ఆతిథ్యం
మత్తయి 25:35నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి; దప్పి గొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై యుంటిని నన్ను చేర్చుకొంటిరి;
మనచుట్టూ ఉన్నవారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మనం వారికి సేవ చేయడానికే
దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మనకు వారు తెలియకపోయినప్పటికీ వారికి అవసరమైన ప్రేమ
మరియు ఆతిథ్యం చూపించడానికి మనము దేవునిలో పిలువబడ్డాము. మనం ఇతరులకు ఆతిథ్యం ఇచ్చినప్పుడు, మనం వారికి
క్రీస్తు ప్రేమను చూపిస్తున్నామని గ్రహించాలి. నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి సహాయం చేయాలంటే గొప్ప మనసుతో పాటు మానవత్వము స్వభావాలు కావాలి. దేవునికి కావలసింది ఇలాంటి వారే.
మనం ఎల్లప్పుడూ సేవా హృదయాన్ని కలిగి ఉండాలి. ఇతరులకు సహాయం చేయడానికి మన స్వంత అవసరాలను పక్కన పెట్టడానికి కూడా సిద్ధంగా ఉండాలి. అవసరంలో ఉన్నవారికి కరుణ
మరియు దయ చూపించడానికే క్రైస్తవులైన మనలను
దేవుడు ఏర్పరచుకున్నాడు. నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి ఆతిథ్యం ఇవ్వడానికి, వారిని మన స్వంత కుటుంబంలా భావించే మనసు కలిగియుండాలి.
నేటినుండి, మనం
క్రీస్తును ఆదర్శంగా తీసుకుని శ్రమల్లో ఉన్నవారికి సేవ చేసేందుకు కృషి చేద్దాం. నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి ఆతిథ్యం చూపుదాం
మరియు అవసరంలో ఉన్నవారిని ప్రేమిద్దాం. నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి సేవ చేసినప్పుడు, మనం
క్రీస్తును సేవిస్తున్నామని గుర్తుంచుకోండి. అట్టి మనసు ప్రభువు మనందరికీ దయజేయును గాక. ఆమెన్.