మన సమృద్ధి – మన బలం
లూకా 12:29 ఏమి తిందుమో, యేమి త్రాగుదుమో, అని విచారింపకుడి, అనుమానము కలిగియుండకుడి.
సర్వసమృద్ధిని
దేవుడు మనకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేవుని వాగ్దానం మన ఎడల ఉంది కాబట్టి ఈరోజు మన వ్యక్తిగత సంబంధమైన విషయాల గురించి ఎన్నడుకూడా చింతించకూడదు. మన జీవితమును గూర్చిన విషయాల గురించి చాలా శ్రద్ధ కలిగి ఉండటం మంచిదే. అయినప్పటికీ, మనం ఎల్లప్పుడూ ఏమి తినాలి ఏమి త్రాగాలి అని ఆలోచిస్తూ, నిత్యం సందేహాలతో భయాలతో కలవరపడటం అది మనకు ఆరోగ్యకరమైనది కాదు అని గ్రహించాలి.
మనము ఈలోక సంబంధమైన జీవితాన్ని గూర్చి శ్రద్ధ వహించినట్టే , మన ఆత్మల సంరక్షణ
మరియు వాటి రక్షణకు అవసరమైన విషయాల గురించి చాలా శ్రద్ధ కలిగియుండాలి. ప్రాపంచిక వ్యవ
హారాల గురించి బహు జాగ్రత్త పడే ఉత్సుకతతో కూడిన ఆలోచనలు మన జీవితంలో గంధరగోళాన్ని సృష్టిస్తాయి.
ఈ లోకానికి వచ్చిన
యేసు క్రీస్తు మనకు అనుగ్రహించే జీవితం సంకుచితమైనది కాదు, అందులో ఎల్లప్పుడూ సమృద్ధి దాగియుంటుంది. ప్రతి మధురమైన వాగ్దానాలలో సమృద్ధితో, మన ఆలోచనలకు మించిన శాంతితో నిండి, ఎల్లప్పుడూ తన రక్షణ వలయంలో, విలువైన పరిశుద్ధాత్మ యొక్క శక్తితో బలపరచబడి, పరిపూర్ణ ఆనందంతో నింపబడి ఉంటుంది.
మనకు
ఏది అవసరమో మనల్ని సృష్టించిన ఆయనకు తెలియదా? దేవుడే మన సమృద్ధి మన బలమని ఆయనను విశ్వసించి, మన జీవితాలను ఆయనకు అప్పగించినప్పుడు, ఆయన మనల్ని ఎన్నటికీ నిరాశపరచడు.
దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. ఆమెన్.