అత్యధిక విజయులకంటే అధికం


  • Author: Our Daily Bread
  • Category: Our Daily Bread
  • Reference: Sajeeva Vahini

నా భర్త మా కుమారుని యొక్క లిటిల్ లీగ్ బేస్ బాల్ టీమ్‌కి కోచ్‌గా ఉన్నప్పుడు, అతడు ఆటగాళ్లకు సంవత్సరాంతపు పార్టీని బహుమతిగా ఇచ్చాడు, ఆ సమయంలో వారి అభివృద్ధిని గుర్తించాడు. ఆ కార్యక్రమంలో, అందరికన్నా చిన్నవాడైన డస్టిన్, నన్ను సంప్రదించాడు “ఈ రోజు మనం ఆటలో ఓడిపోలేదా?”

“అవును, ఓడిపోయారు” అన్నాను. “అయితే మీ వంతు కృషి చేసినందుకు మేము గర్విస్తున్నాం”
“గర్విస్తున్నాం తెలుసు,” అతడు చెప్పాడు. “అయితే మేము ఓడిపోయాము. కదా?”
నేను తల ఊపాను.
“అప్పుడు నేను విజేతగా ఎందుకు భావించాలి?” డస్టిన్ అడిగాడు.
నవ్వుతూ, “ఎందుకంటే నువ్వు విజేతవి” అన్నాను.
డస్టిన్ ఒక ఆటను ఓడిపోవడం అంటే ఎందుకు పనికిరాని వాడనని భావించాడు తన వంతు కృషి చేసినప్పటికీ. యేసును విశ్వసించేవారిగా, మన యుద్ధం క్రీడా మైదానానికి పరిమితం కాదు. అయినప్పటికీ, కష్టతరమైన జీవిత కాలాన్ని మన విలువకు ప్రతిబింబంగా చూడటం తరచుగా ఉత్సాహం కలిగిస్తుంది.

అపొస్తలుడైన పౌలు మన ప్రస్తుత బాధలకు, దేవుని పిల్లలుగా మనకు కలిగే మహిమకు మధ్య ఉన్న సంబంధాన్ని ధృవీకరించాడు. మన కోసం తన్ను తాను అర్పించుకొని, పాపముతో మనం పోరాడుతున్న యుద్ధంలో యేసు మన పక్షమున కార్యం చేస్తూ మనలను
ఆయన పోలికగా మారుస్తున్నాడు (రోమ 8:31-32). మనమందరం కష్టాలు, హింసలను అనుభవిస్తున్నప్పటికీ, దేవుని అచంచలమైన ప్రేమ మనకు పట్టుదలతో సహాయం చేస్తుంది (వ. 33-34). ఆయన పిల్లలుగా, మన విలువను నిర్వచించడానికి పోరాటాలను అనుమతించడానికి మనం శోధనకు గురవ్వచ్చు. అయితే, మన అంతిమ విజయం ఖాయం.
మార్గంలో మనం తడబడవచ్చు, అయితే మనం ఎల్లప్పుడూ “వీటన్నిటిలో అత్యధిక విజయం పొందినవారం” (vv. 35-39).
- చోషితల్ డిక్సన్

దేవుని యొక్క ప్రేమ మీద మీకున్న నమ్మకం మిమ్ములను ముందుకు 
కొనసాగిపోవుటకు ఎలా తోడ్పడింది? చాలా నష్టపోయిన తర్వాత కూడా ఆయన తన 
ప్రియమైన బిడ్డగా మీ విలువను ఎలా ధృవీకరించాడు?
తండ్రీ, విజయ స్తోత్రాలతో శోధనల ద్వారా పైకి లేవడానికి నాకు సహాయం 
చేసినందుకు నీకు వందనాలు.


... ప్రకటింపని మరియొక యేసును ప్రకటించినను, ... మీరు వానిని గూర్చి 
సహించుట యుక్తమే. [ 2 కొరింథీయులకు 11:4 ]