రోమా సామ్రాజ్యం వారి అహంకారయుక్తమైన అధికారంతో ఆ దుశ్పాలకులు
యేసును దోషిగా నిర్ధారించి, నేరస్తునిగా అత్యంత బాధాకరమైన శిక్షతోపాటు, సుదీర్ఘమైన మరణ శాసనాన్ని అమలు చేశారు. బైబిలులో
పేరు కూడా ప్రస్తావించని ఓ శాతాధిపతి,
యేసు క్రీస్తు సిలువకు ప్రత్యక్ష్య సాక్షి.
భూకంపం
మరియు సుదీర్ఘమైన ఆ సూర్యగ్రహణంలో, సర్వలోక పాప పరిహారంగా
యేసు క్రీస్తు త్యాగాన్ని కళ్ళారా వీక్షించి తన పాపానికి కూడా ఆ క్రీస్తే విమోచన అని తెలుసుకున్నాడు ఈ శాతాధిపతి. ఈరోజు మన పాపలకు కలిగిన విమోచన ఆనాడు ఆ శాతాధిపతి
క్రీస్తును స్వయంగా కలుసుకున్నప్పుడు కూడా అట్టి విమోచన పొందగలిగాడు. చీకటి నుండి వెలుగు దిశగా తన ప్రస్థానం మొదలైంది.
యేసు సిలువలో పలికిన యేడుమాటలు విన్నాడు. క్షమాపణకు నిజమైన అర్ధం ఏంటో గ్రహించగలిగాడు.
మత్తయి 27:54 శతాధిపతియు అతనితో కూడ
యేసునకు కావలి యున్నవారును, భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూచి, మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పు కొనిరి.
అవును,
యేసుప్రభువు మరణం పునరుత్థానం వైపు చూస్తూ, "నిజంగా ఈయనే దేవుని కుమారుడు - ఈయనే లోక రక్షకుడు" అని ప్రకటించగలిగిన వారందరికీ - జీవితం ఆశీర్వాదకరం అవుతుంది. ఆమెన్.