వీడ్కోలు
నిజంగా మీరు క్రైస్తవులైతే, మీ ఆత్మలో మీరు నూతనంగా చేయబడి క్షమించబడ్డారని గ్రహించండి. ఈ రోజు మీలో
యేసుక్రీస్తు యొక్క సజీవ వాహిని ప్రవహిస్తూ ఉంది, అది శాశ్వతమైనది. మీరు దేవునితో సత్ సంబంధం కలిగి జీవిస్తున్నప్పుడు, ఇది ఒక నూతన ఉత్సాహంతో పాటు చక్కని ప్రోత్సాహాన్ని కూడా దయజేతుంది. ఈ సజీవ వాహినియైన
యేసుక్రీస్తుతో మీరు మీ దప్పికను తీర్చుకున్నప్పుడు, మీ జీవితం సంపూర్ణంగా మారిపోతుంది.
ప్రతి నిరాశకు వీడ్కోలు.
ప్రతి సమస్యలకు వీడ్కోలు.
ప్రతి అడ్డంకులకు వీడ్కోలు.
ప్రతి తప్పుడు ఆశలకు వీడ్కోలు పలుకుతుంది.
ఇది ఈరోజు నీవు జీవిస్తున్న జీవితానికి మాత్రమే కాదు కాని, నీలో చిగురించే ఈ ప్రవాహం శాశ్వతమైనదని గ్రహించాలి.
ఈ రోజు మనకోసం
యేసుక్రీస్తు తన వాగ్ధానాన్నిస్తున్నాడు ...
యోహాను 4:14 నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు; నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను.
ప్రవాహం ఎప్పుడూ పారుతూనే ఉంటుంది, అది ఎన్నాడుకూడా ఆగిపోదు. నిత్యత్వానికి మన దాహాన్ని తీర్చే సజీవ వాహిని అయిన
యేసు క్రీస్తు కోసం కదులుతూ
మరియు ఆయన కార్యాలు జరిగించడానికి మనమందరం అట్టి కృపను పొందగలగాలి.
దేవుడు అట్టి కృపను దయజేయును గాక. ఆమెన్.