నైతిక విలువలు కలిగిన జీవితము
ఎవరైనా తప్పు చెస్తే తగిన ఫలితం పొందుతారు అని నమ్ముతాము. యెట్టి మతమైన బోధించేది ఇదే. ఒకవేళ ఒకడు దొంగతనం చేస్తే అతడు కూడా
ఏదో ఒక రోజు దోచుకొనబడుతాడు అని, అన్యాయం చెస్తే ఆ అన్యాయము అతనికి కూడా
ఏదో ఓ రోజు వెంటాడుతుంది అని నమ్ముతాము. కాని కలువరి సిలువలో
క్రీస్తుపై వేసిన సర్వలోక పాపము మాత్రం తిరిగి రాలేకపోయింది. అట్టి
క్రీస్తు ప్రేమ “వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని” బదులు చెప్పిన ప్రేమయే. అట్టి ప్రేమను రుచి చూడకుండా ఉండగలమా?
అబ్ర
హాము ఇస్సాకును బలిగా అర్పించునప్పుడు, అతని విశ్వాసాన్ని ఆశీర్వదించి కుమారునికి మారుగా
దేవుడు గొఱ్ఱెపిల్లను ఇచ్చాడు. పాప పంకిలమైన మనము ప్రాయశ్చిత్తముగా మన కుమారులను కు
మార్తెలను అనుగ్రహించకుండా మనకు బదులుగా మన పరలోకపు తండ్రి తన కుమారుని మనకు అనుగ్రహించాడు. అతడు మరణమును తప్పించి నిత్యమూ తనతో ఉంటాము అనే కృప ద్వారా నిశ్చయత
మరియు ఉచితముగా రక్షణానుభవమును మనకు అనుగ్రహించాడు.
నమ్మకంగాను నైతికంగానూ జీవించేవారు దేవునికి కావలి. ఇట్టి నైతిక విలువలు కలిగి జీవితము ఎలా జీవించాలి?
ఓ ఎడారిలో ఓ వ్యక్తి ప్రయాణం చేస్తూ, అతని సీసాలో కలిగిన నీళ్ళు అయిపోయినపుడు, నీళ్ళు ఎక్కడైనా దొరుకునేమో అని వెతకడం ప్రారంభించాడు. కొద్ది సేపటికి ఓ నీటి పంపు కనబడింది. పరుగెత్తి ఆ నీటి పంపు చేతి పిడిని పైకి క్రిందకు ఆడించడం ప్రారంభించాడు. ఎంతసేపటికీ నీళ్ళు రాకపోయేసరికి అక్కడ వ్రాసియున్న కొన్ని సూచనలను గమనించాడు. అవేవనగా ఈ నీటి పంపు క్రింద ఓ పెద్ద నీళ్ళ సీసా ఉంది ఆ నీళ్ళను ఈ పంపులో పోసి
మరలా ఆడిస్తే త్రాగినన్ని నీళ్ళు ఇస్తుంది చివరిగా వెళ్లేముందు
మరలా ఆ సీసాను నింపి అక్కడ పెట్టి వెళ్ళండి ఈ మార్గంలో వెళ్ళే వారికి కూడా ఉపయోగపడుతుంది అని వ్రాసియుంది.
నిజంగా బహు దాహంగా ఉన్న అతడు ఈ నీళ్ళు అందులో పోసినట్లయితే
మరలా నీళ్ళు రాకపోతే అనే సందేహం ఉన్నట్లయితే కేవలం అతడు మాత్రమే దప్పికను తీర్చుకున్న వాడవుతాడు. కాని సూచనల ప్రకారం చేసినట్లయితే ఇతరులకు కూడా దప్పిక తీర్చుటకు కారకుడవుతాడు. క్రీస్తే ఈ నీటి బుగ్గ, సజీవమైన నీళ్ళు. మనము మన తరువాత వారు కూడా ఇట్టి ధన్యత పొందాలి అంటే ముందు మనలను మనము ఖాళీ చేసుకొని తన చేతుల్లోకి సమర్పించువాలి. అప్పుడే జీవితం ఓ నైతికమైనదై యుంటుంది
మరియు మనము ప్రయాణించే ఈ జీవితము కూడా అర్ధవంతమైనదై తరువాత వారికి మార్గదర్శిణిగా యుంటుంది.
అట్టి నిదర్శనమైన జీవితాన్ని జీవించే కృప ప్రభువు మనందరికీ దయచేయును గాక.
ఆమేన్.