చైనా దేశానికి చెందిన కొందరు రైతులు ఒక బావిని త్రవ్వుచున్నప్పుడు ఆశ్చర్యమైన కొన్ని శిల్పాలను కనుగొన్నారు. కొందరు పరిశోధకులు ఈ శిల్పాలు ఏమై ఉండవచ్చు అని పరిశోధన చేసినప్పుడు అవి ౩వ శతాబ్ద కాలానికి చెందిన మానవ పరిమాణంలో ఉన్న “టెర్రాకొట్టా” శిల్పాలుగా గమనించారు. మధ్య చైనా ప్రాంతంలో, ఎండిన భూమిలోని మిగతా ప్రదేశాన్ని వారు త్రవ్వినప్పుడు అసమానమైన రీతిలో 8000 సైనికులు, 520 గుఱ్ఱాలచే తోలబడే 130 రధములు,150 అశ్వదళం వంటి శిల్పాలను వెలికి తీసారు. ఆశ్చర్యంగా ఉంది కదా. నేటికి ఈ ప్రదేశం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెంది కొన్ని లక్షల మంది సందర్శకులను ఆకర్షించే ఖ్యాతి గడించిన పర్యాటక ప్రదేశంగా
రూపుదిద్దుకుంది. ఈ అద్భుతమైన నిధి కొన్ని శతాబ్దాలుగా భూమిలో మరుగైయుండి ఇప్పుడు ప్రపంచానికి వెల్లడిచేయబడుతోంది.
ఈ లోకంలో మనం పంచుకోవలసిన ఒక ప్రత్యేకమైన నిధి,
క్రీస్తును వెంబడించేవారిలో దాచబడియున్నదని అపోస్తలుడైన
పౌలు కొరింథీ సంఘానికి వ్రాస్తూ (2 కొరింథీ 4:7) “అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదైయుండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదని” వివరించారు.
క్రీస్తు ప్రేమను గూర్చిన సందేశము మనలో దాగి యున్న నిధి. ఆయన ప్రేమ
మరియు కృప ద్వారా మనచుట్టూ ఉండే ప్రతి ఒక్కరిని దేవుని కుటుంబమైన కుటుంబాల కుటుంబములోనికి, అనగా దేవుని సంఘములోనికి చేర్చబడులాగున ఈ నిధి మనలో దాచబడియుంచక, దీనిని మనం ప్రకటించాలని గ్రహించాలి. పరిశుద్ధాత్మ శక్తితో
క్రీస్తును గూర్చిన సువార్తను విని రక్షించబడిన మనం, మన జీవిత సాక్ష్యాన్ని
మరియు ఆ కలువరి ప్రేమ సందేశ నిధిని దాచిపెట్టాక ప్రపంచానికి వేల్లడిచేద్దామా. ఈ రోజు కనీసం ఒకరితోనైనా ఈ సువార్తను పంచుకునే మనసు ప్రభువు మనందరికి దయజేయును గాక. ఆమెన్.