కటిక చీకటి వంటి శ్రమ


  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 2
  • Reference: Sajeeva Vahini

కటిక చీకటి వంటి శ్రమ

సముద్రంపై రేగిన తుపాను తమను యేసునుండి వేరుచేసిందని శిష్యులు భయపడ్డారు. అంతేకాదు, యేసు తమ గురించి బొత్తిగా మర్చిపోయాడనుకున్నారు. ఇలాటి సమయాల్లోనే కష్టాల ముల్లు గుచ్చుకుంటుంది. "ప్రభువు మాతో ఉంటే ఇది మాకు ఎందుకు సంభవించింది?" మనం అనేక సార్లు ఇటువంటి ప్రశ్న వేసుకుంటాము. 
భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా ... (ఆది 15:12).

అబ్రహామునకు కలుగాబోయే శ్రమను గూర్చి దేవుడు ముందుగానే  దర్శనం ద్వారా తెలియజేస్తూ... కటిక చీకటి వంటి శ్రమ కలిగినప్పటికీ...భయపడకుము, నేను నీకు తోడుగా ఉంటాననే వాగ్దానాన్ని దయజేస్తూ నిరీక్షణను కలుగజేశాడు. 

నేనంటాను, శ్రమలు మరియు క్లిష్ట పరిస్థితులు దేవుడే అనుమతిస్తాడు. దేవుణ్ణి నీకు సమీపంగా తీసుకురావడానికే నీకు ఈ కీడు కలిగింది. యేసును నీ నుండి వేరుచెయ్యడానికి కాదు; నువ్వు ఆయనకు మరింత విశ్వాసంతో… మరింత ఆతృతగా హత్తుకోవాలనే!

మనల్ని వదిలేసాడన్నట్టు కనిపించిన హృదయాల్లోనే మనల్ని మనం ఆయన చేతుల్లో వదిలి నిశ్చింతగా ఉండాలి. ఆయన మనకి అనుగ్రహించాలనుకున్నప్పుడే మనం వెలుగునూ ఆదరణనూ అనుభవిద్దాము. ఆయన ఇచ్చే బహుమతుల మీద కాదు గాని ఆయన మీదే ఆశపెట్టుకుందాము. విశ్వాసపు రాత్రిలో ఆయన మనల్ని వదిలినప్పుడు ఉక్కిరిబిక్కిరి చేసే ఆ చీకటిలోనే సాగిపోడానికి ప్రయత్నం చేద్దాం. మనముందుంచబడిన ఆశీర్వాదాలకు అర్హులమవుదాం. ఆమెన్.

Telugu Audio: https://www.youtube.com/watch?v=XVoCtAB9iUA