అనుమానమనే పొగమంచు
కొన్ని దినములు ఇంగ్లాండ్ దేశంలో పర్యటించినప్పుడు, అందమైన లండన్ మహానగరంలో ఒక హోటల్లో బసచేశాను. ఆరోజు రాత్రి ౩ డిగ్రీల ఉష్ణోగ్రత, యెముకలు గడ్డకట్టే చలి. తెల్లవారుజామునే మెలుకువ వచ్చేసరికి, హోటల్ రూమ్ లో ఉన్న బాల్కనీలోనుండి గమనిస్తే సూర్యుడు ఉదయించినా, చీకటితో నిండుకొనిన దట్టమైన పొగమంచు. రాతివేత దూరంలో కూడా ఏమి కనిపించని పరిస్థితి. అయితే కొన్ని గంటల తరువాత సూర్యుడు మరింత ఉదయించడం మొదలుపెట్టాడు. పొగమంచు విడిపోవడం మొదలుపెట్టింది. మరి కొన్ని గంటల తరువాత, ప్రశాంతమైన పచ్చిక ప్రదేశం, నీలిరంగు ఆకాశం, ఆకాశ హర్మ్యాలను చూడగలిగాను.
కొన్ని సార్లు నిరుత్సాహమనే దట్టమైన మంచుతో జీవితం కప్పబడియుండొచ్చు. మనకుండే పరిస్థితులు మనము ఆశ వదులుకునేటంత అందకారమయంగా ఉండొచ్చు. అయితే సరిగ్గా సూర్యుడెలా మంచును కరిగిస్తాడో అలాగే దేవునిలో మనకుండే విశ్వాసం అనుమానమనే పొగమంచును కరిగిస్తుంది. “విశ్వాసమనునది నిరీక్షింపబడువాటియొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై యున్నది” హెబ్రీ 11:1 ఈ వాక్యం విశ్వాసానికి నిర్వచనం.
చూడని సంగతులనుగూర్చి దేవునిచేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడైన
నోవహు, ఎక్కడికి వెళ్ళవలేనో ఎరుగకపోయినా
దేవుడు చూపించిన దిశగా బయలుదేరిన అబ్ర
హాము...వంటి విశ్వాసము మనకును ఉండగలిగితే, మనం దేవుణ్ణి చూడలేకపోయినా, అనేక సార్లు ఆయన సన్నిధిని అనుభవించలేక పోయినా,
దేవుడు ఎల్లప్పుడు ఉన్నవాడై, మన అందకారబంధురమైన చీకటని పారద్రోలే శక్తిమంతుడు అని విశ్వసించినప్పుడు తప్పకుండా సహాయము చేస్తాడు. అట్టి విశ్వాసమును కలిగియుండుటకు ప్రయత్నిద్దామా. ఆమెన్.