కనురెప్ప


  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 1
  • Reference: Sajeeva Vahini

కనురెప్ప 

దేవుడు ఒక కనురెప్పను పోలియున్నాడు” అనే సంగతిని ఒక స్నేహితునికి వివరించాను. ఆశ్చర్యపోయిన అతడు కనురెప్పను వేసి అర్ధమయ్యేవిధంగా వివరించు అన్నాడు. మనం కూడా ఒకసారి కనురెప్పను వేసి దాని వెనుక ఉన్న మర్మాన్ని నేర్చుకుందామా.

బైబిలులోని దేవుని పోలిన ఆశ్చర్యకరమైన చిత్రాలను గూర్చి ధ్యానిస్తూ ఉంటే, దేవుడు ప్రసవ వేదన పడే స్త్రీవలె తనను పోల్చుకుంటూ (యెషయా 42:14) లేదా జోరీగలనుండి, కందిరీగలనుండి ఈలవేసి కపాడేవానిగా (యెషయా 7:18) గమనించగలం. ఈ వాక్యములు చదివినప్పుడు క్రొత్తగా అనిపించవచ్చు. వాస్తవంగా ద్వితి 32లో దేవుడు తన ప్రజలను సంరక్షించుకునే విధానాన్ని మోషే ఏ విధంగా స్తుతించాడో గమనిస్తే, దేవుడు తన ప్రజలను “కంటి పాపవలె” బధ్రపరుస్తాడు, కాపాడుతాడు అని 10వ వచనంలో గమనించగలం.

కనురెప్ప లేదా కనుపాపను క్షుణ్ణంగా గమనిస్తే, ఏది కనుపాపను చుట్టుముట్టి కాపాడుతుంది కనురేప్పే కదా! ప్రమాదం నుండి కంటిని కనురెప్ప బధ్రపరుస్తుంది, కంటిలోని మలినాన్ని తొలగించడానికి సహాయపడుతుంది, కనుగృడ్డు యొక్క రాపిడిని తగ్గిస్తుంది, కంటిని ఆరోగ్యంగా ఉంచుతుంది, కాంతిని మూసియుంచుతుంది, విశ్రాంతి తీసుకునేలా చేస్తుంది.  

దేవుని గూర్చిన చిత్రాన్ని కనురెప్పలా ఊహించుకున్నప్పుడు, అనేక ఉపమానాలను బట్టి దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేము. ఇట్టి అనుభవం పొందిన మనం - రాత్రి వేళ కనురెప్ప మూసి, ఉదయాన్నే తెరిచినప్పుడు మనం దేవుణ్ణి గురించి ఆలోచించగలం, మన కొరకు ఆయన మృదువైన కాపుదల, బధ్రతకొరకు దేవుణ్ణి స్తుతించగలం. హల్లెలూయ!. దినారంభము మొదలుకొని దినాంతము వరకు కంటిపాపవలె దేవుడు మనందరినీ కాపాడును గాక. ఆమెన్.


Telugu Audio: https://youtu.be/V4JEy6936R0