తండ్రి చేతిలో ఉంటే - విజయోత్సవమే
మట్టిపాత్రగా తయారవ్వలంటే ముందుగా తను ఉన్న స్థలమునుండి వేరుచేయబడుతుంది. ప్రత్యేకపరచబడి, నలగగొట్టబడి, నీళ్ళలో నాని ముద్దగా ఆయ్యేంతవరకు పిసగబడుతుంది లేదా తొక్కబడుతుంది. వీటన్నిటిల్లో దాగివున్న శ్రమ కొంచెమైనదేమీ కాదు. ముద్దగా చేయబడినంత మాత్రాన్న పాత్రగా మారిపోదు కానీ పాత్రగా మలచడానికి సంసిద్దమౌతుంది.
ఇక కుమ్మరి చేతిపనికి, ఆలోచనానేర్పుతో పాత్రగా మలచబడుతుంది. కుమ్మరి తన నైపుణ్యానంతా వుపయోగించి పాత్రలను ఎంతో ఓర్పుతోనూ, నేర్
పుతోను చేస్తాడు. పాత్రలో దాగివున్న తడిని పోగొట్టేందుకు ఆరబెట్టబడుతుంది. ఆరిన పాత్ర కాల్చబడుతుంది. కాల్చితీసిన తరువాత ఆ పాత్రకొచ్చిన సొగసును, పటుత్వాన్ని చూసి కుమ్మరి ఆనందిస్తాడు. ఇక ఆపాత్ర ఉపయోగకరంగా మారుతుంది.
కుమ్
మరియైన
దేవుడు మనల్ని తన పోలికలోనే సృష్టించి, తాను మనయెడల కలిగిన ఉద్దేశాలను నేరవేర్చుకోడవానికి జగత్తు పునాది వేయబడక ముందే సంకల్పించి మనలను తనకు ఉపయోగపడే పాత్రగా నిర్మించుకున్నాడు. మనం ఆయనకు ఉపయోగపడే పాత్రగా తయారుచేయబడ్డామని గ్రహించినప్పుడు, మన జీవితంలోని అనేక సందర్భాల్లో కలిగే శ్రమలు, ఒడుదుడుకులు మనల్ని కృం
గదీయవుగాని, వాటి వలన మన అంతరంగంలోని ఆత్మస్తైర్యం పటిష్టితమై, ఆత్మీయ
మరియు దైనందిన జీవితంలో ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొనగలిగే శక్తిని పొందగలుగుతాము. ఈ అనుభవాలగుండా ప్రయాణిస్తున్నప్పుడే తండ్రి మనలను గూర్చి సొంతోషించేవాడుగా ఉంటాడు. తనకు ఇష్టమైన పాత్రగా మలచబడుతున్న మనయెడల ఆయన చూపించే ఆనందమే మనం పొందే దీవెనాశీర్వాదానందాలు. ఇదే
క్రీస్తులో విజయోత్సవం. ఆమెన్.
యిర్మియా 18:6 మీరు నా చేతిలో ఉన్నారు.