ప్రభువా, నీవు ఎవరవు?


  • Author: Our Daily Bread
  • Category: Our Daily Bread
  • Reference: Sajeeva Vahini

పదహారేళ్ల వయసులో, లూయిస్ రోడ్రిగ్జ్ అప్పటికే కొకైన్ అమ్మినందుకు జైలులో ఉన్నాడు.

అయితే ఇప్పుడు, హత్యాయత్నం కారణంగా అరెస్టయ్యాడు, అతడు మరల జైలులో ఉన్నాడు - దానికి యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే దేవుడు అతని దోషపూరిత పరిస్థితులలో అతనితో మాట్లాడాడు. చెరసాలలో, యవ్వనుడైన లూయిస్ తన ప్రారంభ సంవత్సరాలను, తన తల్లి నమ్మకంగా సంఘానికి తీసుకువెళ్ళిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు తన హృదయాన్ని తాకుతున్నట్లు అతనికి ఇప్పుడు అనిపించింది. లూయిస్ చివరికి తన పాపాల విషయమై పశ్చాత్తాపపడి యేసు దగ్గరకు వచ్చాడు.

అపొస్తలుల కార్యాల గ్రంథంలో, మిక్కిలి శ్రద్ధగల యూదుడైన సౌలును మనం చూస్తాం, అతనికి పౌలు అని కూడా పేరు (అపొ. కా 9:1). అతడు ఒక విధంగా ఒక గుంపు నాయకుడిగా, స్తెఫనును చంపిన వారి గుంపులోనూ ఉన్నాడు (7:58). అయితే దేవుడు సౌలుకు దోషపూరిత పరిస్థితులలో అతనితో మాట్లాడాడు - దమస్కుకు వెళ్ళే మార్గంలో, సౌలు ఒక గొప్ప వెలుగును చూసి అంధుడయ్యాడు, యేసు అతనిని “నీవేల నన్ను హింసించు చున్నావు?” అని అడిగాడు. (9:4). సౌలు, “ప్రభువా, నీవెవడవవు?” అని సౌలు ప్రభువును అడిగాడు (వ. 5), అదే అతని నూతన జీవితానికి నాంది అయ్యింది. అతడు యేసు దగ్గరకు వచ్చాడు.

లూయిస్ రోడ్రిగ్జ్ యావజ్జీవ శిక్ష అనుభవించాడు అయితే చివరికి అతనికి పేరోల్ మంజూరయ్యింది. అప్పటి నుండి, అతడు అమెరికా దేశం, సెంట్రల్ అమెరికాలో జైలు పరిచర్యకు తన జీవితాన్ని అంకితం చేసుకొని దేవునికి సేవ చేశాడు.
మన వంటి చెడ్డవారిని విమోచించడమే దేవుని విశిష్టత. ఆయన మన హృదయాలను తాకి, అపరాధ భావంతో నిండిన మన జీవితాలతో మాట్లాడతాడు. బహుశా మనం మన
పాపాల విషయమై పశ్చాత్తాపపడి యేసు దగ్గరకు వచ్చే సమయం ఇదే. 

- కెన్నెత్ పీటర్ సేన్

నీవు ఏ అపరాధాన్ని అనుభవిస్తున్నావు లేదా అనుభవించావు? 
దేవుడు పిలుస్తున్నాడని లేదా నిన్ను తనవైపుకు తిరిగి పిలిచాడని నీవు 
ఎలా గ్రహిస్తావు?
ప్రియ యేసూ, నేను నీ నుండి దూరమయ్యాను, అయితే నీవు నా హృదయాన్ని తాకుతున్నట్లు నేను భావిస్తున్నాను. నా పాపాలను క్షమించుమని ప్రార్థిస్తున్నాను.


అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. [ రోమీయులకు 8:37 ]