కరుణామయుడు
మనం జీవించే ఈ ప్రపంచంలో, ప్రజలు తమ మార్గం నుండి బయటపడటం లేదా రెండవ అవకాశం ఇవ్వడం చాలా అరుదుగా చూస్తాము.
మీకా 7:19లో ఆయన మరల మనయందు జాలిపడును, మన దోషములను అణచివేయును, వారి పాపములన్నిటిని సముద్రపు అగాధములలో నీవు పడవేతువు.
అంటే,
ఇశ్రాయేలీయులు తమ దోశాలన్నిటిని సముద్రపు
లోతుల్లోకి పార వేయడానికి కనికరం చూపమని దేవుణ్ణి వేడుకుంటున్నారు. సముద్రం
లోతుల్లో పారవేసినదేదైనా అది శాశ్వతంగా కనుమరుగైపోతుంది.
మనం పశ్చాత్తాపపడి, వాటి వద్దకు తిరిగి రావడానికి నిరాకరించినప్పుడు
దేవుడు మన పాపాలతో ఇలా వ్యవహరిస్తాడు. ఈరోజు మీరు పాపపు ఊబిలో ఉన్నట్లైతే, మిమ్మల్ని రక్షించడానికి దేవుని హస్తం కురచకాలేదు.
దేవునిపై ఆధారపడండి ఆయన వద్దకు పరుగెత్తండి, ఆయనే కలువరి సిలువలో మనకు నీతి అనే వస్త్రాన్ని ధరింపజేశాడు. మీ విధిని మార్చగలిగిన దేవునికి అసాధ్యమైనది
ఏదీ లేదు, ఆయనకు కావాల్సిందల్లా మీ హృదయాలో నివసించాలనే మీ ఆహ్వాహం. ఆ విశ్వాసపు అడుగు ఈరోజే వేయడానికి ప్రయత్నం చేయండి.
దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. ఆమెన్