40 Days - Day 1 - స్తెఫెను - మొదటి క్రైస్తవ హతసాక్షి
అపొ. కార్యములు 7 : 55-56 అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఆకాశము వైపు తేరి చూచి, దేవుని మహిమను
యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి యుండుటను చూచి ఆకాశము తెరవబడుటయు, మనుష్యకుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి యుండుటయు చూచుచున్నానని చెప్పెను.
స్తెఫెను,
క్రీస్తు యొక్క అంకితమైన అనుచరుడు. విశ్వాసం
మరియు పరిశుద్ధాత్మతో నిండియుండి, ప్రారంభ క్రైస్తవ సమాజానికి సేవ చేయడానికి ఏడుగురిలో ఒకడిగా నియమింపబడి, దేవుని వాక్యము బోధించుట మాత్రమే కాదు గాని, ఆహారము పంచిపెట్టుట వంటి పరిచర్య బాధ్యతలును బట్టి ప్రశంశించబడ్డాడు.
అయితే, తన స్వంత వారి నుండి వ్యతిరేకత, హింసను ఎదుర్కొన్నప్పటికీ,
క్రీస్తు పట్ల అతని అంకితభావం, శక్తివంతమైన బోధన చాలా మందిని ఆకర్షించాయి. ధైర్యంగా సువార్తను ప్రకటిస్తూ, స్తెఫెను నిర్భయంగా సత్యాన్ని మాట్లాడి, అనేకమంది హృదయాలను కదిలించడం మొదలుపెట్టాడు.
దైవదూషణ వంటి నేరారోపణలతో స్తెఫెనును మహాసభ ముందు నిలబెట్టినప్పుడు, ఒక దేవదూత ముఖాన్ని పోలిన ప్రకాశవంతమైన కాంతి అతని ముఖాన్ని అలంకరించింది. స్తెఫెను తనను తాను సమర్థించుకునే బదులు, దేవుని గొప్పతనం గురించి
మరియు
యేసుక్రీస్తులో ఆయన వాగ్దానాల నెరవేర్పు గురించి సాక్ష్యమిచ్చే అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. ఉద్వేగభరితమైన విశ్వాసంతో,
ఇశ్రాయేలు చరిత్రను వివరించాడు. అంతే కాదు ఎవరైతే
మెస్సీయను తిరస్కరిస్తున్నారో వారిని మందలింపుతో బహిర్గతం చేశాడు.
స్తెఫెను యొక్క కదలని విశ్వాసాన్ని చూసిన ఆ మహాసభ సభ్యులు కోపంతో రగిలిపోయారు
మరియు యూదుల అధికారులు అతనిని రాళ్లతో కొట్టి చంపినప్పటికీ అంతం వరకు అతని విశ్వాసం తన ప్రాణం కంటే బలమైనదని నిరూపించుకున్నాడు. ఆది సంఘంలో
క్రీస్తు కొరకు మొట్టమొదటి హతసాక్షి
అయ్యాడు. తన చివరి క్షణాలలో, స్తెఫెను తనను హింసించేవారి కోసం ప్రార్థించాడు, " ప్రభువా, వారిమీద ఈ పాపము మోపకుము" (అపొస్తలుల కార్యములు 7:60) అనే కలువరిలోని
క్రీస్తు ప్రేమ మాటలను ప్రతిధ్వనించాడు.
స్తెఫెను జీవన్మరణాల ద్వారా, ధైర్యం, దృఢవిశ్వాసం
మరియు క్షమాపణ వంటి అద్భుతమైన లక్షణాలను మనకు గుర్తుచేస్తుంది. అతని జీవితం ప్రమాదంలో ఉందని తెలిసినప్పటికీ,
క్రీస్తు పట్ల అతని అచంచలమైన అంకితభావం ఎన్నడూ కూడా తగ్
గలేదు.
ప్రియమైన స్నేహితులారా, మనంకుడా అటువంటి ధృడ విశ్వాసపు అడుగుల్లో ధైర్యంగా సువార్తను ప్రకటించగలిగితే, మనలను మోసుకెళ్లడానికి దేవుని అచంచలమైన శక్తి మనల్ని నడిపిస్తుంది.
మరియు స్తెఫెను తనను హింసించిన వారిని క్షమించినట్లే, మన ప్రభువును రక్షకుడైన
యేసుక్రీస్తు మనకు నేర్పిన మాదిరిని అనుసరించి, మనం కూడా అట్టి క్షమాపణకు ఉదాహరణగా జీవిచాగలుగుతాము.
దేవుడు మిమ్ముని ఆశీర్వదించును గాక. ఆమెన్.
SajeevaVahini.com