పరిశుద్ధాత్మ నడిపింపు


  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi |
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 3
  • Reference: Sajeeva Vahini

పరిశుద్ధాత్మ నడిపింపు

గలతియులకు 5:16నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచు కొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. 

అనుదినం మన జీవితాలు పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలని గుర్తుంచుకోవాలి. మనల్ని నడిపించడానికి మనం దేవుని ఆత్మపై ఆధారపడినప్పుడు, దేవుని చిత్తానికి విరుద్ధమైన పనులు చేయడానికి మనం అనేకసార్లు శోధించబడము. పరిశుద్ధాత్మపై ఆధారపడితే, దేవునికి మహిమ కలిగించే విషయాలు ఆయనను గౌరవించే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం ఆత్మ ద్వారా నడిచినప్పుడు మనం ఒంటరిగా లేమని గుర్తుంచుకోవాలి. 

ప్రతి అడుగులో దేవుని ఆత్మ మనతో ఉంటుంది. ఆయన మనల్ని సరైన మార్గంలో నడిపిస్తాడు మరియు నీతిమార్గంలో నడిచేందుకు సహాయం చేస్తాడు. ప్రపంచం మనకు వ్యతిరేకంగా ఉన్నట్లు అనిపించినప్పుడు కూడా, విశ్వాసంలో స్థిరంగా నిలబడే శక్తిని ధైర్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. 

ఈరోజు, మనము ఆయన మార్గాలలో నడుచుకుంటూ, మనలను నడిపించడానికి మరియు మనలను రక్షించడానికి సంపూర్ణ విశ్వాసము కలిగియుందాము. ఆయన నామానికి తగినట్లుగా జీవించడానికి మనం కృషి చేస్తున్నప్పుడు ఆయన మనకు బలమును శాంతిని అనుగ్రహిస్తాడు. కాబట్టి, ఆయన మాటకు విధేయులమై ఆత్మానుసారంగా నడుచుకుందాం. మనం చేసే ప్రతి పనిలో ఆయనను గౌరవించేవారముగా జీవించులాగున దేవుడు మనలను ఆశీర్వదించును గాక. ఆమెన్.

Telugu Audio: https://youtu.be/AwsobVIdhX0