ఆస్ట్రేలియాలోని పెంపుడు జంతువుల సంరక్షణ సంస్థలోని స్వచ్చంద కార్యకర్తలు మురికిగా, జటిలమైన ఉన్నితో సంచరిస్తున్న 34 కిలోల గొర్రెను కనుగొన్నారు. కనీసం ఐదేళ్ళుగా పొదల్లో ఆ గొఱ్ఱె తప్పిపోయి ఉండవచ్చు అని సంరక్షకులు అనుమానం వ్యక్తం చేసారు. కార్యకర్తలు, వాలంటీర్లు ఆ బరువైన ఉన్నిని కత్తిరించే అసౌకర్య ప్రక్రియ ద్వారా దానికి ఉపశమనం కలిగించారు. తన భారం నుండి విముక్తి పొందిన తర్వాత, అది ఆ
హారాన్ని తినింది. దాని కాళ్ళు బలపడ్డాయి. అభయారణ్యంలో తన సంరక్షకులతోను, ఇతర జంతువులతోను గడిపినందున అది మరింత నమ్మకం, సంతృప్తి పొందింది.
కీర్తనకారుడైన
దావీదు మరింత భారముతో అణిగిపోవడం, నష్టపోవడం, నిర్లక్ష్యానికి గురవ్వడం, సహాయం కోసం ఎదురు చూడడంలో ఉన్న బాధను అర్థం చేసుకున్నాడు. 38వ కీర్తనలో,
దావీదు దేవునికి మొరపెట్టాడు. అతడు ఒంటరితనం, ద్రోహం, నిస్సహాయతను అనుభవించాడు (వ. 11-14). అయినప్పటికీ, అతడు నమ్మకంతో ఇలా ప్రార్థించాడు: “
యెహోవా, నీ కొరకే నేను కనిపెట్టుకొనియున్నాను... నీవే ఉత్తరమిచ్చెదవు” (వ. 15-16).
దావీదు తన కష్టాలను నిరాకరించలేదు, అతని అంతర్గత గందరగోళం, శారీరక రుగ్మతలు తగ్
గలేదు (వ.లు. 16-20). బదులుగా,
దేవుడు సమీపంలో ఉంటాడని, సరైన సమయంలో, సరైన మార్గంలో అతనికి సమాధానం ఇస్తాడని అతడు విశ్వసించాడు (వ.లు. 21-22).
మనం శారీరకంగా, మానసికంగా, మనోవికారంతో భారంగా ఉన్నామని అనిపించినప్పుడు,
దేవుడు మనలను సృష్టించిన రోజు నుండి తన రక్షణ ప్రణాళికకు కట్టుబడి ఉన్నాడు. “రక్షణకర్తవైన నా ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము” (వ. 22) అని మనం ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన సన్నిధిని ఆశ్రయించిన వాళ్ళం అవుతాము.
నీవు భారంగా భావించినప్పుడు దేవుడు తన నమ్మకత్వాన్ని ఎలా వెల్లడించాడు? నిన్ను ఓదార్చుటకును, సహాయం చేయుటకును దేవుడు ఇతరులను ఎలా ఉపయోగించుకున్నాడు?
దయగల దేవా, భారంతో ఉన్న, నష్టపోయిన, నిర్లక్ష్యానికి గురైన ఇతరులను ప్రోత్సహించడానికి నాకు సహాయం చెయ్యండి.
- చోషితల్ డిక్సన్
నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను ఎడారిలో నదులు పారజేయుచున్నాను. [
యెషయా 43:19 ]