నూతన దర్శనం


  • Author: Our Daily Bread
  • Category: Our Daily Bread
  • Reference: Sajeeva Vahini

నేను మందిరంలోనికి అడుగు పెట్టగానే నా క్రొత్త కళ్ళజోడు ధరించి కూర్చున్నాను, నడవ అవతలి వైపున నేరుగా కూర్చున్న స్నేహితురాలిని గుర్తించాను. నేను ఆమె వైపు చెయ్యి ఊపుతుండగా, ఆమె చాలా దగ్గరగా ఉన్నట్లు స్పష్టంగా కనిపించింది. ఆమె చాలా గజాల దూరంలో ఉన్నప్పటికీ నేను ఆమెను చేరుకుని తాకగలను అని అనిపించింది. తరువాత, ఆరాధన అనంతరం మాట్లాడుతున్నప్పుడు, ఆమె ఎప్పుడూ కూర్చునే సీటులోనే ఆమెఉందని నేను గ్రహించాను. నా క్రొత్త కళ్ళజోడు కారణముగా నేను ఆమెను బాగా చూడగలిగాను.

యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతూ, బబులోను చెరలో ఉన్న ఇశ్రాయేలీయులకు నూతన దర్శనం అవసరమని దేవునికి తెలుసు. ఆయన వారికి చెప్పాడు. “నేనొక నూతనక్రియ చేయుచున్నాను!... నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను ఎడారిలో నదులు పారజేయుచున్నాను” (యెషయా 43:19). నిరీక్షణ కలిగించే ఆయన సందేశంలో ఆయన వారిని “సృజించినవాడు”, “విమోచించినవాడు”గా వారితో ఉంటాడని జ్ఞాపకము చేశాడు. “మీరు నా వారు”, అని వారిని ప్రోత్సహించాడు (వ. 1).
ఈ రోజు మీరు ఎదుర్కొంటున్న దేనిలోనైనా, పాతవి వెనకకు నెట్టి క్రొత్త వాటిని పొందుకొనుటకైన దర్శనమును పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. దేవునికి చెందిన ప్రేమ చేత (వ. 4), ఇది మీ చుట్టూ కనబడుతుంది. మీ బాధలలో, బానిసత్వపు కట్లలో దేవుడు ఏమి చేస్తున్నాడో మీరు చూడగలరా? మన అరణ్యపు అనుభవాలలో కూడా దేవుడు నూతన పరుచుచున్నవి చూచుటకు ఆత్మీయ నేత్రాలను పొందుకొందాము.

- కటారా పాటన్

నీ అరణ్యపు అనుభవాలలో నూతనంగా ఏర్పడుచున్న విషయాలు ఏంటి ? నీ దృష్టిని సర్దుకోవడం ద్వారా గతించిపోయిన వాటి మీద కాక నూతనంగా జరగబోయే వాటి మీద నీ దృష్టి కేంద్రీకరించుటకు ఏవిధంగా సహాయపడుతుంది?
నూతన ప్రారంభాలనిచ్చే దేవా, నీ వాగ్దానాలన్నింటికీ వందనాలు. నా అరణ్యపు అనుభవాలలో నీవు చేయు నూతన కార్యాలను చూచుటకు నాకు సహాయం చేయండి.

మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను. [ యోహాను 14:2 ]