40 Days - Day 16
క్రీస్తు కొరకు హతసాక్షి స్ముర్ణకు చెందిన పాలీకార్ప్
టర్కీ దేశంలో స్ముర్ణ అనే పట్టణానికి చెందిన పాలీకార్ప్, ప్రారంభ క్రైస్తవ దినాలలో, మహోన్నతమైన వ్యక్తి, అచంచలమైన విశ్వాసం, ధైర్యం
మరియు
క్రీస్తు పట్ల భక్తిని ప్రదర్శించినవాడుగా గమనించగలం. అతని జీవితం నాడు ఆది సంఘంలోని వారిని నేడు మనల్ని కూడా ప్రేరేపిస్తూ, హింసల మధ్య
క్రీస్తు గొప్పతనాన్ని, ఆయన శక్తిని ప్రదర్శించేలా సూచిస్తుంది.
పాలీకార్ప్, అపొస్తలుడైన
యోహాను యొక్క శిష్యుడు. ఆధునిక టర్కీలోని స్ముర్ణ సంఘానికి బిషప్ గా పనిచేస్తూ, అపొస్తలుల నుండి వచ్చిన ప్రతి బోధనలను అనుసరించాడు. తన జీవితమంతా,
యేసుక్రీస్తు పట్ల తాను కలిగియున్న విశ్వాసంలో స్థిరంగా నిలబడ్డాడు.
క్రీ.శ. 155లో, పాలికార్ప్
రోమా అధికారుల క్రింద తీవ్రమైన హింసను ఎదుర్కొన్నాడు. ఎప్పుడైతే తనకున్న విశ్వాసాన్ని వదిలిపెట్టి దేవుని దూషించి,
రోమా అధికారులను , అన్యదేవతలను ఆరాధించమని బలవంతం చేశారో, అతను
క్రీస్తుపై తన విశ్వాసాన్ని బట్టి వెనుకంజ వేయలేదు. అందును బట్టి ఎన్నో హింసలు, మరణ బెదిరింపులు, నేరారోపణలు ఉన్నప్పటికీ, పాలికార్ప్ తన విశ్వాసంలో రాజీ పడలేదు. అట్టి హింసల మధ్య - "ఎనభై
ఆరు సంవత్సరాలు నేను
క్రీస్తును సేవిస్తున్నాను. ఆయన నా విషయంలో ఎలాంటి పొరపాటు కూడా చేయలేదు. అలాంటప్పుడు నేను నా దేవుని ఎందుకు దూశించాలి?" అని
అన్నాడు.
మత్తయి 10:28
మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని, ఆత్మను దేహమునుకూడ నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి.
పాలీకార్ప్ యొక్క అచంచలమైన విశ్వాసం
మరియు
క్రీస్తును తిరస్కరించడానికి నిరాకరించడం అతని మరణానికి
దారితీసింది. తన విశ్వాసాన్ని బట్టి, ఒక కొయ్యపై కాల్చబడ్డాడు. మరణాన్ని ఎదుర్కొన్నప్పటికీ, పాలీకార్ప్, సువార్త యొక్క సత్యానికి సాక్ష్యమివ్వడంతోపాటు తన జీవితాన్ని
క్రీస్తు చేతుల్లోనికి అప్పగించుకున్నాడు.
పాలీకార్ప్ జీవితం
క్రీస్తు పట్ల మన స్వంత నిబద్ధతను పరిగణించమని సవాలు చేస్తుంది. వ్యతిరేకత లేదా హింసను ఎదుర్కొన్నప్పుడు కూడా మన విశ్వాసంలో స్థిరంగా నిలబడేందుకు మనం సిద్ధంగా ఉన్నామా? కష్టాలు
మరియు బాధల మధ్య కూడా మనం దేవుని సార్వభౌమాధికారం
మరియు విశ్వసనీయతను నిజముగా విశ్వసిస్తున్నామా?
పాలీకార్ప్ వలే ,
క్రీస్తుతో మనకున్న సంబంధాన్ని బట్టి బలాన్ని పొంది, ఎదుర్కోబోయే ప్రతి పరీక్షలో, ప్రతి క్రియలో ఆయన మనతో ఉన్నాడని నేర్చుకుందాం. ఆయన ప్రియ కుమారుడు రక్షకుడైన
యేసుక్రీస్తు పట్ల మన విశ్వాసంలో స్థిరంగా ఉంటూ, అచంచలమైన విశ్వాసాన్ని
మరియు ధైర్యాన్ని మనం అనుకరిద్దాం. ఆమెన్.
40 Days - Day 16.
Polycarp of Smyrna: A Testament of Unyielding Faith and Martyrdom
Polycarp of Smyrna, a towering figure in early Christianity, serves as a beacon of unwavering faith, courage, and devotion to Christ. His life and martyrdom inspire believers throughout the ages, demonstrating the power of Christ-s presence in the midst of persecution.
Polycarp was a disciple of the apostle John and became the bishop of Smyrna, a city in modern-day Turkey. Throughout his life, Polycarp remained steadfast in his commitment to Jesus Christ, faithfully shepherding the church in Smyrna and upholding the teachings passed down from the apostles.
In AD 155, Polycarp faced severe persecution under the Roman authorities, who demanded that he renounce his faith in Christ and worship the emperor. Despite the threats of torture and death, Polycarp refused to compromise his convictions, declaring, "Eighty and six years have I served Him, and He has done me no wrong. How then can I blaspheme my King and Savior?"
"And do not fear those who kill the body but cannot kill the soul. Rather fear him who can destroy both soul and body in hell." - Matthew 10:28
Polycarp-s unwavering faith and refusal to deny Christ led to his martyrdom. He was burned at the stake, yet even in the face of death, Polycarp remained resolute, bearing witness to the truth of the Gospel and entrusting his life into the hands of his Savior.
Polycarp-s life challenges us to consider our own commitment to Christ. Are we willing to stand firm in our faith, even when confronted with opposition or persecution? Do we trust in God-s sovereignty and faithfulness, even in the midst of trials and suffering?
Like Polycarp, may we draw strength from our relationship with Christ, knowing that He walks with us through every trial and tribulation. May we emulate his unwavering faith and courage, remaining steadfast in our devotion to Jesus Christ, our King and Savior. Amen.
SajeevaVahini.com