విశ్వాసంలో స్థిరత్వము
ఈ దినాల్లో ప్రపంచ దేశాలు ఆర్ధిక మాంద్యంతో అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్నాయి. కారణం కరోనా మహమ్మారి అటు దేశ ప్రజలను ఇటు ఆర్ధిక సామాజిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసేసింది. స్టాక్ మార్కెట్ పడిపోయే సరికి పెట్టుబడి
దారులందరూ నష్టపోయిన పరిస్థితి కనబడుతుంది. అయితే, డబ్బును పెట్టుబడి పెట్టడంలో వాస్తవాన్ని... నాకు తెలిసిన ఆర్ధిక సలహా
దారుడొకరు ఇలా వివరించారు “ఉత్తమమైన దానికొరకు నిరీక్షణగలవారై ఘోరమైన దానికి సిద్ధపడియుండండి”. నిజానికి ఈ మాట ప్రస్తుత పరిస్థితుల ద్రుష్ట్య వాస్తవమే అనిపిస్తుంది కదా.
జీవితంలో మనం తీసుకునే ప్రతి నిర్ణయానికి ఫలితం విషయంలో అనిశ్చిత స్థితి ఉంటుంది. ఏమి సంభవించినా మనం అనుసరించగల మర్గం ఉన్నప్పటికీ, చివర్లో మన ప్రయాస వృధా కాదని అర్ధం అవుతుంది.
నైతిక దుర్నీతికి
పేరుమోసిన
కొరింథు పట్టణంలో అపో.పోలు ఒక సంవత్సర కాలం పాటు వారి మధ్య పరిచర్య చేసి. తాను అక్కడ నుండి వెళ్ళిపోయాక కొరింథీ సంఘానికి లేఖ ద్వారా బలపరుస్తూ... నిరుత్సాహపడవద్దని,
క్రీస్తుకు వారు సాక్షులుగా ఉన్నందున విలువలేదను భావన కలిగియుండ వద్దని చెప్పాడు. ప్రభువు తిరిగి రానైయున్న రోజు త్వరలోనే వస్తుందని, విజయమందు మరణముసైతం మ్రింగివేయబడుతుందని చెప్పి వారిని ధైర్యపరిచాడు.(I కొరింథీ 15:52-55).
క్రీస్తును విశ్వసించడం కష్టమైనదిగా, నిరుత్సాహంగా, ప్రమాదకరంగా ఉండవచ్చు. అయితే విశ్వాసంలో స్థిరత్వము కలిగి ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులై, నిరీక్షణగలవారై యుండగలిగితే...ఘోరమైన పరిస్థితులగుండా ప్రయాణించినా ఫలబరితమైన జీవితం పొందగలం. ఆమెన్.