ప్రభువునందు ఆనందించుడి
పండగ ఆఫర్! మీ పాత వస్తువులను ఎక్స్చేంజి చేసుకునే సదావకాశం! అనే వార్త వినగానే అరల్లో ఉన్న అవసరం లేని వంట సామాన్లను మార్చేద్దాం పదండి అని నా భార్య మూటగట్టి రెడీ చేసింది. కొన్ని అవసరం లేనివి, మరి కొన్ని పాతబడిపోయినవి, మరికొన్ని మనం వాడలేక భారంగా అనిపించినవి ఇలా సేకరించడం జరిగింది. రోజు వాడుతున్నప్పటికీ ఒక్కో వస్తువును చేత పట్టుకొని ఇది మారిస్తే ఎలా ఉంటుంది అనే ప్రశ్న వేసుకొని అవును అనుకుంటే మార్చేసుకుందాం అని వద్దు లేదా కాదు అనుకుంటే కొనసాగించుకుందాం ఇలా మనమందరం అనుకుంటూనే ఉంటాము.
ఏదేమైనా రోజు వాడే వాటిని క్రోత్తవిగా మర్చేయాలంటే ఆ ఆనందమే వేరు.
క్రీస్తుతో - వారి సంబంధంలో ఆనందాన్ని అన్వేశించుకోమని
ఫిలిప్పీ సంఘంలోని క్రైస్తవులకు అపో.
పౌలు విజ్ఞప్తి చేశాడు “ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి,మరల చెప్పుదును ఆనందించుడి (
ఫిలిప్పీ 4:4). అంతేకాదు, ఆందోళనలో గందరగోళంగా జీవించడం కంటే, ప్రతీ విషయాన్ని గురించి ప్రార్ధించమని, అప్పుడు దేవుని నుండి సమాధానం
యేసు క్రీస్తు వలన వారి హృదయాలకు, తలంపులకు కావలియుంటుందని చెప్పాడు.
రోజువారి జీవితంలో మనం చేసే పనులను, బాధ్యతలను గమనిస్తే, వాటన్నిటిని కష్టపడుతూ ఉంటామేగాని ఆనందంగా చేయలేము. అయితే మనం చేసే పనులను, బాధ్యతలను మనం నిర్వర్తిస్తున్నప్పుడు అది దేవుని దృష్టిలో, మన హృదయంలో ఎలా ఆనందాన్ని కలిగిస్తుంది? అనే ప్రశ్న మనం వేసుకున్నప్పుడే, వాటి గురించి మనం ఏమనుకుంటున్నామో
అన్నదాంట్లో పరివర్తన కలుగజేస్తుంది.
మెట్టుకు సహోదరులారా, యే యోగ్యతయైనను మెప్పైనను ఉండినయెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్య మైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, వాటిమీద ధ్యాన ముంచుకొనుడి (
ఫిలిప్పీ 4:8). మనం దేవుని పై దృష్టి నిలిపినప్పుడే ఇట్టి ఆనందాన్ని పొందగలం అని గ్రహించాలి. ఆమెన్.