కీర్తనల 23:4 - గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడైయుందువు నీ దుడ్డుకఱ్ఱయు నీదండమును నన్ను ఆదరించును.
జీవితపు లోయలు చీకటిగా
మరియు అపారంగా అనిపించవచ్చు. కీర్తన 23:4 “గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడైయుందువు నీ దుడ్డుకఱ్ఱయు నీదండమును నన్ను ఆదరించును“. ఈ వాక్యం మనకు ఒక శక్తివంతమైన సత్యాన్ని గుర్తు చేస్తుంది: మనం ఎప్పుడూ ఒంటరిగా లేము. దేవుని ఉనికి లోయలను తొలగించదు కానీ, అది వాటిని అధిగమించే సామర్ధ్యం ఇస్తుంది. ఆయన దుడ్డుకర్ర మనలను రక్షిస్తుంది, ఆయన సన్నిధి మనకు మార్గనిర్దేశం చేస్తుంది
మరియు ఆయన ఉనికి మనం ముందుకు సాగడానికి ధైర్యాన్ని ఇస్తుంది.
కటిక చీకటిలో కూడా
దేవుడు మనతో ఉన్నాడని విశ్వసించినప్పుడు భయానికి ఇక స్థానమే ఉండదు. లోయలు మన గమ్యం కాదు – అవే విజయం వైపు
దారితీసే మార్
గాలు.
కాబట్టి, హృదయపూర్వకంగా దేవుణ్ణి విశ్వసిద్దాం. ఈ రోజు మీరు దేనిని ఎదుర్కొన్నా, మీరు ఒంటరిగా నడవరు. చీకటి ప్రదేశాలలో కూడా దేవుని వెలుగు ప్రకాశిస్తుంది
మరియు ఆయన ప్రేమ మిమ్మల్ని నడిపిస్తుంది. ఆయనను నమ్మండి
మరియు విశ్వాసంతో ముందుకు సాగండి. ఆమెన్.
Quote: వేసే ప్రతి అడుగులో ఈరోజు
దేవుడు మీతో పాటు నడుస్తూ, మిమ్మల్ని నడిపిస్తూ భద్రపరుస్తాడు.
Psalms 23:4 - Even though I walk through the valley of the shadow of death, I will fear no evil, for you are with me; your rod and your staff, they comfort me.
God Walks Beside You
Life-s valleys can feel dark and overwhelming. Psalm 23:4 “Even though I walk through the valley of the shadow of death, I will fear no evil, for you are with me; your rod and your staff, they comfort me”. This verse reminds us of a powerful truth: we are never alone. The presence of God doesn’t eliminate the valleys, but it transforms them. His rod protects us, His staff guides us, and His presence gives us courage to keep walking.
Fear loses its grip when we trust that God is with us, even in the shadows. The valley is not your final destination—it’s a passage leading to something greater.
So, take heart. Whatever you-re facing today, you don’t walk it alone. God’s light shines even in the darkest places, and His love will lead you through. Trust Him and press forward with confidence. Amen
Quote : No matter where life takes you today, God walks with you, guiding your steps and protecting you.