా 23:17-18 కూడా చూడండి). ఈ పొత్తుల పట్ల
దేవుడు ఎటువంటి అసహ్యాన్ని చూపిస్తున్నాడో తెలియజేయడానికి
యెహెజ్కేలు, నీ జారత్వక్రియలను. పెంపుచేసి అనే పదజాలాన్ని ఉపయోగించాడు.
యెహెజ్కేలు వీరిని మదించి యున్న నీ పొరుగువారైన అనే మాటలతో వర్ణిస్తున్నాడు.
16:30-34 వేశ్య సాధారణంగా బ్రతుకు తెరువు కోసం వేశ్యాక్రియలు చేస్తుంది, అయితే
యెరూషలేము ఎంతగా పాపంలోకి దిగజారిందంటే జీతము పుచ్చుకొనవొల్లకనే వ్యభిచరించింది (1కొరింథీ 7:22-23).
16:35-38 వేశ్యను బహిరంగంగా శిక్షించడంలో భాగంగా ఆమె మానము కనబడునట్లు చేయడం గురించి
యిర్మీయా 13:22,26;
హోషేయ 2:10; నహూము 3:5 వచనాలు తెలియజేస్తున్నాయి. ధర్మశాస్త్రం ప్రకారం, ఈ దిగజారుడు చర్యకు శిక్ష రాళ్ళతో కొట్టి చంపడం, లేదా అగ్నిలో కాల్చివేయడం (వ.40; ద్వితీ 22:22).
16:39-40 భార్య తన భర్తకు విడాకులిచ్చినట్లయితే ఆమె వస్త్రహీనురాలుగా బయటికి వెళ్ళిపోవాలని నూజి లో (క్రీ.పూ. పది
హేనవ శతాబ్దంనాటి ఉత్తర ఇరాక్) కనుగొన్న వివాహ ఒప్పంద పత్రాలు తెలియజేస్తున్నాయి.
16:41-43 ఈ విధమైన శిక్ష (నీ యిండ్లను అగ్నిచేత కాల్చుదురు) పాత నిబంధన కాలంలో అసాధారణమేమీ కాదు. (న్యాయాధి 12:1; 15:6). నీ ప్రవర్తనను బట్టి నేను నీకు శిక్ష విధింతును అనే భావప్రకటన 11:21; 17:19; 22:31 వచనాల్లో కూడా కనబడుతుంది.
16:44-45
యెరూషలేము తల్లి హితీయురాలు, తండ్రి
అమోరీయుడు. హితీయుల, అమోరీయుల పాపాలు
దేవుడు సహించలేనంత స్థాయిలో ఉన్నందున (ఆది 15:16), ఆయన వారిని
కనాను నుండి నిర్మూలించాడు. దేశంలో ఇప్పుడు మిగిలి ఉన్న ఇశ్రాయేలీయుల్లో ఎవరిలోనైనా హితీయుల పాపాలు, అమోరీయుల పాపాలు ఉన్నట్లయితే
దేవుడు వారిని కూడా నిర్మూలించడం న్యాయమే కదా.
16:46-47 ఇశ్రాయేలీయుల పాపాలు భ్రష్టత్వానికి మారు
పేరైన
సొదొమ పాపాలను మించిపోయాయి (ద్వితీ 32:32;
యెషయా 1:10;
యిర్మీయా 23:14).
సొదొమలో జరిగిన వికృతమైన పాపపు చర్యల్ని బట్టి
సొదొమ అనే
పేరు స్వలింగ సంపర్కానికి మారు
పేరు అయ్యింది (ఆది 19:5-29). లేవీ 18:22; 20:13 వచనాల ప్రకారం ఇవి
హేయక్రియలు. దుష్టత్వం గురించి నైతిక పతనం గురించి చెప్పవలసి వచ్చినప్పుడు వీటికి పరాకాష్ఠయైన
సొదొమ పట్టణంతోను
సొదొమ ప్రజలతోను పోల్చడం బైబిల్లో పలుచోట్ల కనబడుతుంది (ద్వితీ 29:23; 32:32;
యెషయా 1:9-10; 3:9; విలాప 4:6;
మత్తయి 10:15-16; 11:23-24;
యూదా వ.7).
16:53-58
దేవుడు వారిని పునరుద్ధరిస్తానని తిరిగి రప్పిస్తానని
సొదొమ విషయంలోను
షోమ్రోను విషయంలోను అక్షరార్థంగా చెప్పడం లేదు. అయితే “
దేవుడు ఒక రోజున అనేక మంది ప్రజల పాపాల్ని క్షమించి, అనేక ఇతర పట్టణాల్ని కూడా దీవించనున్నాడు కాబట్టి చివరికి నీతి నివసించే, ఆయనకు వ్యతిరేకమైన తిరుగుబాటు ఇక కనిపించని స్థితిని ఆయన స్థాపించనున్నాడు" (డగ్లస్ స్టూవర్ట్).
16:57 నీవు గర్వించియున్నప్పుడు అనే పదజాలం
దావీదు కాలంలోను,
సొలొమోను ప్రారంభకాలంలోను దేశం స్వర్ణయుగంగా ఉన్న కాలాన్ని సూచిస్తుంది.
16:59
యెరూషలేము తన ప్రమాణాన్ని, తృణీకరించినందుకు, నిబంధనను భంగము చేసినందుకు జవాబుగా
దేవుడు తన నిబంధనాపూర్వకమైన విధుల్ని నిలిపివేస్తున్నాడు. విధేయతతో ఉంటానని
యూదా సీనాయి పర్వతం దగ్గర
యెహోవాకు చేసిన ప్రమాణాన్ని తృణీకరించింది. (నిర్గమ 19:6), యూడా పాపం ఇప్పుడు మితిమీరి పోయింది.
దేవుడు పాపాన్నిక సహించలేనంత స్థాయికి ఇప్పటి తరం చేరింది. ఒక రకంగా
దేవుడు ఇప్పటి తరంతో తన సంబంధాన్ని తెంచివేసుకొన్నాడనే చెప్పవచ్చు. అయితే ఆయన తన నిబంధనలోని వాగ్దానాలకు మటుకు భంగం కలగనివ్వలేదు.
16:60-61
యెహోవా తన నిబంధనను జ్ఞాపకం చేసుకోవడం ఆయన వారి పితరులకు చేసిన నిబంధనలకు సంబంధించినది. (ఆది 9:15-16; నిర్గ 2:24; 6:5; లేవీ 26:42,45; కీర్తన 105:8).
దేవుడు తన నిబంధనను - జ్ఞాపకం చేసుకొనడం,
యెరూషలేము తాను దేవునితో చేసిన నిబంధనను మర్చిపోవడానికి వైరుధ్యంగా కనబడుతుంది. (యెహె.16:22,43). మళ్ళీ లో కొత్తగా సంబంధమేర్పడినప్పుడు, ప్రజలు వారు నడుస్తున్న మార్గాలెటువంటివో... జ్ఞాపకంచేసుకొని సిగ్గుపడతారు. నిత్య నిబంధన అనే పదజాలం
యెషయా, 59:21; 61:8;
యిర్మీయా 31:31-34 వచనాల్లోని కొత్త నిబంధనను సూచిస్తుంది, ఇది
దేవుడు అబ్రాహాముతో చేసిన నిబంధనకు చాలా దగ్గరగా ఉంది. కొత్త నిబంధనలోని అంశాలు వాస్తవానికి
దేవుడు అబ్రాహాముతో, చేసిన వాగ్దానాల నెరవేర్పు (
యెషయా 55:3;
యిర్మీయా 32:40).
16:62
ఇశ్రాయేలు పునరుద్దరణను ప్రకటించే ప్రవచనాత్మక వాక్యభా
గాలు (నేను నీతో నా నిబంధనను స్థిర పరచెదను) ద్వితీ 30:3 వచనంలోని సందేశాన్ని ప్రతిబింబిస్తాయి.
దేవుడు ఇలాగే సంఘాల్ని సరిదిద్ది పునరుద్ధరిస్తాడని ప్రకటన గ్రంథంలో సంఘాలకు రాసిన లేఖలు తెలియజేస్తు న్నాయి (ప్రక 2:14,20).