దేవుని నుండి ఒక స్పర్శ
మన చుట్టూ ఉన్న సవాళ్లు ఎక్కువగా ఉన్నప్పుడు మనం చేయలేని పనులను మనం తరచుగా చూస్తాము
మరియు నిరుత్సాహపడతాము. ఈ అభద్రతాభావాలు మనం ఒక అడుగు ముందుకు వేయడానికి ఆటంకంగా ఉంటాయి.
యిర్మీయా తాను యాజకుడైనప్పటికీ తాను మాట్లాడలేనని దేవునికి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే బైబిల్ ప్రకారం
దేవుడు అతనిని తన వాక్యము చెప్పుటకు దేవుడే నియమించాడు
యిర్మీయా 1:9లో
యెహోవా తన చేయి చాచి నా నోటిని ముట్టుకొని నాతో ఇలా
అన్నాడు: “ఇప్పుడు, నేను నా మాటలను నీ నోటిలో ఉంచాను.
దేవుడు, తన వాక్యంతో మనలను సన్నద్ధం చేస్తాడు, తన వాక్యంలో ఉన్న శక్తి ద్వారా అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేయడానికేనని గ్రహించాలి. మన సామర్థ్యంతో సాధ్యం కానిది దేవుని స్పర్శతో సాధ్యమవుతుంది.
సార్వభౌమాధికారియైన
దేవుడు ఈ రోజు తన శక్తివంతమైన కుడి హస్తాన్ని చాచడానికి, మన ప్రతి ఒక్కరి జీవితంలో దైవిక ప్రణాళికలు
మరియు ఉద్దేశాలను నెరవేర్చడానికి జీవితాలను తాకడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని దయ ఈ మంటి ఘటములో విధేయత అనే ఐశ్వర్యాన్ని నింపుతూ, నిలకడ కలిగిన జీవితాన్ని దయజేస్తుంది.
దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. ఆమెన్.