ఇంకొంత సమయం
ఉదయమున లేచామంటే రాత్రి పడుకునే వరకు ఎదో ఒక పనిలో ఒత్తిడి, భారం, బిజీ జీవితం. జీతం సరిపోటల్లేదు, నెల మొదట్లో ఉన్న స్థితి కంటే నెల ఆఖరికి వచ్చేసరికి చాలీ చాలినంత డబ్బు, ఉద్యోగంలో కొంత ఒత్తిడి తగ్గితే బాగుండు, వ్యాపారంలో ఇంకొంచం లాభం, కనీసం మంచి ఉద్యోగం ఇలా అనుకుంటూ పొతే జీవితకాలం చెప్పుకున్నా ముగింపు లేదు కదా.
అనుదినం మన హృదయాలను పరిపాలించేది హృదయవాంఛలే. ఇవన్నీ తప్
పేమీ కాదు గానీ అవి ఉండాల్సిన స్థానంలో ఉంటే చాలు. అదేవిధంగా అవి మన జీవితాలను గుప్పిట్లో పెట్టుకుంటే మన ఆత్మీయ స్థితి శూన్యమే.
రోజులు వారాలు గడిచిపోతున్నాయి. రెప్ప మూసి తెరిచేలోగా క్యాలెండరులో డేటు మారిపోతుంది. గడచిన సమయం తిరిగి రాదని మనందరికీ తెలుసు. అయ్యో దేవునితో నేను ఎక్కువ సమయం గడపలేకపోయానే అని ఎప్పుడో సమస్య వచ్చినప్పుడు అనుకుంటే ఎలా? దేవునికి
ఇవ్వాల్సిన సమయం ఆయనకు
ఇవ్వాల్సిందే. కాస్త సమయం ఇస్తే లాభమే కాని నష్టము లేదు కదా.
వారమంతా ఎదో పనిలో పడి, ఆయన రాకడ సమీపిస్తుందని మరిచిపోక, అనుదినం ఎత్తబడుటకు సిద్దపాటు కలిగియుందాం; ప్రార్ధనలో, వాక్యంలో ఇంకొంత సమయం గడుపుతూ దేవునికి ప్రధమస్థానం ఇచ్చే ప్రయత్నం చేద్దాం. అట్టి తీర్మానమును ప్రభువు స్థిరపరచును గాక.
ఆమేన్.
యాకోబు 4: 8 దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును.