బ్రూక్లిన్ బ్రిడ్జ్ 1883లో పూర్తయిన తరువాత, అది “ప్రపంచంలోని ఎనిమిదవ అద్భుతంగా పేరుగాంచింది. అయితే నిర్మాణం ఫలవంతం కావడానికి ఒక వంతెన గోపురం నుండి మరొక వంతెనకు ఒకే, సన్నని తీగ వేయడం చాలా అవసరం. ఒక భారీ తీగతో పాటు మరో మూడింటిని కలిపి నేసినంత వరకు మొదటిదానికి అదనపు వైర్లు జోడించారు. పని పూర్తయిన
తరువాత, ప్రతి తీగ - ఐదు వేల కంటే ఎక్కువ గాల్వనైజ్డ్ తీగలతో రూపొందించారు. ఆ రోజులలో ఆ తీగె పొడవైన వేలాడుతున్న వంతెనకు సహకారాన్ని ఇచ్చింది. అల్పంగా ప్రారంభమైన ఈ తీగ, బ్రూక్లిన్ వంతెనకు అత్యంత అవసరమైన భాగంగా ఏర్పడింది.
యేసు ప్రభువు జీవితం సాధారణంగా ప్రారంభమైంది
ఒక చిన్న శిశువుగా జన్మించి, ఒక చిన్న పట్టణంలో, తొట్టిలో పండుకున్నాడు. (లూకా 2:7). ప్రవక్త అయిన మీకా యేసు ఫ్రభువుకు చెందిన దీనమైన పుట్టుకను ప్రవచించాడు, “బేత్లెహేము ఎఫ్రాతా, యూదా వారిలో నీవు స్వల్పగ్రామమైనను...
ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును”(మీకా 5:2; మత్తయి 2:6 కూడా చూడండి). ఒక అల్పమైన ప్రారంభమే, అయితే ఈ ఏలబోవువాడు,కాపరి తన కీర్తిని, ఉద్దేశాన్ని “భూదిగంతములవరకు ప్రభలడం” ఆయన చూస్తాడు (మీకా 5:4).
యేసు ఒక చిన్న ప్రదేశంలో దీనుడిగా జన్మించాడు, భూమిపై ఆయన జీవితం “తన్ను తాను తగ్గించుకొనిన”, నేరస్తుని వలె “సిలువలో” ముగిసింది (ఫిలిప్పీయులు 2:8).
అయితే,
ఆయన అపారమైన త్యాగసహిత మరణం ద్వారా మనకూ దేవునికీ మధ్య ఉన్న దూరమును
తొలగించేశాడు విశ్వసించే వారందరికీ రక్షణను అందించాడు. ఈ వ్యవధిలో, మీరు విశ్వాసంతో, యేసులో దేవుని గొప్ప
బహుమతిని పొందండి. విశ్వసించినట్లయితే, మీకోసం ఆయన చేసిన దానంతటికై వినయంతో స్తుతించండి.
దేవుడు నీ హృదయంలో ఎలాంటి చిన్న లేదా పెద్ద పని చేస్తున్నాడు?
నీవు వినయంగా ఆయనకు ఎలా ప్రతిస్పందిస్తావు??
యేసు, నీ గొప్ప త్యాగం ద్వారా నన్ను రక్షించడానికి దీనుడిగా
వచ్చినందుకు వందనాలు.
- టామ్ ఫెల్టెన్
ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి! ఫిలిప్పీయులకు 4:4