యేసే మా జీవజలం


  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi |
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 3
  • Reference: Sajeeva Vahini

యేసే మా జీవజలం

దుప్పి ఒక మనోహరమైన జంతువు, దాన్ని తరుముకొచ్చే శత్రువులనుండి తప్పించుకోడానికి కొన్నిసార్లు నీటి ప్రవాహంలోనికి పరుగెడుతుంది. తద్వారా అది తన సువాసనను కోల్పోయి తప్పించబడుతుంది. 

అడవిలో నీటి ప్రవాహాలు వాటి దాహాన్ని తీర్చడమే కాకుండా శత్రువునుండి కూడా రక్షణ దొరుకుతుంది, అంతేకాదు అవి గాయపడినప్పుడు కూడా ఆ నీటి ప్రవాహాలకే పరిగెత్తుతాయి.

కీర్తనల గ్రంథము 42:1 దుప్పి నీటివాగులకొరకు ఆశపడునట్లు దేవా, నీకొరకు నా ప్రాణము ఆశపడుచున్నది.

అవును, యేసే మన జీవ జాలం అని, నీతి కోసం మన దాహాన్ని తీర్చగల ఏకైక వ్యక్తి అని చెబుతుంది. ఈ ప్రపంచంలో విశ్వాసులపై ప్రయోగించబడే అపవాది అగ్ని బాణాలు చాలా ఉన్నాయి, కానీ మనం దేవుని దగ్గరకు పరిగెత్తినప్పుడు, మనమందరం తప్పించబడి రక్షించబడ్డతాము.

ఆయనే మన ఆశ్రయ దుర్గము, నీతిమంతులు దాని దగ్గరకు పరుగెత్తినప్పుడు వారు రక్షించబడతారు. ఈరోజు, శత్రువు మిమ్మల్ని బాధపెట్టడానికి ఏదైతే ఉపయోగిస్తున్నాడో, వాటినుండి తప్పించే జీవ జలధారాలు మనము మన యేసయ్య నుండే పొందుకోగాలం. 

ప్రతి బాధకి .... ఆనందకరమైన శాంతి
ప్రతి అనారోగ్యానికి......ఆత్మీయ ఆరోగ్యం
ప్రతి కొరతకు........ సర్వసమృద్ది
ప్రతి హింసకు...... శాశ్వతమైన ప్రతిఫలం

వీటన్నిటికి పొందుకునేలా ప్రయత్నం చేద్దాం. అట్టి కృప ప్రభువు మీకు దయజేయును గాక. ఆమెన్.

Telugu Audio: https://www.youtube.com/watch?v=1tLzZGT4XbQ