ఐర్లాండ్ కు చెందిన ప్రముఖ రచయిత్రి రీటా ఫ్రాన్సిస్ స్నోడేన్, తాను వ్రాసిన ఒక పుస్తకంలో ఒక అందమైన కథను చిత్రీకరించింది. ఒకానొక రోజు తాను ఇంగ్లాండు దేశమునకు ప్రయాణం చేసినప్పుడు, ఒక హోటల్ లో కూర్చొని కాఫీ అస్వాధిస్తుండగా, చక్కటి సువాసన వస్తుండడం గమనించింది. అది ఎక్కడనుండి వస్తుంది అని వెయిటర్ ను అడిగినప్పుడు, అటు ప్రక్కనే కూర్చున్న కొందరి మనుషుల దగ్గర నుండి వస్తుందని అతడు చెప్పాడు. వాస్తవంగా వారు దగ్గరలో ఉన్న సుగంధాన్ని తయారు చేసే ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు కాబట్టి, వారి బట్టలకు పట్టిన పరిమళ వాసన వారు నడిచి వెళ్తున్న ఆ ప్రదేశమంతా వ్యాపించడం గమనించింది.
క్రైస్తవ జీవితానికి సంబంధించిన సాదృశ్యంగా ఈ సంఘటన అపో.
పౌలు చెప్పినట్టుగా మనం ప్రతీచోటా దేవుని పరిమళాన్ని వెదజల్లే
క్రీస్తు సువాసనయై యున్నాము (2 కొరింథీ 2:15). మనం
క్రీస్తు సువాసనను రెండు విధములుగా వెదజల్లుతాము. మొదటిగా సుందరుడైన
క్రీస్తు సువార్తను మాటల ద్వారా వెదజల్లుతాము. రెండవడిగా
క్రీస్తువలే త్యాగపూరితమైన క్రియలు జరిగించే మన జీవితాల ద్వారా పరిమళాలను వెదజల్లుతాము (ఎఫెసీ 5:1-2).
దైవికమైన సువాసనను అందరు అభినందించకపోయినా,
క్రీస్తు పరిమళం వారి జీవితాలను తప్పకుండా ప్రోత్సాహపరుస్తుంది . ఆనాడు రచయిత్రి ఆ సువాసనను ఆస్వాదించి దాని మూలాన్ని కనుగొన్నట్టు,
క్రీస్తు సువాసన మన మాటల ద్వారా, క్రియలద్వారా అనేకులకు
క్రీస్తును పరిచయం చేయగలుగుతాము. ఆమెన్