నీవు సిద్ధపడుతున్నావా?
నేను కాలేజి చదువుకుంటున్న రోజుల్లో మూడు సంవత్సరాలు ఆ కాలేజీ కి సంబంధించిన కంపూటర్ విభాగంలో టెక్నాలజీకి సంబంధించిన చిన్న చిన్న పనులు చేసేవాడిని. చేసే ఆ పనికి భవిష్యత్తులో ఎటువంటి అవసరం ఉంటుందో తెలియకుండానే ప్రతీ రోజు ఎదో ఒక క్రొత్త అన్వేషణలో నిమజ్ఞమయ్యేవాడిని. ఆ మూడు సంవత్సారాల తరువాత కాలేజి చదువులు ముగిసినప్పుడు ఉద్యోగం కోసం దరఖాస్తు చేయడం ప్రారంభించాను. వార్తా పత్రికల్లో చూసి ఒక కంపెనీ వారికి దరఖాస్తు చేస్తే, వారు ఇంటర్వ్యూ కి పిలిచి, నేను చదువుకున్న అర్హతలనుబట్టి కాక, నాకున్న నైపుణ్యతను బట్టి ఉద్యోగంలో చేరగలిగాను. బహుశా మీలో అనేకులకు ఇటువంటి అనుభవాలు ఉండవచ్చు.
ప్రతికూల పరిస్థితిలో నా అనుభవము మరింత పనికి నన్ను సిద్ధపరచింది. ప్రతికూలమైనది అని మనం పిలువగలిగే అనుభవాలలో యౌవనస్తుడైన
దావీదు పట్టుదల కలిగి ఉన్నాడు. గోల్యాతుతో యుద్దము చేయాలన్న సవాలు
ఇశ్రాయేలీయులు ఎదుర్కొంటున్నప్పుడు, ఆ కర్తవ్యానికి ముందడుగు వేయడానికి చాలిన ధైర్యముగలవాళ్ళు ఎవరును లేకపోయిరి.
దావీదు తప్ప ఎవరు లేరు. యుద్ధానికి పంపించడానికి
సౌలు విముఖముగా ఉన్నప్పటికీ
దేవుడు దావీదును ఏర్పరచుకున్నాడు.
అయతే
దావీదు తాను కాపరిగా ఉంటూ గొఱ్ఱెల నిమిత్తము ఒక సింహమును, ఎలుగుబంటిని ఎలా చంపాడో వివరించాడు. “సింహముయొక్క బలమునుండియు, ఎలుగుబంటి యొక్క బలమునుండియు నన్ను రక్షించిన
యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలోనుండి కూడ నన్ను విడిపించునని” (1 సమూ 17:35) ఎంతో ధైర్యంగా
దావీదు చెప్పగలిగాడు. గొఱ్ఱెల కాపరిగా
దావీదుకు అంతగౌరవాన్ని సంపాదించిపెట్టలేదు గాని అది అతనిని
గొల్యాతుపై యుద్ధానికి, చివరికి ఇశ్రాయేలీయుల అతి గొప్ప రాజు కావడానికి సంసిద్ధుణ్ణి చేసింది. భవిష్యత్తు కొరకు మనలను సిద్ధపరచడానికి
దేవుడు ప్రస్తుత పరిస్థితులను వాడుకుంటాడు. మనం కష్టాల్లో ఉన్నప్పటికీ, వాటిద్వారా
దేవుడు మరింత ఉన్నతమైనదానికి మనలను సిద్దపరుస్తూ ఉండవచ్చు. ఆమెన్.