రహస్య ప్రార్థన
నీవు ప్రార్థన చేయునపుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్య మందున్న నీతండ్రికి ప్రార్థన చేయుము అప్పుడు రహస్య మందు -చూచు- నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును.
రహస్య ప్రార్థన లో
దేవుడు నీ ప్రార్థన వింటాడు అని వ్రాయబడలేదు. -చూస్తాడట-.
ఏమి చూస్తాడు? నీ హృదయాన్ని చూస్తాడు. మన ప్రతీ పాపము ప్రభు పాద సన్నిధిలో ఒప్పుకున్నామో లేక కప్పుకున్నామో?అని. కప్పుకుంటే మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. ఒప్పుకుంటే తప్
పేముంది? మన జీవితం అంతా ఆయనకు తెలుసు.
దావీదు అంటున్నాడు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియును నాకు తలంపుపుట్టకముందే నీవు నామనస్సు గ్రహించుచున్నావు నీ ఆత్మ యొద్దనుండి నేనెక్కడకు పొవుదును? నీ సన్నిధినుండి నేనెక్కడికి పారిపోవుదును.? కీర్తన 139:2,7.
వ్యక్తిగత జీవితంలో ప్రతీరోజు బిజీగా గజిబిజీగా ఉన్నప్పుడు మనలోని పాపములను అపవాది జ్ఞాపకము చేసి కృం
గదీస్తూ ప్రార్ధనకు దూరం చేస్తాడు. రహస్య ప్రార్ధన వలన దేవుని సహవాసంలో అనుభవం రెట్టింపై, విశ్వాసములో మరింత బలము పొందగలము.
అనుదినం దేవునితో వ్యక్తిగతంగా గడపగలిగే రహస్య ప్రార్థన మన జీవితం లో వుండాలి. ఎందుకంటే, మానవుని మహత్తర సాహసయాత్ర ప్రార్ధన.
దేవుడు పరిశుద్ధుల హస్తాల్లో ఉంచిన మహత్తర శక్తి ప్రార్ధన. ప్రార్థించక నష్టపోయేవారు అనేకులున్నారు గాని ప్రార్థించి నష్టపోయినవారు లేరు.
ప్రార్ధించు! ప్రతిఫలాన్ని అనుభవించు!