మన ఆత్మల కోట
2
యోహాను 1:8 మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి..
మనం ఎల్లప్పుడూ మనల్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. అంతకంటే ప్
రాముఖ్యం మన హృదయాలను బాధ్రపరచుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం ఎటువంటి ప్రమాదకరమైన విషయాలకు తావులేకుండా గమనించుకుంటూ ఉండాలి. లోకంలో
ఏదైనా అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు, మొదటగా వెలుపటి విషయాలకంటే మన ఆత్మల కోటవైపు దృష్టిని సారించాలి.
శత్రువు భూమిని ఆక్రమించినప్పుడు, మొదటి విషయం ఏమిటంటే, మన స్వంత బలం లేదా మన స్వంత కోటల భద్రతతో సంబంధం లేకుండా అతనికి వ్యతిరేకంగా వెళ్లడం కాదు, కానీ మన కోటలు చక్కగా ఉండేలా చూసుకోవాలి లేదా మనం వాడి దాడుల నుండి సంరక్షించుకోవాలి. అలా అయితే, మనము శత్రువును బహిరంగ మైదానంలో పోరాడడానికి విశ్వాసంతో ముందుకు వెళ్ళవచ్చు. లోకంలో జరిగే విపత్తు పరిణామాలపై ద్రుష్టి నిలపడం కంటే, ఒక
క్రైస్తవుడు చేయవలసిన మొదటి పని తన స్వంత హృదయాన్ని జాగ్రత్తగా చూసుకోవడం.
దేవుణ్ణి ద్వేషించే వారు,
క్రీస్తును తిరస్కరించే వారు, పాపభరితమైన ప్రపంచంపై దేవుని అనివార్యమైన తీర్పు వైపు ప్రపంచం ఉరుములు మెరుస్తున్నప్పుడు, ఒక వక్రీకృత సువార్తను ప్రకటించడం, వివేచన లేని ప్రజలను మోసగించే తప్పుడు బోధకుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ వాక్యం ప్రకారం మనం లేఖనాధారమైన సత్యాన్ని గట్టిగా పట్టుకోవాలని మనకు
యోహాను వివరించాడు -
యేసు దేవుని కుమారుడని, ఆయన మొదటి రాకడలో నిజమైన మనిషిగా భూమిపైకి వచ్చాడని - అతను లోక పాపం కోసం బలి అర్పణగా వచ్చాడని - అతను పాపం తెలియని మనిషిగా అవతరించాడని, తద్వారా అతను తన రక్తాన్ని చిందించి, లోకం యొక్క పాపవిముక్తికి వెల చెల్లించడానికి లేదా పడిపోయిన వారిని తిరిగి దేవునితో సమాధానపరచడానికే నని గ్రహించాలి.
ఈరోజు మనం సత్య సువార్తను గ్రహించి, మన గొప్ప రక్షణలో దేవునిని కీర్తించేందుకు సిద్ధంగా ఉందాం; కోల్పోయిన వారితో ఈ సువార్తను పంచుకోవడానికి; రోజువారీ జీవితంలో దానిని అధ్యయనం చేయడానికి; మనల్ని మనం దేవునికి ఆమోదించినట్లు చూపించడానికి; కృపలో
క్రీస్తును గూర్చిన జ్ఞానంలో ఎదగడానికి; ఆయనపై మనకున్న నిరీక్షణకు సమాధానమివ్వడానికి సిద్ధంగా ఉండేలా,
యేసు ఏ రోజు తిరిగి వచ్చినా మనల్ని తనతో పాటుగా తీసుకువెళ్లాలని సిద్ధంగా ఉండేలా, దేవుని కీర్తి కోసం మనం సంసిద్ధులై యుందాము. ఆమెన్.